STOCKS

News


గెయిల్‌ 1:3 బోనస్‌

Monday 12th February 2018
news_main1518459471.png-13912

  • మూడు షేర్లకు ఒక షేర్‌ బోనస్‌
  • 28 శాతం పెరిగిన లాభం 

న్యూఢిల్లీ: గెయిల్‌ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,262 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో సాధంచిన నికర లాభం(రూ.983 కోట్లు)తో పోల్చితే 28 శాతం వృద్ధి సాధించామని గెయిల్‌ ఇండియా తెలిపింది. గ్యాస్‌ మార్కెటింగ్‌, ప్రసార వ్యాపారం మంచి మార్జిన్‌లు సాధించడంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ బి.సి. త్రిపాఠి చెప్పారు. ప్రతి మూడు షేర్లకు ఒక షేర్‌ను ఉచితంగా(బోనస్‌ 1:3) ఇవ్వడానికి తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని వివరించారు. ఆదాయం 17 శాతం వృద్ధి చెంది రూ.14,717 కోట్లకు, స్థూల మార్జిన్‌ 14 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. పెట్రోకెమికల్‌ విభాగం అమ్మకాలు 21 శాతం, ఎల్‌పీజీ విభాగం అమ్మకాలు 10 శాతం చొప్పున వృద్ధి చెందాయని తెలిపారు. అన్ని విభాగాలు మంచి పనితీరు సాధించాయని, ఇది తమ కంపెనీ మొత్తం ఆదాయం, నికర లాభాల్లో ప్రతిఫలిస్తోందని వివరించారు. సహజ వాయువు పైప్‌లైన్‌ మౌలిక సదుపాయాలను మరింతగా విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.6,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నామని వివరించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో గెయిల్‌ షేర్‌ 0.3 శాతం లాభపడి రూ.464 వద్ద ముగిసింది. 
 



You may be interested

కంపెనీలకు ఐటీఆర్‌ మినహాయింపులు రద్దు

Monday 12th February 2018

 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: డొల్ల కంపెనీలపై కొరడా ఝుళిపించే క్రమంలో కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా .. కట్టాల్సిన పన్ను రూ. 3,000కు లోబడే ఉండే సంస్థలకు ఐటీ రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలు నుంచి మినహాయింపునిస్తుండటాన్ని ఇకపై రద్దు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆయా కంపెనీలు పెట్టే పెట్టుబడులను

వృద్ధి పుంజుకుంటుంది...!

Monday 12th February 2018

 2018-19లో 7.5 శాతం వృద్ధి  డాయిష్‌బ్యాంక్‌ నివేదిక  రేట్ల పెంపు భయాలు అక్కర్లేదని భరోసా న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌-2019 మార్చి) పుంజుకుంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం- డాయిష్‌ బ్యాంక్‌ అంచనావేస్తోంది. వృద్ధి రేటు 7.5 శాతంగా ఉంటుందని విశ్లేషించింది. సమీప భవిష్యత్తులో రెపోరేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం  6 శాతం) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌

Most from this category