STOCKS

News


జీఐసీ రీ లాభం రూ.673 కోట్లు

Monday 12th February 2018
news_main1518459840.png-13916

  • గత క్యూ3లో రూ.401 కోట్ల నికర నష్టాలు 

ముంబై: ప్రభుత్వ రంగ రీ ఇన్సూరెన్స్‌ దిగ్గజం జీఐసీ రి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.673 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.401 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జీఐసీ రీ తెలిపింది. గత క్యూ3లో 105.9 శాతంగా ఉన్న కంబైన్డ్‌ రేషియో ఈ క్యూ3లో 101.1 శాతం సాధించడం, వాహన, సముద్ర, అగ్ని తదితర అన్ని భీమా రంగ విభాగాల్లో మంచి పనితీరు సాధించడం వల్ల మంచి నికర లాభం సాధించామని కంపెనీ సీఎమ్‌డీ అలిస్‌ వైద్యన్‌ తెలిపారు. క్లెయిమ్స్‌ రేషియో తగ్గడం, ఇన్వెస్ట్‌మెంట్‌ ఆదాయం 35 శాతం వృద్ధితో రూ.1,196 కోట్లకు పెరగడం కూడా కలసివచ్చాయని వివరించారు. స్థూల ప్రీమియమ్‌ 8 శాతం వృద్ధితో రూ.8,870 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రపంచంలోనే 12వ అతి పెద్ద రీ ఇన్సూరెన్స్‌ కంపెనీగా ఉన్నామని, ఏడాది కాలంలో టాప్‌ 10లో నిలవడం తమ లక్ష్యమని వివరించారు. 

స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తర్వాత ఈ కంపెనీ వెల్లడించిన తొలి ఆర్థిక ఫలితాలు ఇవి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జీఐసీ రీ షేర్‌ స్వల్పంగా లాభపడి రూ.746 వద్ద ముగిసింది. 



You may be interested

కార్పొరేషన్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,240 కోట్లు

Monday 12th February 2018

పెరిగిన మొండి బకాయిలు  న్యూఢిల్లీ: కార్పొరేషన్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,240 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.159 కోట్ల నికర లాభం సాధించామని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,035 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,840 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.4,841 కోట్లకు తగ్గిందని తెలిపింది.   రెట్టింపుకు పైగా  కేటాయింపులు... స్థూల మొండి

ఎస్సార్ స్టీల్ కొనుగోలు రేసులో ఆర్సెలర్‌మిట్టల్‌

Monday 12th February 2018

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో దివాలా చర్యలు ఎదుర్కొంటున్న ఉక్కు సంస్థ ఎస్సార్ స్టీల్‌ను దక్కించుకునేందుకు అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్‌మిట్టల్ కూడా బరిలోకి దిగింది. ఆర్సెలర్‌మిట్టల్ అనుబంధ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ ఇండియా (ఏఎంఐపీఎల్‌) ఇందుకోసం సోమవారం బిడ్ దాఖలు చేసింది. ఎస్సార్ పనితీరు, లాభదాయకతను మెరుగుపర్చేందుకు తీసుకోబోయే ప్రణాళికను ఇందులో వివరించినట్లు ఆర్సెలర్‌మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపింది. సాంకేతికాంశాల్లోనూ అంతర్జాతీయంగా తమకు ఉన్న అనుభవం.. ఎస్సార్‌ స్టీల్‌కు ఉపయోగకరంగా ఉండగలదని

Most from this category