News


వ్యక్తిగత డేటా లీక్ చేస్తే చర్యలు

Wednesday 13th September 2017
news_main1505241303.png-8459

  •  కంపెనీలకు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరిక

న్యూఢిల్లీ: వ్యక్తుల అనుమతి లేకుండా వారి పేరుతో సహా వ్యక్తిగత సమాచారాన్ని బయటపెడితే కఠిన చర్యలు తప్పవని డేటాపరమైన కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలను కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ హెచ్చరించారు. కొన్ని వివరాలకు గోప్యనీయత ఉండాల్సిందేనని దేశవ్యాప్తంగా హ్యాకథాన్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మెరుగైన పాలన అందించేందుకు కేంద్రం బిగ్ డేటాను సమర్ధంగా వినియోగించుకోనుందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలో వ్యక్తుల ప్రైవసీకి భంగం వాటిల్లకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అనధికారికంగా డేటాను వినియోగించిన పక్షంలో కఠిన చర్యలు తప్పవని చెప్పారు. 







You may be interested

ఐపీఓకు బంధన్‌ బ్యాంకు

Wednesday 13th September 2017

మర్చంట్‌ బ్యాంకర్ల నియామకం న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా నడుస్తున్న బంధన్‌ బ్యాంకు తన తొలి పబ్లిక్‌ ఇష్యూకు గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ గ్రూపు, జేపీ మోర్గాన్‌ చేజ్‌, యాక్సిస్‌ బ్యాంకు, జేఎం ఫైనాన్షియల్‌, కోటక్‌ మహింద్రా బ్యాంకులను మర్చంట్‌ బ్యాంకర్లుగా నియమించినట్టు ప్రకటించింది. ‘‘షేర్ల విక్రయ పరిమాణం, ఐపీవో సమయం, ఇతర అంశాలేవీ ఇంకా ఖరారు కాలేదు. ప్రతిపాదిత ఐపీవోకు సంబంధించిన తుది నిర్ణయం నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి ఉంటుంది’’ అని

ధరలు పైకి... పారిశ్రామిక ఉత్పత్తి దిగువకు!

Wednesday 13th September 2017

 ఆర్థిక గణాంకాల నిరుత్సాహం  జూలైలో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతం  ఆగస్టులో ఐదు నెలల గరిష్టానికి రిటైల్‌ ధరల స్పీడ్‌ న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక గణాంకాలు ఇంకా నిరుత్సాహంగానే కొనసాగుతున్నట్లు మంగళవారం వెలువడిన గణాంకాలు స్పష్టంచేశాయి. 2017 జూలై పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు కేవలం 1.2 శాతంగా నమోదయింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ వృద్ధి రేటు 4.5 శాతం. ఇక ఏప్రిల్‌-జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి రేటు

Most from this category