News


డిసెంబర్‌కల్లా మిడ్‌క్యాప్స్‌ జోరు..!

Wednesday 16th May 2018
Markets_main1526454338.png-16502

ముంబై: దీర్ఘకాలంలో మిడ్‌క్యాప్‌ రంగ షేర్లు మంచి ఆదాయ వృద్ధి రేటును నమోదుచేయనున్నాయని ఎన్విజన్ కాపిటల్ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నీలేష్ షా విశ్లేషించారు. రిస్క్‌ అడ్జెస్టెడ్‌ అప్‌సైడ్‌ కూడా ఉన్నతంగా మారనుందని వివరించారు. గడిచిన కొంతకాలంగా మిడ్‌క్యాప్స్‌ నష్టాల్లో ఉండగా.. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) నికర అమ్మకందారులుగా ఉండడం, నియంత్రణ పరమైన కారణాల రిత్యా మ్యూచువల్‌ ఫండ్స్‌ పునఃవ్యవస్థీకరణ చోటుచేసుకోవడం లాంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో ఈ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషించారు. ఇదే పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగుతూనే ఉంటుందని అంచనావేసిన ఆయన ఈ ