News


మార్కెట్లు తగ్గితే కొనడం... అదే మేం సూచించేది: క్వాంటం

Wednesday 16th May 2018
Markets_main1526479809.png-16511

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత మూడు నెలలుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న తీరు చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక అంశం మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా కర్ణాటకలో బీజేపీకి మెజారిటీ స్థానాలు కట్టబెట్టినా, అధికారానికి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో మన మార్కెట్ల గమనంపై క్వాంటం గ్రూపు వ్యవస్థాపకుడు సందీప్‌ టాండన్‌ తన అభిప్రాయాలను ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

 మార్కెట్లపై కర్ణాటక ఫలితాల ప్రభావం ఎలా ఉంటుంది?

బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తే అది మార్కెట్లకు ట్రిగ్గర్‌ అవుతుంది. ఎందుకంటే మార్కెట్లు ఈ స్థాయి నుంచి పెరిగేందుకు, తగ్గేందుకు సంకేతాల కోసం చూస్తున్నాయి. అయితే, స్వల్పకాలంలో కరెన్సీ, చమురు ధరల పరంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ 2018లో మొత్తం మీద భారత్‌, ఆసియా స్టోరీ సానుకూలంగానే ఉంటుంది. మార్కెట్లు తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయాలన్న విధానానికి కట్టుబడి ఉన్నాం.

 తగ్గడం 5 శాతమా లేక 10, 20 శాతమా?

బుల్‌ మార్కెట్లో 5 నుంచి 8 శాతమే తగ్గుదల. 20 శాతం కాదు. మన మార్కెట్లు బుల్‌ ర్యాలీలో ఉన్నాయని మేం భావిస్తున్నాం.

 కొన్ని స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ ఎక్కువగా తగ్గాయి. కానీ, నిఫ్టీ 10,900 స్థాయి వరకూ వెళ్లింది. ఎందుకని?

లిక్విడిటీ పరంగా చూస్తే అమెరికా మార్కెట్ల నుంచి నిధులు ఆసియాకు మళ్లుతున్నాయి. ఈ తరహా లిక్విడిటీ ఉన్నప్పుడు మొదటి ప్రభావం లార్జ్‌క్యాప్స్‌పైనే కనిపిస్తుంది. ఆ తర్వాతే మిడ్‌, స్మాల్‌క్యాప్‌లపై ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన దృష్టి లార్జ్‌ క్యాప్‌లపైనే ఉంది. ఫలితాలు బాగున్న ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేటు బ్యాంకులు, కొన్ని ఆటో కంపెనీలు వీటిలో ఉన్నాయి. ఎంపిక చేసిన స్టాక్‌ వారీగా కదలికలు ఉన్నాయి. దిద్దుబాటు జరిగినా మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల బేరిష్‌ ధోరణితో లేము. వ్యాల్యూ ఉన్న స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

 ఎన్నికల ముందు, రాజకీయ స్థిరత్వం కీలకమైన సమయంలో మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి?

చాలా అంశాలను ఇప్పటికే మార్కెట్లు సర్దుబాటు చేసుకున్నాయి. భారత్‌లో రిస్క్‌ అన్నది ప్రస్తుతం తక్కువ స్థాయిలోనే ఉంది. లిక్విడిటీ పెరుగుతుండడం మార్కెట్లకు మద్దుతుగా ఉంది. మార్కెట్లు మరింత పెరిగేందుకు వీలుంది. 14,400 వరకు నిఫ్టీ వెళుతుందన్న అంచనాలను కొనసాగిస్తున్నాం. అది 2019-20లో సాధ్యం కావచ్చు. ఆ స్థాయి వరకు మన మార్కెట్లు పెరుగుతాయి. నిధులు తరలివస్తున్న ఈ దశలో మన మార్కెట్ల గమనంపై ఆందోళన అక్కర్లేదు. You may be interested

చిన్న బ్యాంకుల్లో వడ్డీ ఎక్కువే... మరి భద్రత?

Wednesday 16th May 2018

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మన దేశంలో గత రెండేళ్ల కాలంలో కొలువు దీరాయి. ఇవి డిపాజిట్లపై ప్రధాన బ్యాంకులతో పోలిస్తే కాస్తంత ఎక్కువ వడ్డీని ఆఫర్‌ చేస్తున్నాయి. రిస్క్‌ తీసుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లకు ఒక శాతం వడ్డీ అదనం అంటే తేలిగ్గా తీసిపారేసే విషయం అయితే కాదు. మరి చిన్న బ్యాంకుల్లో అధిక వడ్డీ ఆదాయం కోసం డిపాజిట్‌ చేస్తే భద్రత ఎంత వరకూ...? అన్న సందేహం రావచ్చు.  అధిక వడ్డీ

కర్ణాటక పోరు: మార్కెట్‌ బేజారు..!

Wednesday 16th May 2018

10800 దిగువకు నిఫ్టీ ముంబై:- కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి కారణంగా బుధవారం ట్రేడింగ్‌లో ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్‌ చివరకు నష్టాలతో ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌ ఇండస్ట్రీ, సిప్లా, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ వంటి హెవీవెయిట్‌ షేర్లు 4నుంచి1శాతం నష్టపోవడంతో సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 156 పాయింట్లు నష్టపోయి 35,388 వద్ద, నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 10,741 వద్ద ముగిశాయి.

Most from this category