STOCKS

News


17,356 ఫ్లాట్లు ఫర్‌ సేల్‌!

Saturday 13th January 2018
personal-finance_main1515782718.png-13105

  •  హైదరాబాద్‌లో ఏడాదిలో 38 శాతం తగ్గిన ఇన్వెంటరీ

సాక్షి, హైదరాబాద్‌: 2017... స్థిరాస్తి రంగానికి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్టీ రంగం గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీకి ఈ ఏడాదిలో ముహూర్తం కుదిరింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో సప్లయి తగ్గడంతో ఇన్వెంటరీ ఫ్లాట్ల కొనుగోళ్లు పెరిగాయి. జస్ట్‌.. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 38 శాతం తగ్గడమే ఇందుకు నిదర్శనమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక తెలిపింది.
హైదరాబాద్‌లో 2016 డిసెంబర్‌ నాటికి అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 28,088 ఉండగా.. 2017 డిసెంబర్‌ ముగింపు నాటికి 17,356 యూనిట్లకు చేరింది. అంటే 38 శాతం తగ్గింది. ఇందులో దిక్కుల వారీగా ఇన్వెంటరీ గణాంకాలను పరిశీలిస్తే.. నార్త్‌లో 2,993 యూనిట్లు, వెస్ట్‌లో 10,130, సెంట్రల్‌లో 1,037, ఈస్ట్‌లో 908, సౌత్‌లో 2,286 యూనిట్లున్నాయి.
నగరంలో 18 ఏళ్లుగా ఫర్‌ సేల్‌..
నగరాల వారీగా అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్ల వయస్సును పరిశీలిస్తే.. ౖఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 18.5 ఏళ్ల నుంచి విక్రయంకాని ఇన్వెంటరీ ఉంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో దాదాపు 18 ఏళ్లుగా ఉన్న ఇన్వెంటరీ ఉంది. అహ్మదాబాద్‌లో 10 ఏళ్లుగా, ముంబైలో 16 ఏళ్లుగా, పుణెలో 13 ఏళ్లుగా, కోల్‌కతాలో 12 ఏళ్లుగా, చెన్నైలో 14 ఏళ్లుగా, బెంగళూరులో 13 ఏళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ ఉంది.
హైదరాబాద్‌లో 3 శాతం ధరల వృద్ధి..
నగరాల వారీగా చ.అ. ధరల పెరుగుదల పరిశీలిస్తే.. ఆశ్చర్యకరంగా హైదరాబాద్, అహ్మదాబాద్‌ మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో  ధరలు తగ్గాయి. ఏడాది కాలంలో ఎన్‌సీఆర్‌లో 2 శాతం, ముంబైలో 5 శాతం, పుణెలో 7 శాతం, కోల్‌కతాలో 5 శాతం, బెంగళూరులో 5 శాతం, చెన్నైలో 3 శాతం ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో మాత్రం 3 శాతం, అహ్మదాబాద్‌లో 2 శాతం ధరలు పెరిగాయి.
–––––––––
దేశంలో 5,28,494 ఫ్లాట్లు ఫర్‌ సేల్‌ 
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఎన్‌సీఆర్, అహ్మదాబాద్, ముంబై, పుణె, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు, చెన్నైల్లో 2017 డిసెంబర్‌ ముగింపునాటికి అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 5,28,494 యూనిట్లు. 2016 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 16 శాతం తక్కువ.
– నగరాల వారీగా ఇన్వెంటరీ గణాంకాలివే:
నగరం            అమ్ముడుపోకుండా ఉన్న ఫ్లాట్లు
హైదరాబాద్‌        17,356
ఎన్‌సీఆర్‌            1,66,631
బెంగళూరు            1,09,112
ముంబై            1,15,964
చెన్నై            24,640
పుణె            28,455
కోల్‌కతా            39,252
అహ్మదాబాద్‌        26,884

 



You may be interested

కళ తప్పని.. ఆఫీస్‌ మార్కెట్‌!

Saturday 13th January 2018

సాక్షి, హైదరాబాద్‌: 2017 ద్వితీయార్థంలో నగరంలో కార్యాలయాల స్థలానికి ఊపొచ్చింది. స్థానిక ప్రభుత్వ ప్రోత్సాహం, మెరుగైన మౌలిక సదుపాయాలు, అందుబాటు ధర, విస్తృతమైన ఉద్యోగ, వ్యాపార అవకాశాలే కారణమని ఓ కన్సల్టెన్సీ నివేదిక తెలిపింది. ఐటీ హబ్‌గా పేరొందిన దక్షిణ ప్రాంతమే కాకుండా ఓఆర్‌ఆర్, రేడియల్‌ రోడ్లు, మెట్రో రైలు పరుగులతో పోచారం, ఆదిభట్ల వంటి తూర్పు ప్రాంతాలకూ గిరాకీ పెరిగింది.  2017 ద్వితీయార్థంలో 3.34 మిలియన్‌ చ.అ. ఆఫీసు లావాదేవీలు జరిగాయి.

పైకప్పు అదిరింది!

Saturday 13th January 2018

సాక్షి, హైదరాబాద్‌: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్‌ సీలింగ్‌ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్‌ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన

Most from this category