STOCKS

News


అట్టపెట్టెలో అందం!

Friday 16th March 2018
startups_main1521215729.png-14742

  •  బాక్స్‌లో నెలకు సరిపడే సౌందర్య ఉత్పత్తులు
  •  నెలకు 50 వేల ఆర్డర్లు; ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారం
  •  జూన్‌ నుంచి విడిగా బ్రాండెడ్‌ ఉత్పత్తుల అమ్మకాలు
  •  వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులు కూడా..
  •  ఈ ఏడాది రూ.19 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో గ్లామ్‌ఈగో కో–ఫౌండర్‌ లావణ్య సుంకరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆడవాళ్లతో షాపింగ్‌ మీద బోలెడన్ని జోకులున్నాయి. ఎందుకంటే ఓ పట్టాన వదలరని! అందులోనూ కాస్మొటిక్స్‌ షాపింగ్‌కైతే మరీనూ! తోడు వెళ్లినవాళ్లకు నచ్చితే కొంటారు.. లేకపోతే బ్రాండ్‌ మేనేజర్‌ చెబితే ఓకే చేస్తారు. మహిళగా స్వయంగా ఇవన్నీ చూసే కాబోలు... హైదరాబాదీ అమ్మాయి లావణ్య సుంకరి దీన్నే ఓ వ్యాపార వేదికగా మలుచుకుంది. నెలకు సరిపడే ఆయుర్వేద సౌందర్య ఉత్పత్తులను బాక్స్‌లో పెట్టి విక్రయించడం మొదలెట్టింది. నెలకు 500 ఆర్డర్లతో మొదలైన గ్లామ్‌ఈగో ప్రస్థానం.. ఏడాది కాలంలో 50 వేల ఆర్డర్లకు విస్తరించింది. మరిన్ని వివరాలు లావణ్య మాటల్లోనే..
ఉస్మానియా వర్సిటీ నుంచి ఎంబీఏలో మార్కెటింగ్‌ చేశాక.. జెట్‌ ఏయిర్‌వేస్‌లో హోస్టెస్‌గా చేరా. అక్కడి నుంచి దుబాయ్, ఐర్లాండ్‌లకు చెందిన రెండు నిర్మాణ సంస్థల్లో పనిచేశా. తర్వాత సొంతంగా ఏదైనా చేయాలని నిర్ణయించుకొని.. కో–ఫౌండర్‌ ప్రభాకర్‌ దారక్‌పల్లితో కలిసి రూ.60 లక్షల పెట్టుబడితో గతేడాది మార్చిలో టీ–హబ్‌ కేంద్రంగా గ్లామ్‌ఈగోను ప్రారంభించాం.
బాక్స్‌లో నెలకు సరిపడే ఉత్పత్తులు..
గ్లామ్‌ఈగో బాక్స్‌ల ఎంపిక పూర్తి శాస్త్రీయంగా జరుగుతుంది. నమోదు చేసుకున్న కస్టమర్‌ను ముందుగా చర్మం రంగు, జుట్టు తీరు, శరీర ఆకృతి వంటి వాటిపై 8 ప్రశ్నలడుగుతాం. వాటి సమాధానాలను బట్టి ఎలాంటి మేకప్‌ కిట్స్‌ నప్పుతాయో ఎంపిక చేసి వాటినే పంపిస్తాం. గ్లామ్‌ఈగో వద్ద నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ బాక్స్‌లుంటాయి. వీటి ధరలు వరుసగా నెలకు రూ.399, రూ.329, రూ.299, రూ.289. ఒక్కో బాక్స్‌లో మేకప్‌ కిట్స్, స్కిన్, ఫేస్, బాడీ కేర్‌ ఉత్పత్తులు 4–5 వరకూ ఉంటాయి. అన్నీ ఆయుర్వేదిక్‌ బ్రాండెడ్‌ ఉత్పత్తులే. ఉదాహరణకు అమెరికాకు చెందిన మన్నాకాదర్, రష్యాకు చెందిన స్వేర్‌ సీక్రెట్, ఎంకెఫైన్‌ బ్రాండ్‌లున్నాయి. ప్రతి నెలా బ్రాండ్లు మారుతాయి కూడా. గత ఏడాది కాలంలో 40 బ్రాండ్ల ఉత్పత్తులను వినియోగించాం.
హైదరాబాద్‌ వాటా 18–20 శాతం..
ప్రస్తుతం నెలకు 50 వేల ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి 18–20 శాతం వాటా ఉంటుంది. మా కస్టమర్లలో ఎక్కువ 18–34 ఏళ్ల మధ్య వయస్సు వారు.. అందులోనూ కార్పొరేట్‌ మహిళా ఉద్యోగులే. మాకొచ్చే సబ్‌స్క్రిప్షన్లలో 6 నెలల వాటా 50 శాతం వరకుంటుంది. బ్లూడార్ట్, డీటీడీసీ, ఫస్ట్‌ ఫ్లయిట్, డెల్హివరి వంటి అన్ని ప్రధాన కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. 38 వేల పిన్‌కోడ్స్‌లో డెలివరీ అందిస్తున్నాం. ఏడాదిలో రూ.6 కోట్ల వ్యాపారాన్ని చేరాం. వచ్చే ఏడాది ఆర్డర్ల సంఖ్య లక్షకు, వ్యాపారం రూ.18 కోట్ల చేర్చాలని లక్ష్యించాం. 
రూ.19 కోట్ల నిధుల సమీకరణ..
హైదరాబాద్‌లోని చిరెక్‌ పబ్లిక్‌ స్కూల్‌ దగ్గర 8 వేల చ.అ.ల్లో గిడ్డంగి ఉంది. త్వరలోనే షాద్‌నగర్‌లో మరో వేర్‌హౌజ్‌ను ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది పురుషుల సౌందర్య ఉత్పత్తులను కూడా విక్రయిస్తాం. జూన్‌ నాటికి గ్లామ్‌ఈగోలో ఆయా బ్రాండ్ల ఉత్పత్తులను విడిగా కొనొచ్చుకూడా. ఇందుకోసం ప్రత్యేకంగా ఈ–కామర్స్‌ ప్రారంభిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే మరింత మందిని నియమిస్తున్నాం. ఈ ఏడాది ముగిసేనాటికి రూ.19 కోట్లు సమీకరిస్తాం. పలువురు వెంచర్‌ క్యాప్టలిస్ట్‌లతో చర్చిస్తున్నాం.
 



