News


ఫైన్డ్‌.. అన్ని బ్రాండ్లూ ఇక్కడే!

Saturday 8th July 2017
startups_main1499455666.png-5034

  •  అంతర్జాతీయ బ్రాండెడ్‌ దుస్తుల వేదిక
  •  7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో ఒప్పందం
  •  సౌదీ, ఆగ్నేయాసియా దేశాలకు విస్తరణ
  •  రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో ఫైన్డ్‌ కో–ఫౌండర్‌ హర్ష్‌ షా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అలెన్‌ సోలీ, టామీ హిల్‌ఫిగర్, అమెరికన్‌ ఈగల్, పూమా, బీయింగ్‌ హ్యూమన్, లీ... ఇవన్నీ టాప్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ అన్న సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటిని ఆన్‌లైన్‌లో కొనాలంటే కాస్త ఆలోచిస్తాం. కారణం.. ఆన్‌లైన్‌లో బ్రాండెడ్‌తో పాటూ స్థానిక దుస్తులూ ఉండటమే!! కానీ, బ్రాండెడ్‌ దుస్తులకు మాత్రమే వేదికగా నిలుస్తోంది ఫైన్డ్‌. ఒకటి కాదు రెండు కాదు దేశ, విదేశాల్లోని 220 బ్రాండ్ల దుస్తులు లభించడం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ హర్ష్‌ షా మాటల్లోనే..
బ్రాండెడ్‌ ఫ్యాషన్‌ ఉత్పత్తులను ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకూ చేరువ చేయాలనే ఉద్దేశంతో గతేడాది జనవరిలో రూ.6 కోట్ల పెట్టుబడుటతో ఫారూఖ్‌ ఆదాం, శ్రీరామన్‌ ఎంజీతో  కలిసి ముంబై కేంద్రంగా ఫైన్డ్‌ను ప్రారంభించాం. ప్రస్తుతం దేశంలోని 7,600 స్టోర్లలో 220 బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్నాం. 60 వేల ఉత్పత్తులున్నాయి. త్వరలోనే మరో 140 బ్రాండ్లతో ఒప్పందం చేసుకుంటాం. ప్రస్తుతం మహిళలు, పురుషులకు సంబంధించిన దుస్తులు, పాదరక్షలు, జ్యుయలరీ, యాక్సెసరీలను మాత్రమే విక్రయిస్తున్నాం. మరో 2 నెలల్లో పిల్లల విభాగంలోకీ విస్తరిస్తాం. ఇటీవలే ఇన్‌–స్టోర్‌ సేవలను ప్రారంభించాం. ఇదేంటంటే.. ఒప్పందం చేసుకున్న స్టోర్లలోకి వచ్చిన కస్టమర్లకు వారికి నచ్చిన రంగులు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు లేని పక్షంలో వాటిని స్థానికంగా ఉన్న ఇన్‌–స్టోర్‌లో నమోదు చేస్తే చాలు. నేరుగా అవి కస్టమర్ల ఇంటికి డెలివరీ చేస్తాం.
రోజుకు 2,500–3,000 ఆర్డర్లు..
ప్రస్తుతం 32 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజూ 35–40 వేల మంది యాడ్‌ అవుతున్నారు. రోజుకు 2,500–3,000 ఆర్డర్లొస్తున్నాయి. కనీస ఆర్డర్‌ విలువ రూ.1,500. ప్రతి ఆర్డర్‌పై 20–30 శాతం విక్రయదారుడి నుంచి కమిషన్‌ తీసుకుంటాం. గతేడాది ఫైన్డ్‌ ద్వారా రూ.34 కోట్ల అమ్మకాలు జరిగాయి. కమిషన్‌ రూపంలో రూ.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాం. ఆర్డర్లను డెలివరీ చేసేందుకు ఐదు కొరియర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. రెండు రోజుల్లో డెలివరీ చేస్తాం.
ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం..
ప్రస్తుతం 80 మంది ఉద్యోగులున్నారు.  ఈ ఏడాది ముగిసేలోగా 400 బ్రాండ్లకు, 60 లక్షల కస్టమర్లకు, రూ.90 కోట్ల జీఎంవీకి చేరుకోవాలని లక్ష్యించాం. మా మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 40–45 శాతం ఉంటుంది. అందులో ఏపీ, తెలంగాణ వాటా 15 శాతం. ఈ మధ్యే ఐఐఎఫ్‌ఎల్‌ సీడ్‌ వెంచర్స్, కేఏఈ క్యాపిటల్స్‌ నుంచి రూ.20 కోట్ల నిధులను సమీకరించాం. వీటిని విదేశీ విస్తరణకు ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాల్లో సేవలను ప్రారంభిస్తాం. 
 







You may be interested

వృద్ధికి చిన్న పొదుపులే దన్ను!

Saturday 8th July 2017

 వాణిజ్య శాఖ మంత్రి సీతారామన్‌  మెరుగుదల వ్యూహంగా సమీక్ష న్యూఢిల్లీ: భారత​ఆర్థిక వ్యవస్థకు చిన్న తరహా పొదుపు మొత్తం వెన్నుముక లాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఇక్కడ తెలిపారు. అయితే గతం తరహాలో ఇప్పుడు పొదుపు మొత్తాలు భారీగా పెరగడం లేదన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో దీనిపై ఒక ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. చిన్న పొదుపు మొత్తాలపై వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో... వీటిని

మైక్రోసాఫ్ట్‌లో 4,000 ఉద్యోగాలు కోత!!

Saturday 8th July 2017

న్యూయార్క్‌: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్‌’.. 4,000 వరకు ఉద్యోగులను ఇంటికి పంపనుంది. సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ విభాగాల్లో అతిపెద్ద పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చోటుచేసుకోనుంది. సిబ్బంది తొలగింపులు ఎక్కువగా అమెరికా వెలుపల ఉంటాయని సమాచారం. సంస్థ తన భాగస్వాములకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి కొన్ని మార్పులను చేపడుతోందని మైక్రోసాఫ్ట్‌ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం మేం కొందరి ఉద్యోగులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీరి

Most from this category