STOCKS

News


పతంజలి ఓకే చేస్తే... ముద్రా రుణం!!

Tuesday 22nd May 2018
news_main1526928981.png-16648

  •  ఇంకా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ కూడా
  •  మొత్తం 40 సంస్థలతో జట్టు: ఆర్థిక శాఖ

న్యూఢిల్లీ: ముద్రా స్కీమ్ కింద చిన్న తరహా వ్యాపారవేత్తలకు రుణ సదుపాయం కల్పించే దిశగా.. కేంద్ర ఆర్థిక శాఖ 40 సంస్థలతో చేతులు కలిపింది. ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ, పతంజలి, అమూల్‌ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. "అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న 40 సంస్థలను గుర్తించాం. ముద్రా యోజన కింద రుణాలు అందుకోగతగ్గ వ్యాపారవేత్తలను ఈ సంస్థలు గుర్తించి, అండర్‌రైటింగ్ చేస్తాయి. ప్రభుత్వం ముద్రా స్కీమ్‌ కింద రుణాలిస్తుంది" అని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ ‍కుమార్ తెలిపారు. సాధారణంగా వ్యాపారవృద్ధికి రుణాలు కావాల్సిన వారు బ్యాంకులను సంప్రతిస్తుంటారని, కానీ అలా చేయలేని వారి వద్దకు నేరుగా ముద్రా పథకం ప్రయోజనాలను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రుణార్హత ఉన్న వారిని గుర్తించే క్రమంలో జూన్ 23న ముంబైలో సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. ఇందుకోసం ఆర్థిక శాఖ ఎంపిక చేసిన 40 సంస్థల జాబితాలో మేక్‌ మై ట్రిప్‌, జొమాటో, మేరు క్యాబ్, ముత్తూట్, ఎడెల్వీజ్, అమెజాన్‌, ఓలా, బిగ్ ‍బాస్కెట్‌, కార్జ్‌ ఆన్ రెంట్, హబీబ్ సెలూన్‌ మొదలైనవి ఉన్నాయి. 2015 ఏప్రిల్‌ 8న ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) కింద గడిచిన మూడేళ్లలో రూ.5.73 లక్షల కోట్ల పైగా రుణాలు మంజూరయ్యాయి. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర లఘు, చిన్న తరహా సంస్థలకు ఈ పథకం కింద రూ. 10 లక్షల దాకా రుణాలు లభిస్తాయి. 
 You may be interested

డొల్ల కంపెనీలకు ఐటీ షాక్‌..

Tuesday 22nd May 2018

 పన్ను బకాయిలు రాబట్టుకునేందుకు చర్యలు న్యూఢిల్లీ: రిజిస్ట్రేషన్ రద్దయిన డొల్ల కంపెనీల నుంచి కోట్ల కొద్దీ రూపాయల పన్ను బకాయిలను రాబట్టుకోవడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి పెట్టింది. ఇందుకోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌లలో ఇందుకు సంబంధించిన పిటీషన్లు దాఖలు చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల బృందాల్ని ఏర్పాటు చేయాలంటూ ఐటీ విభాగాన్ని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆదేశించింది.

మరో ఇద్దరు ఫోర్టిస్ డైరెక్టర్ల నిష్క్రమణ

Tuesday 22nd May 2018

 ఆరోపణలెదుర్కొంటున్న నలుగురూ ఔట్‌  నేడు షేర్‌హోల్డర్ల సమావేశం న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ విక్రయ అంశంలో సరిగ్గా వ్యవహరించడం లేదంటూ ఇన్వెస్టర్ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు హర్‌పాల్‌ సింగ్, సబీనా వైసోహా సోమవారం రాజీనామా చేశారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నలుగురు డైరెక్టర్లు కంపెనీ నుంచి వైదొలిగినట్లయింది. ఇద్దరు డైరెక్టర్లు తేజీందర్‌ సింగ్ షేర్గిల్‌, బ్రయాన్ టెంపెస్ట్‌ ఇప్పటికే తప్పుకున్నారు. ఈ నలుగురినీ తప్పించే అజెండాతో మంగళవారం ఫోర్టిస్

Most from this category