మ్యూచువల్ ఫండ్స్ కొన్న టాప్ 5 షేర్లు ఇవే..!

ముంబై: దీర్ఘకాల మూలధన లాభాల పన్ను(ఎల్టీసీజీ) వర్తింపు లాంటి పలు ప్రతికూల అంశాల కారణంగా స్టాక్ సూచీలు నేలచూపులు చూస్తున్న ప్రస్తుత తరుణంలో ఎఫ్ఐఐలు, పలువురు దేశీయ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కితీసుకుంటుంటే.. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం వాల్యూయేషన్స్ పక్కాగా ఉన్న షేర్లలో పెట్టుబడుల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాయి.తాజాగా ఫండ్ హౌస్‌లు కొనుగోలుచేసిన టాప్ 5 షేర్లను ఒకసారి పరిశీలిస్తే..
ఏఐఏ ఇంజినీరింగ్
కొనుగోలు చేసిన సంస్థ: డీఎస్పీ బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్
షేరు ప్రస్తుత ధర: రూ.1,417
మార్కెట్ క్యాప్ : రూ.13,366 కోట్లు
సిమెంట్, థర్మల్ పవర్, మైనింగ్ ప్లాంట్లలోని క్రషింగ్, గ్రైండింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ఇంజినీరింగ్ సేవలను అందిస్తోన్న ఈ కంపెనీ.. మైనింగ్, సిమెంట్ పరిశ్రమలకు అందుతున్న పలు ప్రయోజనాల ఫలితాలను పరోక్షంగా అందుకోనుందని డీఎస్పీ బ్లాక్‌రాక్ భావిస్తోంది. ఈ రంగాలలో ఊపందుకుంటున్న డిమాండ్ కారణంగా ఏఐఏ ఇంజినీరింగ్ ఉత్పత్తులకు మంచి గిరాకీ లభించనుందని అంచనావేస్తోంది. మైనింగ్, సిమెంట్ రంగాల రీప్లేస్మెంట్ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన 2.5 మిలియన్ టన్నులు కాగా.. ఇందులో కేవలం మైనింగ్ రంగ డిమాండ్ 1.5-2 మిలియన్ టన్నులుగా ఉన్నట్లు అంచనా. కంపెనీ ప్రస్తుత సామర్థ్య వినియోగం (క్యపాసిటీ యుటిలైజేషన్) 65 శాతంగా ఉంది. 2020 నాటికి కంపెనీ హై క్రోమియం వేర్ పార్ట్స్ తయారీని 4,40,000 ఎంటీకి చేర్చందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఈ సామర్థ్యం 3,40,000 ఎంటీగా ఉంది. ఈ వివరాల ఆధారంగా చూస్తే.. రానున్న త్రైమాసికాలలో ఏఐఏ ఇంజినీరింగ్ ఆశాజనక ఫలితాలను ప్రకటించనుందని డీఎస్పీ బ్లాక్‌రాక్ భావిస్తున్నట్లు ఆ ఫండ్ చేసిన కొనుగోళ్లు తెలుపుతున్నాయి.
ఫినోలెక్స్ ఇండస్ట్రీస్
కొనుగోలు చేసిన సంస్థ: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్
షేరు ప్రస్తుత ధర: రూ.658
మార్కెట్ క్యాప్: రూ.8,175 కోట్లు
భారతదేశంలోని అతిపెద్ద పీవీసీ పైపులు, ఫిట్టింగ్స్ ఉత్పత్తుదారైన ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 2020 నాటికి కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ఈ ఉత్పత్తులలో 70 శాతం వ్యవసాయ రంగానికి, మిగిలిన మొత్తం ఇతర రంగాలకు సప్లై చేస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన రెండు రకాల ఉత్పత్తులు కంపెనీకి ఉండడం ఆకర్షణీయ అంశంగా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ భావిస్తోంది. డీలర్ నెట్వర్క్ కూడా కంపెనీకి బలంగా ఉంది. 18,000 రిటైలర్స్, 800 డీలర్లు సంస్థ కలిగిఉన్నట్లు వెల్లడించింది. వ్యవసాయం, హౌసింగ్, టెలీకమ్యూనికేషన్స్, నిర్మాణ రంగాలలో కంపెనీకి కస్టమర్లు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన్ మంత్రి కృషి సిన్చాయి యోజన, అందరికీ ఇళ్లు లాంటి పలు పథకాలు రానున్న త్రైమాసికాలలో కంపెనీ ఆదాయాన్ని పెంచనున్నాయని ఫండ్ భావిస్తోంది.
