STOCKS

News


తరచుగా బాస్‌లను మార్చడం వల్లే

Friday 16th March 2018
news_main1521217449.png-14756

  • పీఎన్‌బీ స్కామ్‌పై అరుంధతీ భట్టాచార్య

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులను తరచుగా మార్చడంపై ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల నాయకత్వంలో నెలల తరబడి శూన్యత ఏర్పడడంతోపాటు, కొత్తగా వచ్చే వారికి నియంత్రణ లోపించి బ్యాంకుల సాఫీ నిర్వహణపై ప్రభావం పడుతుందన్నారు. పీఎన్‌బీలో రూ.13,000 కోట్ల నీరవ్‌మోదీ స్కామ్‌ నేపథ్యంలో ముంబై యూనివర్సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వరంగ బ్యాంకుల నాయకత్వంలో కొన్ని మార్పులు చేశారని, దీంతో వాటికి చాలా నెలలుగా అధిపతులు లేని పరిస్థితి నెలకొందన్నారు. నేరుగా పీఎన్‌బీ స్కామ్‌ గురించి ఆమె ప్రస్తావించకుండా, ఇటీవల బయపడిన స్కామ్‌ దురదృష్టకరమని, కోర్‌ బ్యాంకింగ్‌ సాఫ్ట్‌వేర్‌, స్విఫ్ట్‌ ప్లాట్‌ఫామ్‌ మధ్య అనుసంధానత లేకపోవడమే కారణమన్నారు. ఒకే పని కోసం రెండు వేర్వేరు వ్యవస్థలను వినియోగిస్తున్నప్పుడు వాటి మధ్య సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు. అది లేకపోవడం వల్లే సదరు స్కామ్‌ను ఇంతకాలం ఎవరూ గుర్తించలేకపోయారని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌లో ప్రభుత్వరంగాన్ని పూర్తిగా రద్దు చేయడానికి తాను వ్యతిరేకమన్నారు. 



You may be interested

ప్రత్యేక ఫార్మా క్లస్టర్లకు సిఫార్సు!    

Friday 16th March 2018

 చైనాకు ఫార్మా ముడి పదార్థాల ఎగుమతులపై దృష్టి   20 జనరిక్‌ మందుల కంపెనీల్లో 8 భారత్‌వే.. ఫార్మెక్సిల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌  సాక్షి, విశాఖపట్నం: దేశంలో ఫార్మా సిటీల మాదిరిగా ప్రత్యేక (ఎక్స్‌క్లూజివ్‌) ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్టు ప్రభుత్వరంగ ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఫార్మెక్సిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌. ఉదయ్‌ భాస్కర్‌ తెలిపారు. దీనివల్ల ఫార్మారంగం వృద్ధి చెందుతుందన్నారు.

సుజుకీ ఇన్‌ట్రూడర్‌లో అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌

Friday 16th March 2018

ధర రూ.1,06,896 ముంబై: వాహన తయారీ కంపెనీ ‘సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా’ తాజాగా తన ఇన్‌ట్రూడర్‌ బైక్‌లో ఫ్యూయెల్‌ ఇన్‌జెక‌్షన్‌ ఆప్షన్‌తో అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.1,06,896. క్రూయిజర్‌ విభాగంలో తన వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో కంపెనీ ఈ వేరియంట్‌ను ఆవిష్కరించింది. కాగా కంపెనీ గత నవంబర్‌లో ఈ ఇన్‌ట్రూడర్‌ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇప్పటిదాకా 15,000 యూనిట్లను విక్రయించామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

Most from this category