STOCKS

News


కేన్సర్ ఔషధాలకూ రాయితీ!!

Saturday 24th February 2018
startups_main1519412266.png-14170

  •  నెలకు 5 వేల ఆర్డర్లు; రూ.5 లక్షల వ్యాపారం
  •  త్వరలోనే రూ.10 కోట్ల నిధుల సమీకరణ 
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో కోమెడ్జ్‌.కామ్‌ ఫౌండర్‌ శ్రీహరి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సెల్‌ఫోన్లు, దుస్తులే కాదు ఔషదాలూ డిస్కౌంట్లతో ఆన్‌లైన్‌లో కొనడం మనకు తెలిసిందే. కానీ, కేన్సర్, గుండె జబ్బులు వంటి ఖరీదైన మందులు సైతం రాయితీలో దొరకటమంటే కష్టం. అందుకే దీన్నే వ్యాపారంగా మార్చి ‘కోమెడ్జ్‌.కామ్‌’ను ఆరంభించారు వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన శ్రీహరి అరిగె. వ్యక్తిగత అవసరాలతో పాటూ స్థానిక రిటైల్‌ మందుల షాపులకూ ఔషదాలను అందించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు వ్యవస్థాపకుడు శ్రీహరి మాటల్లోనే...
ఎస్‌వీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక.. ఐటీలో ఉద్యోగ రీత్యా లండన్‌కెళ్లా. కుటుంబ వ్యాపారం మెడికల్‌ స్టోర్‌ కావటంతో దీనికి టెక్నాలజీని జోడించా. రూ.కోటి పెట్టుబడులతో గతేడాది ఆగస్టులో కోమెడ్జ్‌.కామ్‌ను ప్రారంభించా. ప్రస్తుతం కోమెడ్జ్‌.కామ్‌లో 80 వేలకు పైగా ఔషదాలున్నాయి. సాధారణ మందులతో పాటూ మధుమేహం, గుండె జబ్బులు, కేన్సర్‌ చికిత్స వంటి ఖరీదైన మందులు, పోషకాహార ఉత్పత్తులు, మాతాశిశు సంరక్షణ ఔషదాలు, ఆయుర్వేద మందులు కూడా లభిస్తాయి. ప్రస్తుతం నెలకు 3,000–5,000 ఆర్డర్లు వస్తున్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షల వరకుంటుంది. నెలకు రూ.లక్ష వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాం. వెయ్యి పైన ఆర్డర్‌కు ఉచిత డెలివరీ, 22 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. వెయ్యి లోపయితే రూ.50 డెలివరీ చార్జీ, 15 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. ప్రస్తుతం మాకు 800 మంది కస్టమర్లున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. కేన్సర్, గుండె జబ్బుల మందుల ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. కారణం డిస్కౌంట్లే. హైదరాబాద్‌లో మందుల డెలివరీ కోసం సొంతంగా 15 మంది సిబ్బందిని నియమించుకున్నాం. ఇతర నగరాల్లో డెలివరీ కోసం తపాలా శాఖతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 22 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే ల్యాబ్‌ పరీక్షలను అందించాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగిసేసరికి 5 వేల మంది కస్టమర్లు, నెలకు రూ.కోటి వ్యాపారం చేయాలని లక్ష్యించాం. ఈ ఏడాది ముగింపులోగా రూ.10 కోట్ల నిధుల సమీకరణ చేయనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం.
 



You may be interested

మార్కెట్‌ ముందుకే...!

Saturday 24th February 2018

 అవగాహన ఉంటేనే షేర్లలో పెట్టుబడి  లేకుంటే మ్యూచువల్‌ ఫండ్స్‌తో మొదలెట్టండి  నైపుణ్యం లేకుంటే నేరుగా దూకొద్దు!  రెండు అంకెల వృద్ధి దిశగా భారత్‌  బ్యాంక్‌ మోసాలు మంచికే  ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కాస్త కష్టమేనని బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా వ్యాఖ్యానించారు. తగిన నైపుణ్యం లేకుండా కొత్తవాళ్లు  నేరుగా పెట్టుబడులు పెట్టొద్దని సలహా ఇచ్చారు. ఇలాంటివాళ్లు మార్కెట్‌పై మంచి అవగాహన వచ్చేవరకు మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. మార్కెట్లో

బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ బైక్స్‌ ధరలు తగ్గాయి..

Saturday 24th February 2018

10 శాతం వరకు దిగువకు ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్‌ విభాగం బీఎండబ్ల్యూ మోటొరాడ్‌ తాజాగా భారత్‌లో తన బైక్స్‌ ధరలను 10 శాతం వరకు తగ్గించింది. ధరల తగ్గింపు నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. అడ్వెంచర్‌, స్పోర్ట్‌, టూరింగ్‌, హెరిటేజ్‌, రోడ్‌స్టర్‌ వంటి కేటగిరీల్లోని మోటార్‌సైకిళ్లకు తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. కాగా కంపెనీ గతేడాది భారత్‌లో కార్యకలాపాలు

Most from this category