News


పీఎన్‌బీ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 16th May 2018
Markets_main1526458878.png-16504

అధ్వాన్న ఫలితాలే కారణమన్న బ్రోకరేజ్‌లు
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యంత అధ్వాన్న ఫలితాలు ప్రకటించిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు బ్రోకరేజ్‌లు షాక్‌ ఇచ్చాయి. బ్యాంకు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
- ఎడెల్‌వీస్‌: రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించుకోండికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను మాత్రం యధాతధంగా రూ.70 వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎదురుగా ఉన్న సవాళ్లు, అస్థిరతలు బ్యాంకుపై నమ్మకానికి సవాల్‌ అని తెలిపింది. ఇవన్నీ కలిపి బ్యాంకు  వాల్యూషన్‌, అనుబంధ విభాగాల పనితీరుపై ఒత్తిడి పెంచుతాయని పేర్కొంది. తాజా ఫలితాల అనంతరం పీసీఏ పరిధిలోకి వచ్చే ముప్పు కూడా పీఎన్‌బీకి పొంచిఉందని హెచ్చరించింది.
- నోమురా: రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించుకోండికి డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ ధరను రూ. 115 నుంచి రూ.75కి తగ్గించింది. తాజాగా ప్రకటించిన నష్టాలు ఇకమీదట పలుమార్లు బ్యాంకు నిధుల సమీకరణకు పూనుకునేందుకు దోహదం చేస్తాయని తెలిపింది. దీంతో మరో 70 శాతం డైల్యూషన్‌ జరగవచ్చని అంచనా వేసింది.
- మోతీలాల్‌ ఓస్వాల్‌: రేటింగ్‌ను కొనొచ్చు నుంచి న్యూట్రల్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ను రూ. 160 నుంచి రూ. 85కి తగ్గించింది. దీంతోపాటు లాభాల భవిష్యత్‌ అంచనాలను సైతం కట్‌ చేసింది. 
- క్రెడిట్‌ సూసీ: రేటింగ్‌ను అవుట్‌పెర్ఫామ్‌ నుంచి న్యూట్రల్‌కు తగ్గించి టార్గెట్‌ ధరను రూ. 188 నుంచి రూ. 88కి డౌన్‌గ్రేడ్‌ చేసింది. మూలధనవిలువ క్షీణత లోన్‌బుక్‌ కుదించేందుకు దోహదం చేస్తుందని హెచ్చరించింది. వచ్చే ఏడాది కూడా బ్యాంకు నష్టాలే నమోదు చేయవచ్చని అంచనా వేసింది. 
- జెఫర్రీస్‌: రేటింగ్‌ను హోల్డ్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ రూ. 80. ప్రభుత్వం తక్షణమే బెయిల్‌ అవుట్‌ ఇచ్చి ఆదుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపింది. భవిష్యత్‌లో పలు కార్యనిర్వాహక సవాళ్లు ఎదుర్కోవాల్సిఉంటుందని హెచ్చరించింది.
- మోర్గాన్‌ స్టాన్లీ: రేటింగ్‌ను ఓవర్‌వెయిట్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ రూ. 125. బ్యాంకు తొలిసారి అత్యంత భారీ నష్టాలు చవిచూసిందని తెలిపింది. You may be interested

మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ మరీ అధికం: కొటక్‌ ఎమ్‌ఎఫ్‌

Wednesday 16th May 2018

ముంబై: రికార్డు స్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 10 శాతం పడిపోయిన తరువాత మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యి కాస్త ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ.. వాల్యుయేషన్స్‌ పరంగా చూస్తే మాత్రం ఏమంత ఆకర్షణీయంగా లేవని కొటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఈక్విటీ సీఐఓ హర్ష ఉపాధ్యాయ అన్నారు. ఇప్పుడు ఉన్న వాల్యూయేషన్స్‌ ఇంతకుముందు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్నాయన్న ఆయన చరిత్రలో ఎప్పుడూ చోటుచేసుకోనంతటి మల్టిపుల్స్‌ వద్ద మార్కెట్‌ ట్రేడవుతుందని విశ్లేషించారు. ఇటువంటి పరిస్థితి

ఆర్‌కామ్‌కు ఎరిక్సన్‌ షాక్‌..!

Wednesday 16th May 2018

ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌  20శాతానికి పైగా నష్టపోయిన షేరు ముంబై:- రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు వ్యతిరేకంగా టెక్నాలజీ దిగ్గజం ఎరిక్సన్‌ ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ ధాఖలు చేయడంతో బుధవారం ఆర్‌కాం షేర్లు 20శాతానికి పైగా పతనమయ్యాయి. ఆర్‌కామ్‌కు చెందిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు 2014లో ఎరిక్సన్‌ ఏడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బిల్లు చెల్లింపుల్లో ఆర్‌కాం విఫలమైంది. దీంతో ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థల నుంచి రూ.1,150 కోట్ల బకాయిలను రాబట్టేందుకు ఎరిక్సన్‌

Most from this category