You may be interested

తలకు మించిన ఖర్చు..

Friday 16th March 2018

 హెయిర్‌ కేర్‌కు పెరుగుతున్న ప్రాధాన్యత  దేశీయంగా ఏటా రూ.19,000 కోట్ల ఖర్చు  ఫార్మా, ఆయుర్వేదం సహా 100కు పైగా కంపెనీలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొప్పున్నవాళ్లు ఏ ముడి వేసినా అందమేనంటారు. అంటే... ఏ స్టయిల్‌ చెయ్యడానికైనా ముందు జుట్టుండాలి కదా!! బహుశా... అందుకేనేమో!! భారతీయులు తల వెంట్రుకల సంరక్షణకు (హెయిర్‌ కేర్‌) ఏటా ఏకంగా రూ.19,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. సౌందర్య పోషణ (పర్సనల్‌ కేర్‌) ఉత్పత్తుల్లో హెయిర్‌ కేర్‌ వాటా అధికమనేది

జియో.. మా అమ్మాయి ఆలోచనే

Friday 16th March 2018

 4జీ లీడర్‌గా ఎదగనున్న భారత్‌  పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ వెల్లడి  రిలయన్స్‌కు ప్రతిష్టాత్మక 'డ్రైవర్స్‌ ఫర్‌ చేంజ్‌' పురస్కారం లండన్: దేశ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఆవిర్భావానికి తన కుమార్తె ఈషానే కారణమని వెల్లడించారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ. ‘మా అమ్మాయి ఈషా 2011లో యేల్‌ విశ్వవిద్యాలయంలో (అమెరికా) విద్యార్ధినిగా ఉన్నప్పుడు.. ఒకసారి సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చింది. అప్పుడు ఏదో కోర్స్‌ వర్క్‌ ఆన్‌లైన్లో పంపాల్సి

Most from this category