STOCKS

News


ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్ల జోరు....

Friday 8th September 2017
Markets_main1504857327.png-8254


కిశోర్‌ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు ఈ ఏడాది దుమ్మురేపుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వినియోగం పెరగడం, రిటైల్‌ సంబంధిత రంగాల్లో మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశాలుండడం, జీఎస్‌టీ అమలు తదితర అంశాలు సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు ఈ ఏడాది...  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకడమో, లేదా ఏడాది గరిష్ట స్థాయిలను తాకడమో  సర్వ సాధారణం అయిపోయింది. ఈ రివాజులో భాగంగానే శుక్రవారం కూడా రెండు  ఫ్యూచర్‌ గ్రూప్‌ షేర్లు-ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ డీవీఆర్‌ షేర్లు ఏడాది గరిష్ట స్థాయిని తాకగా, ఫ్యూచర్‌ కన్సూమర్‌ షేర్‌  ఆల్‌టైమ్‌ హైని తాకింది. 

ఫ్యూచర్‌ రిటైల్‌ 346 శాతం అప్‌...
ఈజీ డే, బిగ్‌ బజార్‌,  ఎఫ్‌బీబీ తదితర స్టోర్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ రిటైల్‌ షేర్‌ ఈ ఏడాది ఇప్పటిదాకా 346 శాతం ఎగసింది. ఫ్యూచర్‌ గ్రూప్‌ ఇతర కంపెనీలు-ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్‌ 222 శాతం,  ఫ్యూచర్‌ కన్సూమర్‌ లిమిటెడ్‌ 237 శాతం, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌ ఫ్యాషన్స్‌ 204 శాతం చొప్పున పెరిగాయి. ఈ కాలానికి సెన్సెక్స్‌ కేవలం 19 శాతం మాత్రమే పెరిగింది. 
కలసివచ్చిన కాలం...
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, జీఎస్‌టీ కారణంగా పట్టణ ప్రాంతాల్లో కార్డ్‌ల ద్వారా చెల్లింపులకు ప్రాధాన్యత పెరిగిందని, ఈ డిజిటల్‌ చెల్లింపులను అంగీకరించే వ్యవస్థీకృత రిటైల్‌ స్టోర్స్‌ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని నిపుణులుంటున్నారు. మరోవైపు డి-మార్ట్‌ రిటైల్‌ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఈ ఏడాది స్టాక్‌మార్కెట్లో బంపర్‌ లాభాలతో లిస్టవడమే కాకుండా, ఇష్యూ ధరతో పోల్చితే మూడు రెట్ల ధరకు పైగా ఎగబాకడం కూడా రిటైల్‌ రంగ షేర్లపై సానుకూల ప్రభావం చూపుతోందని విశ్లేషకులంటున్నారు. అంతే కాకుండా రిటైల్‌ రంగంలో కన్సాలిడేషన్‌ జరుగుతోందని, ఇతర కంపెనీలను కైవసం చేసుకోవడంలో ఫ్యూచర్‌ రిటైల్‌ ముందంజలో ఉందని వారంటున్నారు.  భారతీ గ్రూప్‌ నుంచి ఈజీడే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ఫ్యూచర్‌ రిటైల్‌ టేకోవర్‌ చేయడం తెలిసిందే.
త్వరలో మరో గ్రూప్‌ కంపెనీ లిస్టింగ్‌...
ఫ్యూచర్ గ్రూప్‌ల కంపెనీల పునర్వ్యస్థీకరణ అనంతరం ఈ గ్రూప్‌ కంపెనీల్లో స్టాక్‌ మార్కెట్లో మొదటగా లిస్టయింది ఫ్యూచర్‌ రిటైల్‌ కంపెనీయే. కాగా ఈ కంపెనీకి పదికి పైగా  బ్రోకరేజ్‌ సంస్థలు కొనుగోలు రేటింగ్‌ను ఇచ్చాయి. కాగా మరో ఫ్యూచర్‌ గ్రూప్‌ కంపెనీ ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ లిమిటెడ్‌ త్వరలో ఐపీఓకు రానున్నది. 

 

కంపెనీ 7/09/16 ధర 7/09/17 ధర వృద్ధి(%)  ఏడాది కనిష్ట ధర ఏడాది గరిష్ట ధర
ఫ్యూచర్‌ రిటైల్‌ 158 570 261 116  592
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌  17 56 229 14   62
ఫ్యూ. ఎంటర్‌. డీవీఆర్‌  16 53 231 14 58
ఫ్యూచర్‌ కన్సూమర్‌   20 64  220 18  70
ఫ్యూ. లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌  126 380 202 109 399You may be interested

ఆల్‌టైం హైకి ఐషర్‌ మోటార్స్‌

Friday 8th September 2017

ముంబై: ఐషర్‌ మోటార్స్‌ షేరు ధర గురువారం జీవితకాల గరిష్టస్థాయికి చేరింది. రూ.33,483.95 తాకింది. ఇటాలియన్‌ సూపర్‌ బైక్‌ తయారీ కంపెనీ డుకాటిని సొంతం చేసుకోవడానికి ఐషర్‌ మోటార్స్‌ బైండింగ్‌ ఆఫర్‌ను రూపొందించిందనే వార్తల నేపథ్యంలో వరుసగా 2వ రోజు కూడా షేరు ధర బుల్లెట్‌లా దూసుకుపోతోంది. 9 ఏళ్లలో 8,000 శాతం, ఏడాదిలో 45 శాతం రిటర్న్‌ ఇచ్చిన ఈ షేరు.. గడిచిన నెలరోజుల్లో 5 శాతం వరకు

డా. రెడ్డీస్‌ కు జర్మన్‌ రెగ్యులేటరీ దెబ్బ

Friday 8th September 2017

జర్మనీ ఔషద నియంత్రణ సంస్థ  తనిఖీలు చేసిందన్న వార్తలతో ఫార్మారంగ దిగ్గజం డా. రెడ్టీస్‌ ల్యాబ్స్‌ కౌంటర్‌ నీరసించిం‍ది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో కంపెనీ షేరు ధర 3.41 శాతం పతనమయి రూ. 2,150.20 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో  షేరు రూ.2066  దాకా పడిపోయింది.  వైజాగ్‌ దగ్గర్లోని దువ్వాడ  ఫార్ములేషన్ల తయారీ ప్లాంటులో  జర్మన్‌ ఔషధ నియంత్రణ సంస్థ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో  ఆరు ప్రధాన లోపాలను

Most from this category