STOCKS

News


మార్చికల్లా మరో పతనం....

Tuesday 13th February 2018
Markets_main1518512097.png-13926

అంతర్జాతీయ ఫండ్‌ మేనేజర్‌ అంచనా

మార్చికల్లా ప్రపంచ మార్కెట్లలో మరో పతనం సంభవిస్తుందని అంతర్జాతీయ ఫండ్‌..ఏఎంపీ క్యాపిటల్‌ ఇన్వెస్టర్స్‌ మేనేజర్‌ నాదెర్‌ నయేమి అంచనావేస్తున్నారు. 120 బిలియన్‌ డాలర్ల ఆస్తుల్ని నిర్వహిస్తున్న ఈ ఫండ్‌...పెద్ద ఎత్తున నగదు నిల్వల్ని అట్టిపెట్టింది. ఫిబ్రవరి తొలివారంలో జరిగిన పతనం తర్వాత..రాబోయే రెండో పతనంలో ఈ నిల్వలతో పెట్టుబడులు చేయాలని యోచిస్తున్నట్లు నయేమి బ్లూమ్‌బర్గ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి పతనం తర్వాత...మలి పతనం సంభవించేముందు సహజంగానే చిన్నపాటి రికవరీ వస్తుందని ఆయన అన్నారు. గతేడాది తమ ఫండ్‌ ఆస్తుల్లో 30 శాతం వరకూ నగదుగా మార్చిన నయేమి...తదుపరి పతనంలో ఈ నగదును వినియోగించాలని భావిస్తున్నారు. మార్కెట్‌ మళ్లీ ర్యాలీ జరిపేముందు, ఒక బేస్‌ ఏర్పర్చుకుంటుందని, మార్చి 9న మరో ఫెడరల్‌ రిజర్వ్‌ మీట్‌ జరగనున్న సందర్భంగా మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతుందని ఆయన అంచనాల్లో పేర్కొన్నారు. ఎనర్జీ, ఫైనాన్షియల్, జపాన్‌ షేర్లలో పెట్టుబడి చేయాలని ఆయన భావిస్తున్నారు. అలాగే వర్థమాన దేశాల షేర్లు, కరెన్సీల క్షీణత ఇటీవల స్వల్పంగా వుండటం మంచి సంకేతమని, అందుచేత మలి పతనంలో వర్థమాన ఈక్విటీల్ని కూడా కొనుగోలు చేస్తానని ఆయన చెప్పారు. 
 You may be interested

ఐపీఓకు ఇండోస్టార్‌ క్యాపిటల్‌ ఫైనాన్స్‌..!

Tuesday 13th February 2018

న్యూడిల్లీ:- బ్యాంకింగేతర రంగంలో సేవలు అందిస్తున్న ఇండోస్టార్‌ క్యాపిటల్‌ తొలిసారి తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది.ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2వేల కోట్లు సేకరించనుంది. ఈ మేరకు ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది.  ఇష్యూలో భాగంగా కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.700 కోట్లను, వాటాదారులకు చెందిన 2 కోట్ల షేర్ల విక్రయం ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించనుంది. ఈ ఐపీఓకు జేఎమ్‌ ఫైనాన్షియల్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌,

ఆరు నెలల్లో 80 డాలర్లకు చమురు ధర: గోల్డ్‌మాన్‌ శాక్స్‌

Tuesday 13th February 2018

బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఆరు నెలల్లో 82.50 డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనావేసింది. మూడు నెలల్లో ఈ ధర 75 డాలర్లను చేరవచ్చంటూ మంగళవారం తాజా అంచనాల్ని ప్రకటించింది. గత అంచనా 62 డాలర్ల స్థాయిని ఎగువముఖంగా సవరించింది. ఆసియాలో చమురుకు డిమాండ్‌ పెరగడం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతల్ని కొనసాగించడం, వెనిజులాలో ఉత్పత్తి పడిపోవడం, అమెరికాలో నిల్వలు తగ్గుతుండటం వంటి

Most from this category