STOCKS

News


కార్పొరేట్లకు అప్పులిచ్చి బాగుపడ్డ బ్యాంకులున్నాయా?

Monday 16th April 2018
news_main1523862921.png-15537

దేశంలో సరైన కార్పొరేట్‌ రుణ మంజూరీ నమూనానే లేదు
యాంబిట్‌ కాపిటల్‌ సీఈఓ సౌరవ్‌ ముఖర్జీ
భారత బ్యాంకింగ్‌ రంగంపై, రుణ మంజూరీ వ్యవహారాలపై యాంబిట్‌ కాపిటల్‌ సీఈఓ సౌరవ్‌ ముఖర్జీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక్క బ్యాంకైనా కార్పొరేట్లకు రుణాలిచ్చి లాభాలు పొందిన సందర్భం ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్‌ రుణాలకు సరైన నమూనానే మనదేశంలో లేదని కుండబద్దలు కొట్టి చెప్పారు. అలాంటప్పుడు బ్యాంకుల వాల్యూషన్ల గురించి మాట్లాడడంలో అర్ధంలేదని అన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ ఒక్క బ్యాంకు కూడా కార్పొరేట్‌ లెండింగ్‌తో సంపద సృష్టించిన దాఖలాలు లేవన్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఇప్పటికీ పలు సవాళ్లున్నాయని చెప్పారు. దేశీయ సంపదలో 95 శాతం వాటా భౌతిక ఆస్తులదేనని ఇటీవల ఆర్‌బీఐ నివేదిక వెల్లడించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అంటే రుణాలిచ్చే బ్యాంకుల కన్నా పొదుపును ప్రేరేపించే విధానాలే మేలని జనాలు నమ్ముతున్నారన్నారు. పొదుపు థీమ్‌లోనే అవకాశాలు అపారమని చెప్పారు. సేవింగ్స్‌ విభాగంలో బీమా కంపెనీలు, బ్రోకరేజ్‌ కంపెనీలపై దృష్టి పెట్టవచ్చని, అయితే వాల్యూషన్లను గమనించి పెట్టుబడులు పెట్టాలని సూచించారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై ఉపన్యాసాలు ఇచ్చే కంపెనీలు, ఛాంపియన్లమని చెప్పుకునే కంపెనీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
నిఫ్టీ ఉండాల్సింది 9వేల దగ్గరే
జనవరి గరిష్ఠాల నుంచి మార్కెట్లు పది శాతం పతనమయ్యాయి. అయితే ఇప్పటికీ దేశీయ సూచీలు ఓవర్‌వాల్యూగానే ఉన్నాయని మార్కెట్‌నిపుణులు భావిస్తున్నారు. నిజానికి నిఫ్టీ నిజవిలువ ప్రస్తుతం 9,000 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ నిజవిలువ 30,000 పాయింట్ల వద్ద ఉండాలని, ఇప్పుడున్న స్థాయిలు ఓవర్‌వాల్యూ స్థాయిలని యాంబిట్‌ కాపిటల్‌ సీఈఓ సౌరవ్‌ముఖర్జీ చెప్పారు. ప్రస్తుత సూచీల విలువలు ఫండమెంటల్స్‌తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు.  రాబోయే ఎర్నింగ్స్‌ సీజన్‌తో వాల్యూషన్లు ఏమీ సమతుల్యం చెందవని అభిప్రాయపడ్డారు. కనీసం ఈ ఆర్థిక సంవత్సరమంతా రెండంకెల ఎర్నింగ్స్‌ వృద్ధి నమోదయితే వాల్యూషన్లు సమతుల్యం చెందుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ట్రాక్టర్లు, టూవీలర్స్‌, మెటల్‌ అండ్‌ మైనింగ్‌ రంగాల షేర్లను పోర్టుఫోలియోలో చేర్చుకోవచ్చని సలహా ఇచ్చారు. పాశ్చాత్య దేశాల్లో వృద్ధి రికవరీ బాట పట్టడంతో ఐటీ కంపెనీలకు, దేశీయంగా గ్రామీణరంగంపై ప్రభుత్వ వ్యయం పెరగడంతో ఎఫ్‌ఎంసీజీ, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాల కంపెనీలకు మేలు చేకూరుతుందన్నారు. You may be interested

బీమా ఉన్నా... బిల్లు మొత్తం రాదు!!

Monday 16th April 2018

ఆరోగ్య బీమాకూ పరిమితులున్నాయ్‌   చికిత్స వ్యయాలకు సబ్‌–లిమిట్స్‌ ఒకోసారి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ కింద భారీగా కవరేజీ ఉన్నా.. క్లెయిమ్‌ సమయంలో అరకొర మాత్రమే చేతికి రావొచ్చు. ఉదాహరణకు మనకు రూ. 2 లక్షల దాకా కవరేజీ ఉందనుకుందాం. వైద్య చికిత్స బిల్లు రూ.లక్షే అయింది. ఇలాంటప్పుడు కవరేజీ రూ.2 లక్షల దాకా ఉంది కాబట్టి.. క్లెయిమ్‌ చేసిన రూ. లక్ష తిరిగి వస్తుందనే చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి

పెట్టుబడుల స్థిర వృద్ధి సాధనం..!

Monday 16th April 2018

మంచి రాబడుల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రచార, అవగాహన కార్యక్రమాల తోడ్పాటుతో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు కూడా ఫండ్స్‌వైపు అడుగులు వేస్తున్నారు.అయితే, కొత్తగా ఇన్వెస్ట్‌ చేసేవారు, మెరుగైన రాబడులు కోరుకునే వారు, భారీ ఆటుపోట్లకు దూరంగా ఉండేవారు పరిశీలించతగిన పథకం ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌ ఫండ్‌. ఇటీవలి మార్కెట్లలో నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఆదాయాలు, లాభాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో కూడిన పెద్ద కంపెనీలను

Most from this category