వర్థమాన దేశాల్లో భారత్‌కే అధిక విదేశీ నిధులు

ఇతర మార్కెట్లకంటే భారత్ సూచీలు భారీగా తగ్గినప్పటికీ, ఈ మార్చిలో వర్థమాన దేశాల్లోకెల్లా అత్యధిక విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నిధుల్ని భారత్ అధికంగా ఆకర్షించగలిగింది. 2.06 బిలియన్ డాలర్ల (రూ. 13,000 కోట్లకుపైగా) నిధుల్ని ఈ నెలలో విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడి చేశారు. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం భారత్ తర్వాత దక్షిణ కొరియాలోకి ఎక్కువగా 25.9 మిలియన్ డాలర్ల విదేశీ నిధులు ప్రవహించాయి. బ్రిక్ దేశాల్లో బ్రెజిల్ నుంచి 1.7 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు తరలివెళ్లాయి. అయితే భారత్‌లోకి వచ్చిన నిధులు చాలావరకూ ఐపీఓల్లోకి తరలిరాగా, టీసీఎస్ బ్లాక్‌డీల్‌లో బిలియన్ డాలర్లకుపైగా ఎఫ్‌పీఐలు ఇన్వెస్ట్‌చేశారు. మార్చి నెలలో మొత్తం ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర ఐపీవోల్లోకి 40 శాతం వచ్చాయని అంచనా. టాటా సన్స్...టీసీఎస్‌లో 1.5 శాతం వాటాను రూ. 7,500 కోట్లకు బ్లాక్డీల్గా విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని ఎఫ్‌పీఐలే కొనుగోలు చేశారు. ఇలా ఐపీఓలు, బ్లాక్డీల్లోకి పెట్టుబడులు తరలివెళ్లడంతో సెకండరీ మార్కెట్ మాత్రం ఎఫ్‌పీఐల నిధుల్ని పెద్దగా ఆకర్షించలేకపోయింది. దాంతో మార్చి నెలలో భారత్ స్టాక్ సూచీలు 4 శాతం వరకూ నష్టపోయాయి. మరోవైపు విదేశీ నిధులు తరలివెళ్లినప్పటికీ, బ్రెజిల్ మార్కెట్ మార్చి నెలలో పెరగ్గా, ఇతర వర్థమాన దేశాలైన థాయ్‌లాండ్, మలేషియా, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు కూడా భారత్‌తో పోలిస్తే మెరుగైన పనితీరు కనపర్చాయి. అయితే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు...రానున్న నెలల్లో వర్థమానదేశాల్లోకి విదేశీ నిధుల ప్రవాహాన్ని తగ్గించివేస్తుందని కొటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సందీప్ చార్డియా అంచనావేస్తున్నారు. ఈ కారణంగా రానున్న నెలల్లో మార్కెట్ స్థిరంగా వుండాలంటే, దేశీయంగా సిప్ పెట్టుబడులు పెరగాల్సివుందని అన్నారు.
.
You may be interested
ప్రభుత్వ ఐపీఓలకు ఎల్ఐసీయే ఫైనాన్షియర్
Friday 30th March 2018ముంబై:- ఈ ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లతో పాటు ఐపీఓ మార్కెట్ కూడా బాగా కలిసోచ్చింది. 2017-18లో 40 కంపెనీలు రూ.81,610 కోట్ల నిధులను ప్రైమరీ మార్కెట్ నుంచి సమీకరించాయి. ఈ ఐపీఓల్లో అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ 205 శాతం, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ 46 శాతం, ఎరిస్ లైఫ్‌సైన్సెస్, డిక్సన్ టెక్నాలజీస్, కొచ్చిన్ షిప్‌యార్డ్ కంపెనీలు 30 శాతం ప్రీమియంతో లిస్టయ్యి ఇన్వెస్టర్లకు లాభాలను పంచగా, ఎస్.చాంద్, కెపాసిట్
ఈ పది స్టాక్స్ అనలిస్టుల ఫేవరేట్స్
Friday 30th March 2018ఐదుగురు అనలిస్టులు కొత్త ఆర్థిక సంవత్సరం కోసం ఒక్కొక్కరు రెండు సిఫార్సులను అందిస్తున్నారు. ఐడీబీఐ క్యాపిటల్ ఏకే ప్రభాకర్ రికమండేషన్లు: 1. ఎన్బీసీసీ: కొనొచ్చు. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. బలమైన్ ఆర్డర్‌బుక్ ఉన్న కంపెనీ. ప్రభుత్వం ఇన్ఫ్రాపై, హౌసింగ్‌పై అధిక శ్రద్ధ పెట్టడం కలిసివచ్చే అంశం. 2020నాటికి రెట్టింపు లాభం అందిస్తుందని అంచనా. 2. రెప్కో హోమ్ ఫైనాన్స్: కొనొచ్చు. రూరల్ మార్కెట్లో చొచ్చుకొనిపోయి ఉండడం ప్రధాన బలం. వచ్చే ఏడాది కాలంలో 745