News


వాయిదా వేయకండి..

Sunday 16th July 2017
personal-finance_main1500198800.png-5470

నష్టపోవడమంటే ఎవరికి ఇష్టముంటుంది చెప్పండి. ఇన్వెస్టర్లు కూడా అందరిలాగే. అయితే వీరికెప్పుడూ అధిక రాబడులపైనే కన్నుంటుంది. అందుకే వీరు అక్కడ నష్టాలున్నాయని తెలిసినా కూడా లాభాల కోసం అందుబాటులోని అవకాశాలను వెతుక్కుంటారు. అయితే ఇక్కడ నష్టాలకు భయపడేవారూ కొందరుంటారు. వీరు నష్టాలకు భయపడి వారి పెట్టుబడులను వాయిదా వేసుకుంటుంటారు. ఇక్కడ మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్లకు అనువైన అవకాశం కోసం వేచిచూడటం ఎలా ఉంటుందంటే.. పంట వేయడం కోసం రైతులు వర్షాల కోసం ఎదురుచూసినట్లు. మనం ఇన్వెస్ట్‌మెంట్లను వాయిదా వేసుకుంటున్నామంటే.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వదులుకుంటున్నామని అర్థం చేసుకోవాలి.
కొందరు బస్సు కోసం చూస్తుంటారు. వస్తుంది. కానీ ఎక్కరు. అది కాస్తా ఖాళీగా లేదనకుంటూ వేరొక బస్సు కోసం ఉండిపోతారు. బస్సు ఎక్కితేనే కదా గమ్య స్థానానికి చేరేది? ఎక్కకుండా ఖాళీ బస్సు రావాలనుకుంటే కుదురుతుందా? అక్కడే ఉంటే ఎన్ని రోజులైనా అక్కడే ఉంటాం కదా!! బస్సు ఎక్కిన తర్వాత అందులో కుదుపులు, స్టాప్‌లు ఉంటాయి. అయితేనేం చివరకు గమ్యాన్ని చేరతాం కదా? ఇన్వెస్ట్‌మెంట్లు కూడా బస్సులాగే. తర్వాత చేద్దాంలే.. తర్వాత చూద్దాంలే అని అనుకుంటే.. పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. 
ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకుంటూ ఆర్థిక జీవితాన్ని ఆనందంగా గడపాలి. తెలివిగా పెట్టుబడులు పెట్టాలి. అలాగే అప్పు తీసుకునేటప్పుడు స్మార్ట్‌గా వ్యవహరించాలి. సమస్యలు, నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి సంఘటన ఒక అనుభవాన్ని మిగిలిస్తుంది. వాటిని గుర్తుకు తెచ్చుకుంటూ పరిస్థితులకు అనువుగా ముందుకు సాగిపోవాలి. ¿¶భయాన్ని అధిగమించాలి. అస్థిరతను జయించాలి. చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఇప్పటికిప్పుడు ఏం వస్తుందో చెప్పలేం. కానీ వృద్ధి అనేది ఒకటుంటుంది. దాన్ని గమనించాలి. దీనికి కొంత కాలాన్ని కేటాయించాలి. నీ వద్ద ఉన్న డబ్బులతో నీవేమీ చేయకపోవడమనేది చాలా పెద్ద తప్పు. ఇన్వెస్ట్‌మెంట్ల ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దానికి అనువుగా పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్లాలి. అప్పుడు మీరే మీ భయాల్ని మెల్లగా అధిగమిస్తారు. ఏమీ చేయకుండా ఖాళీగా ఉంటే మనకేమీ దొరకదు కదా? 







You may be interested

ఇండియాబుల్స్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం

Sunday 16th July 2017

ఇండియాబుల్స్ మ్యూచువల్ ఫండ్ సంస్థ తమ లిక్విడ్ ఫండ్‌లో ఇన్‌స్టంట్ యాక్సెస్ సదుపాయం ప్రవేశపెట్టింది. ఇన్వెస్టర్లు సత్వరం తమ పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారాంతాలైనా, బ్యాంకు సెలవుదినాలైనా, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా మూడొందల అరవై అయిదు రోజులు, ఇరవై నాలుగ్గంటలూ రిడెంప్షన్ (యూనిట్లు విక్రయించుకోవడం) అవకాశం కల్పిస్తున్నట్లు గ్రూప్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అక్షయ్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం దీన్ని దేశీ ఇన్వెస్టర్లకు మాత్రమే పరిమితం చేశారు. ఎన్నారై, కార్పొరేట్లకు

యాప్‌కీ కహానీ... ఆయకర్‌ సేతు

Sunday 16th July 2017

ఇది ఒక ఉచిత మొబైల్‌ యాప్‌. ఆదాయ పన్ను శాఖ ఈ యాప్‌ను అందిస్తోంది. పన్ను చెల్లింపుదారులు దీని సాయంతో ఆదాయ పన్ను శాఖ అందిస్తున్న పలు సేవలను పొందొచ్చు. ‘ఆయకర్‌ సేతు’ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.  ప్రత్యేకతలు –యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌.  –పన్ను చెల్లింపుదారులు వారికి ఉన్న సందేహాలను నివృతి చేసుకోవచ్చు.  –దగ్గరిలోని టీపీఎస్‌ కార్యాలయాన్ని గుర్తించవచ్చు.  –ట్యాక్స్‌ టూల్‌ సాయంతో వివిధ రకాల పన్ను లెక్కింపులు చేసుకోవచ్చు. –లైవ్‌ చాట్‌లో

Most from this category