STOCKS

News


పైకప్పు అదిరింది!

Saturday 13th January 2018
personal-finance_main1515782535.png-13104

సాక్షి, హైదరాబాద్‌: డ్యూప్లెక్స్, ఫ్లాట్లలో పడక గదులకు ఫాల్స్‌ సీలింగ్‌ అధికమవుతోంది. ఇది మీ అభిరుచులకు అద్దం పట్టాలంటే మాత్రం సీలింగ్‌ డిజైన్‌తో పాటూ సరైన వర్ణాల్ని ఎంచుకోవాలి. ఫాల్స్‌ సీలింగ్‌ ప్రధాన ఉద్దేశం.. గదిలో ఆహ్లాదభరిత వాతావరణాన్ని ఏర్పరడడం, అలసిన మనసు, శరీరానికి స్వాంతన చేకూర్చడమే! సరైన రంగుల కలయికతో ఆశించిన రూపాన్ని ఆవిష్కరించుకోవచ్చు. దీంతో మనసుకు ఆకట్టుకునే సీలింగ్‌ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పైకప్పు విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. పైకప్పును మృదువైన వర్ణాలు వేస్తే ఆ రూపం ఆనందమయం అవుతుంది.

  •  మిగతా గదులతో పోలిస్తే పడక గది సీలింగ్‌నే ఎక్కువ సేపు చూస్తాం. కాబట్టి, వర్ణాల ఎంపికలో కూడా విజ్ఞత పాటించాలి. సాదాసీదా రంగులు కాకుండా నేటి పోకడలకు అద్దం పట్టేవి ఎంచుకోవాలి. ఇది మీ మనసులోని భావాలకు ప్రతీకగా నిలవాలి.
  •  మధ్యస్తం, డార్క్‌ బ్రౌన్‌ వర్ణాలు పడక గదికి చక్కగా నప్పుతాయి. ఎందుకంటే ఈ వర్ణాలు ఉత్సాహపరిచే విధంగా, స్వభావానికి అనుకూలంగా ఉంటాయి. బిగీస్, బ్రౌన్స్, టాన్స్‌ వాడండి. ఇవి పుడమి రూపాన్ని తలపిస్తాయి. కొండలు, రాళ్లు, మట్టి రూపాల్ని ప్రతిబింబిస్తాయి. 
  •  ఆకుపచ్చ, బ్రౌన్‌ మిశ్రమం పడకగదిని అద్భుతంగా మారుస్తుంది. గదిలో ఆత్మీయత భావనను కలిగిస్తుంది. ఆకుపచ్చలో సరైన షేడ్లను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని షేడ్లు వర్ణస్థాయిని తక్కువ చేస్తాయి.

వర్ణాల ఎంపికలో..

  •  గోడ రంగుతో పోల్చుకుంటే సీలింగ్‌కు వేసే వర్ణం తేలికగా ఉండాలి. అప్పుడే పైకప్పు తక్కువ ఎత్తులో ఉందనిపిస్తూ విశాలంగా ఉన్న భావన కలుగుతుంది. ముదురు షేడ్లను ఎంచుకుంటే పైకప్పు ఎత్తులో ఉన్న భావన కలుగుతుంది.
  •  తాజాదనం ఉట్టిపడుతున్న లుక్‌ రావాలంటే.. మోనో క్రోమోటిక్‌ థీమ్‌ను ఎంచుకోవాలి. రెండు, మూడు రంగులు కలిసినవి ఎంచుకుంటే మాత్రం అది పడకగది గోడలకు వేసిన రంగు కంటే తేలికగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే సీలింగ్‌ ప్రశాతం భావనను కలిగిస్తుంది.
  •  పైకప్పునకు తెలుపు రంగు కూడా వేసుకోవచ్చు. కానీ, సంప్రదాయ పద్ధతి. నేటి పోకడలకు అద్దం పట్టదని గుర్తుంచుకోండి. గోడల రంగుకు, సీలింగ్‌కు ఒకే రకమైనవి కాకుండా వేర్వేరు వర్ణాల్ని కూడా వేసుకోవచ్చు. దగ్గరదగ్గర రంగులు కాకుండా చూడగానే ఇట్టే కన్పించాలి. అంటే లేత గులాబీ, లేత ఎరుపు వర్ణాలాంటివన్నమాట.
  •  దృశ్య వ్యక్తీకరణ ప్రదేశంగా సీలింగ్‌ను వినియోగించుకోవాలి. ఆహ్లాదభరితమైన ఆకాశం, లేదంటే గదిలో కలిసిపోయేలా ఆకట్టుకునే ఆకారాలు, వర్ణాలతో నాటకీయత కన్పించేలా అలంకరించుకోవాలి.

 



You may be interested

17,356 ఫ్లాట్లు ఫర్‌ సేల్‌!

Saturday 13th January 2018

 హైదరాబాద్‌లో ఏడాదిలో 38 శాతం తగ్గిన ఇన్వెంటరీ సాక్షి, హైదరాబాద్‌: 2017... స్థిరాస్తి రంగానికి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ రియల్టీ రంగం గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీకి ఈ ఏడాదిలో ముహూర్తం కుదిరింది. రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా), వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లతో సప్లయి తగ్గడంతో ఇన్వెంటరీ ఫ్లాట్ల కొనుగోళ్లు పెరిగాయి. జస్ట్‌.. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న ఇన్వెంటరీ 38 శాతం

ఐఎస్‌డీ కాల్‌ టెర్మినేషన్ రేటు తగ్గించిన ట్రాయ్‌

Saturday 13th January 2018

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ ఇన్‌కమింగ్ కాల్ టెర్మినేషన్ రేటును 53 పైసల నుంచి 30 పైసలకు తగ్గిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. కొత్త రేటు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అధిక ఐఎస్‌డీ చార్జీల ప్రసక్తి లేకుండా వీవోఐపీ విధానంలో కొందరు అక్రమార్కులు ఇంటర్నేషనల్ కాల్స్‌ని భారత యూజర్లకు మళ్లిస్తుండటాన్ని నిరోధించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రాయ్ తెలియజేసింది. అక్రమ ఐఎస్‌డీ

Most from this category