ఎల్ అండ్ టీ ఫైనాన్స్ హోల్డింగ్స్
కొనుగోలు చేసిన సంస్థ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
షేరు ప్రస్తుత ధర: రూ.166
మార్కెట్ క్యాప్: రూ.33,247 కోట్లు
విభిన్న ఆర్థిక సేవలు అందిస్తున్న ఈ కంపెనీ మౌళిక సదుపాయాల నిర్మాణం, కార్పొరేట్, రిటైల్, అసెట్ మేనేజ్మెంట్పై దృష్టిసారించింది. వ్యయాలను తగ్గించుకోవడం వల్ల రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్ఓఈ) మెరుగుపడిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వివరించింది. 2016 డిసెంబరు త్రైమాసికానికి 12.8 శాతంగా ఉన్న ఆర్ఓఈ.. గతేడాది డిసెంబరు త్రైమాసికానికి 16 శాతానికి పెరిగింది. ఖర్చులు తగ్గించుకోవడం, రాబడి పెరగడం పునరుద్ధరణలో భాగంగా ఫ్రాంక్లిన్ అభివర్ణించింది.
సుదర్శన్ కెమికల్స్
కొనుగోలు చేసిన సంస్థ: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్
షేరు ప్రస్తుత ధర: రూ.508
మార్కెట్ క్యాప్: రూ.3,509 కోట్లు
దేశీయంగా బలమైన మార్కెటింగ్ వ్యవస్థను కలిగిఉన్న ఈ కంపెనీ ఏకంగా 35 శాతం వాటాను కలిగిఉన్నట్లు ఐసీఐసీఐ తెలియజేసింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్లోనే పట్టుకలిగిన ఈ సంస్థ యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్‌పై దృష్టిసారించడం ప్లెస్ పాయింట్‌గా ఉందని వెల్లడించింది. ప్రీమియం ఉత్పత్తులపై ఫోకస్ పెంచడం ద్వారా ఎర్నింగ్స్ మెరుగుపరుచుకుందని వివరించింది.
నెస్లే ఇండియా
కొనుగోలు చేసిన సంస్థ: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్
షేరు ప్రస్తుత ధర: రూ.8,692
మార్కెట్ క్యాప్: రూ.83,807 కోట్లు
నూతన ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడం, మ్యాగీ నూడిల్స్ అమ్మకాలు జోరందుకోవడం లాంటి సానుకూల అంశాలకు తోడు కంపెనీ సంబంధించిన పలు ఉత్పత్తులలో వస్తుసేవల పన్నురేటు 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరావడం కూడా ఆకర్షణీయ అంశాలని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెల్లడించింది. కంపెనీ ప్రవేశపెడుతున్న నూతన ఉత్పత్తుల నేపథ్యంలో రానున్నకాలంలో ఈ ప్రయోజనం కనబడనుందని భావిస్తోంది.
ఇవి కేవలం మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయాలు మాత్రమే. ఇన్వెస్టర్లు తమ సొంత అధ్యయనం తరువాత మాత్రమే తుది నిర్ణయం తీసుకోవడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్ సూచన.
You may be interested
డాషింగ్ డజన్ రికమండేషన్లు..
Monday 16th April 2018వివిధ బ్రోకరేజ్ సంస్థలు వచ్చే మూడు వారాల కోసం 12 స్టాకులను సిఫార్సు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సిఫార్సులు 1. సూర్యరోష్ని: కొనొచ్చు. టార్గెట్ రూ. 450. స్టాప్‌లాస్ రూ. 405. శుక్రవారం బుల్లిష్ బ్రేకవుట్ ఇచ్చింది. అధోముఖ వాలు రేఖను పైవైపుగా ఛేదించి క్లోజయింది. ప్రస్తుతం 20, 50, 100, 200 రోజుల డీఎంఏ స్థాయిలకన్నా పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా ఉంది. ఇండికేటర్లు సైతం స్టాకులో బలాన్ని సూచిస్తున్నాయి. 2. జీనస్ పవర్:
ఉద్యోగం పోయినా భద్రత ఉండాలి.
Monday 16th April 2018అందుకు ముందు నుంచే సన్నద్ధం కావాలి కొత్త జాబ్ దొరికేవరకూ అవసరాలు ఆగకూడదు వీటి కోసం అత్యవసర నిధి ఏర్పాటు బీమా రక్షణ, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి కొన్ని రంగాల ఉద్యోగులకూ ఇవి తప్పనిసరి పాత టెక్నాలజీల్ని కొత్తవి ఆక్రమిస్తున్నాయి. మనుషులు చేసే పనులకు ఆటోమేషన్ పోటీ పడుతోంది. ప్రైవేటు ఉద్యోగుల ముందు ఈ తరహా సవాళ్లెన్నో ఉన్నాయి. ఉన్నట్టుండి ఓ కంపెనీ ‘రాజీనామా చేయండి’ అని అడిగితే... వెంటనే మరో కంపెనీ వెల్కమ్ చెప్పే పరిస్థితులను