STOCKS

News


ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారం

Saturday 16th June 2018
news_main1529144016.png-17448

న్యూఢిల్లీ: భారతదేశ ఎగుమతుల విలువ 2018 మే నెలలో  28.86 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 2017 మే నెలలో ఎగుమతులతో పోల్చితే వృద్ధి రేటు 20.18 శాతంగా నమోదయ్యింది. ఇంత స్థాయి వృద్ధిరేటు ఆరు నెలల్లో ఇదే తొలిసారి. 2017 నవంబర్‌లో ఎగుమతుల్లో 30.55 శాతం వృద్ధి నమోదయ్యింది. వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో ముఖ్యాంశాలు చూస్తే...
♦ ఎగుమతులు పెరిగినా, వాణిజ్యలోటు తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇది మే నెలలో 14.62 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి. ఈ ఏడాది జనవరిలో 16.28 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు నమోదయ్యింది.
  మే నెలలో దిగుమతులు కూడా భారీగా 14.85 శాతంగా నమోదయ్యాయి. విలువ రూపంలో 43.48 బిలియన్‌ డాలర్లు.
పెట్రోలియం ప్రొడక్టులు, రసాయనాలు, ఫార్మా, ఇంజనీరింగ్‌ రంగాలు ఎగుమతుల పెరుగుదలకు దారితీశాయి. అయితే జీడిపప్పు, ముడి ఇనుము, జౌళి, రత్నాలు-ఆభరణాలు, హస్తకళల ఉత్పత్తులు, కార్పెట్‌ విభాగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది.
పసిడి దిగుమతులు భారీగా 29.85 శాతం పతనమయ్యాయి. విలువ 4.96 బిలియన్‌ డాలర్ల నుంచి 3.48 బిలియన్‌ డాలర్లకు పడ్డాయి.
ఏప్రిల్‌-మే నెలల్లో...
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలు- ఏప్రిల్‌, మే నెలల్లో ఎగుమతులు 13 శాతం పెరిగి 54.77 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 9.72 శాతం పెరిగి 83.11 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. దీనితో వాణిజ్యలోటు 28.34 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 27.09 బిలియన్‌ డాలర్లు.



You may be interested

జీడీపీకి చమురు సెగ

Saturday 16th June 2018

ముంబై: ముడి చమురు రేట్లు, కీలక పాలసీ రేట్ల పెరుగుదల ప్రభావాలతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో వృద్ధి రేటు మందగించే అవకాశం ఉన్నట్లు జపాన్‌కి చెందిన బ్రోకరేజి సంస్థ నొమురా అంచనా వేసింది. ప్రథమార్ధంలో వృద్ధి మెరుగ్గా 7.5- 8 శాతం మేర ఉన్నప్పటికీ, ద్వితీయ అర్థ భాగంలో మందగించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.5 శాతానికి పరిమితం

మళ్లీ 68 దాటేసిన రూపాయి

Saturday 16th June 2018

ముంబై: మరోసారి డాలర్లకు డిమాండ్‌ ఏర్పడడంతో దేశీ కరెన్సీ రూపాయి మరింత పతనాన్ని చవిచూసింది. శుక్రవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే 39పైసలు నష్టంతో 68.01వద్ద ముగిసింది. మే 24 తర్వాత మరోసారి కనిష్ట స్థాయిలో ముగిసింది. ఇంట్రాడేలో 68.04 వరకు తగ్గగా, ఆ తర్వాత మూడు పైసల మేర కోలుకుంది. వాణిజ్య లోటు అంచనాలకన్నా ఎక్కువగా ఉండడం ప్రభావాన్ని చూపించింది. డాలర్‌ బలానికి అత్యధికంగా నష్టపోయిన ఆసియా కరెన్సీ

Most from this category