News


రూ. 200 కోట్లు సమీకరించనున్న ఫినో పేమెంట్స్ బ్యాంక్‌

Tuesday 18th July 2017
news_main1500321401.png-5536

ముంబై: బిజినెస్ కరెస్పాండెంట్స్ సంస్థ ఫినో సోమవారం చెల్లింపుల బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే కొద్ది నెలల్లో సుమారు రూ. 200 కోట్లు మూలధనం సమీకరించనున్నట్లు ఈ సందర్భంగా ఫినో ఎండీ రిషి గుప్తా తెలిపారు. వచ్చే నాలుగేళ్లలోగా లిస్టింగ్ యోచన కూడా ఉన్నట్లు వివరించారు. "మాకు సుమారు రూ. 600 కోట్ల మేర మూలధనం అవసరం కాగా.. గత విడతలో రూ. 400 కోట్లు మాత్రమే సమీకరించాం. వచ్చే కొద్ది నెలల్లో మరో రూ. 150-200 దాకా సమీకరించనున్నాం" అని గుప్తా పేర్కొన్నారు. పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల విస్తరణకు అవసరమైన ఈ నిధులను ఫైనాన్షియల్ ఇన్వెస్టర్‌ కన్నా వ్యూహాత్మక మదుపుదారుల నుంచే నిధులు సమీకరించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫినో పేమెంట్స్ బ్యాంక్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ బీపీసీఎల్‌కు చెరి 20 శాతం మేర వ్యూహాత్మక భాగస్వామ్య వాటాలు ఉన్నాయి. You may be interested

ఏసీసీ లాభం రూ.326 కోట్లు

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో సిమెంట్‌ దిగ్గజం ఏసీసీ జూన్‌ త్రైమాసికంలో రూ.326 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో వచ్చిన రూ.246 కోట్లతో పోల్చుకుంటే తాజాగా 32 శాతం మేర వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్‌ విక్రయాలు 18 శాతం అధికమై రూ.3,818 కోట్లుగా నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు రూ.3,238 కోట్లు. సిమెంట్‌ విక్రయాలు 10 శాతం అధికంగా 6.74 మిలియన్‌ టన్నులు అమ్ముడుపోయినట్టు కంపెనీ

హైదరాబాద్‌లో రెంట్‌మోజో సేవలు షురూ

Tuesday 18th July 2017

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ వేదికగా గృహ, కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ ఇతరత్రా ఉత్పత్తులను అద్దెకిచ్చే రెంట్‌మోజో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, పుణె, చెన్నై, ముంబై నగరాల్లో సుమారు 25 వేల మంది యూజర్లుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 50 వేలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెంట్‌మోజో ద్వారా ఫర్నీచర్, అప్లియెన్సెస్, బైకులు, వాషింగ్‌ మిషన్లు, రిఫ్రిజిరేటర్, కార్యాలయ ఫర్నీచర్‌ వంటి ఉత్పత్తులను అద్దెకు తీసుకోవచ్చని రెంట్‌మోజో

Most from this category