STOCKS

News


హెచ్చుతగ్గుల్లో పసిడి..!

Monday 16th April 2018
Markets_main1523858171.png-15527

ముంబై:- ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయంగా పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కోంటున్నాయి. వాణిజ్యయుద్ధ భయాలు, అమెరికా సిరియాపై దాడులకు దిగడంతో గత వారం చివరిరోజైన శుక్రవారం (ఏప్రిల్‌ 13న) 10 డాలర్లు పెరిగి 1347.90 డాలర్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ప్రారంభంతో  ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌(31 గ్రాములు) 1,349.80 డాలర్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 1342.80-1351.50 డాలర్ల మధ్య శ్రేణిలో కదలాడింది. ప్రస్తుతం​ ఔన్స్‌(31 గ్రాములు) 0.60 డాలర్లు స్వల్పంగా పెరిగి 1,348.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
దేశీయంగా పెరుగుదల:-
అంతర్జాతీయంగా పసిడి ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నా, దేశీయంగా మాత్రం స్ధిరంగా పెరుగుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం కావడం, దేశీయం మార్కెట్‌ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించడం తదితర కారణాలతో దేశీయ బులియన్‌ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ మార్కెట్‌ - ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధరలు రూ. 110 పెరిగి రూ.31217.00వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫలితాలు, ప్రపంచ సంకేతాలతోనే..

Monday 16th April 2018

ఈ వారం మార్కెట్‌పై నిపుణులు సమీప భవిష్యత్తులో సిరియా ఉద్రిక్తతల ప్రభావం  ఈ వారమే టీసీఎస్, ఇండస్‌ఇండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏసీసీ ఫలితాలు  నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు న్యూఢిల్లీ: అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాలు, ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ఈ వారం భారత్‌ మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాల కూటమి...గత శనివారం తెల్లవారుజామున సిరియాపై దాడులు జరిపిన ప్రభావం సమీప భవిష్యత్తులో మార్కెట్‌పై

బ్రోకరేజ్‌ల టాప్‌ టెన్‌ సిఫార్సులు..

Monday 16th April 2018

స్వల్పకాలంలో మంచి రాబడులు ఇచ్చే పది స్టాక్‌ ఐడియాలను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి.. ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండేషన్స్‌ 1. గ్లెన్‌మార్క్‌ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 621. స్టాప్‌లాస్‌ రూ. 555. రెండేళ్లుగా నేలచూపులు చూస్తోంది. ఈ సుదీర్ఘ కరెక‌్షన్‌ రూ. 500 స్థాయిల వద్ద ముగింపునకు వచ్చింది. ఈ స్థాయి వద్ద ఆరేడువారాలుగా బలమైన మద్దతు కూడగట్టుకోంది. ఇటీవలే కన్సాలిడేషన్‌ జోన్‌ నుంచి బయటకు వచ్చింది. వాల్యూంలు కూడా

Most from this category