STOCKS

News


ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి పేలవ ఫలితాలు?!

Thursday 18th April 2019
news_main1555584466.png-25210

నిపుణుల అంచనా
పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా తాజాగా ఫెడరల్‌ బ్యాంకులో వాటాను తగ్గించుకుంటూ వస్తున్నారు. మార్చిచివరి నాటికి రాకేశ్‌ దాదాపు 12.5 లక్షల ఫెడరల్‌ బ్యాంకు షేర్లను తన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా విక్రయించారు. దీంతో బ్యాంకులో ఆయన వాటా 1.16 నుంచి 1.1 శాతానికి దిగివచ్చింది. క్యు3లో స్థిరమైన ఫలితాలు ప్రకటించినా బ్యాంకు షేరు ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగలేదు. దీంతో క్యు4లో బ్యాంకు ఫలితాలు పేలవంగా ఉంటాయని, అందుకే షేరు ధర పెరగడం లేదని, ఇందువల్లే రాకేశ్‌ వాటాలు విక్రయించారని మార్కెట్లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మే4న బ్యాంకు క్యు4 ఫలితాలు ప్రకటించనుంది. అయితే ఈ ఊహాగానాలను ప్రముఖ బ్రోకరేజ్‌లు కొట్టిపారేస్తున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్యాంకుపై పాజిటివ్‌గా ఉంది. బ్యాంకు నికర లాభం రెట్టింపవుతుందని అంచనా వేస్తోంది. ఎన్‌ఐఎం సైతం మెరుగ్గా ఉంటుందని భావిస్తోంది. ఇతర ఆదాయంలో 18 శాతం పెరుగుదల ఉంటుందని, ఫీజు ఆదాయం బలంగా ఉంటుందని అభిప్రాయపడింది. స్లిపేజ్‌లు నెమ్మదిస్తాయని అంచనా వేసింది. ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ సైతం బ్యాంకు లాభంలో 150 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాల్లో మంచి పెరుగుదల ఉంటుందని పేర్కొంది. ఆస్తుల నాణ్యత సైతం స్థిరంగా ఉండవచ్చని అభిప్రాయపడింది. 



You may be interested

అడాగ్‌ షేర్లు...నిలువునా పతనం

Thursday 18th April 2019

మార్కెట్‌ లాభాల స్వీకరణలో భాగంగా అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) గురువారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. గత రెండు రోజుల్లో 15 శాతం నష్టపోయిన రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో మరో 13శాతం కోల్పోయి రూ.149.65 వద్ద స్థిరపడింది. ఇదే గ్రూప్‌లోని రిలయన్స్‌ పవర్‌ 14శాతం నష్టపోయి 8.10 వద్ద, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 4శాతం నష్టపోయి 2.40శాతం వద్ద ముగిశాయి. అలాగే రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 8.80శాతం, రిలయన్స్ హోమ్‌

రికార్డుస్థాయి నుంచి వెనక్కి

Thursday 18th April 2019

ఇన్వెస్టర్ల అప్రమత్తతతో పాటు లాభాల స్వీకరణతో  గురువారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 135 పాయింట్లు నష్టపోయి 39140.28 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 11752.80 వద్ద స్థిరపడింది. సూచీలు రికార్డుస్థాయిలకు చేరిన తరుణంలో  ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో పాటు నేడు మార్కెట​ముగింపు అనంతరం దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుండటం, గుడ్‌ఫ్రైడ్‌ సందర్భంగా రేపు(శుక్రవారం), శని

Most from this category