STOCKS

News


వచ్చే మూడూ దశాబ్దాలూ బంగారమే

Friday 15th June 2018
news_main1529044979.png-17414

ముంబై: వచ్చే మూడు దశాబ్దాలూ బంగారం మార్కెట్‌ సానుకూలంగానే ఉంటుందని ప్రపంచ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) పేర్కొంది. 2048 నాటికి చైనా ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, భారత్‌ కూడా దాని అడుగుజాడల్లోనే అభివృద్ధి చెందనుండడంతో బంగారం వెలుగులు కొనసాగుతాయని అంచనా వేసింది. ప్రపంచంలో బంగారం వినియోగం అత్యధికంగా చైనా, భారత్‌లోనే ఉన్న విషయం తెలిసిందే. బంగారం డిమాండ్‌లో సగం ఆభరణాల రూపంలోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో నిరంతర అభివృద్ధి, చైనా, భారత్‌ తదితర వర్ధమాన దేశాల్లో మధ్య తరగతి వినియోగదారుల ప్రాతినిధ్యం పెరగడం బంగారం మార్కెట్‌కు సానుకూలతలుగా తన నివేదికలో పేర్కొంది. అయితే, బంగారం వెలుగులకు భౌగోళిక రాజకీయ పరంగా సవాళ్లు పొంచి ఉన్నాయని అభిప్రాయపడింది. అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలనూ ప్రస్తావించింది. అలాగే, యూరోప్‌లో దీర్ఘకాలం పాటు ఘర్షణ, పెరిగిపోతున్న వృద్ధ జనాభా అంశాలనూ ప్రతికూలతలుగా పేర్కొంది. పెరిగే ఆదాయాలే బంగారంపై పెట్టుబడుల డిమాండ్‌ను నడిపిస్తాయని, హెచ్చు, తగ్గులున్నప్పటికీ ఇది సానుకూలంగానే ఉంటుందని వివరించింది. టెక్నాలజీలోనూ బంగారం వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. బంగారానికి డిమాండ్‌ పెరిగినా, గతంతో పోలిస్తే సరఫరాలో పెరుగుదల నిదానంగానే ఉంటుందని అంచనా వేసింది.



You may be interested

8వ రోజూ ఫార్మా షేర్ల ర్యాలీ

Friday 15th June 2018

ముంబై:- మార్కెట్‌‍ మధ్యాహ్నాం సమయానికి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఫార్మా షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా సూచి వరుసగా ఎనిమిదో రోజూ లాభపడుతోంది. ఈ ఎనిమిది రోజుల్లో నిఫ్టీ ఫార్మా సూచీ ఏకంగా 15శాతం పెరగడం విశేషం. గత ఏడు రోజుల ర్యాలీని కొనసాగిస్తూ నేడు కూడా నిఫ్టీ ఫార్మా సూచీ 2.50శాతం లాభపడి 9,333ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.

బైబ్యాక్‌పై వక్రంగీ ‘తూచ్‌’

Friday 15th June 2018

5 శాతం క్షీణించిన షేరు గతంలో ప్రకటించిన బైబ్యాక్‌, డివిడెండ్‌ ప్రతిపాదనలను రద్దు చేస్తున్నట్లు వక్రంగీ ప్రకటించింది. బైబ్యాక్‌ బదులు ఆ మొత్తాన్ని కొత్త ఏటీఏంలు కొనేందుకు వెచ్చిస్తామని తెలిపింది. ఒక్కోటి రూ. 2 లక్షల చొప్పున 45వేల కేంద్రాలకు ఏటీఎంలు కొంటామని తెలిపింది. ప్రస్తుతం ఏటీంఎలకు కేటాయించిన మూలధన ప్రణాళికలు, పెరిగిన మార్కెట్‌ వ్యయాలను బేరీజు వేసుకొని మూలధన కేటాయింపు విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. ఐదువేల నెక్ట్స్

Most from this category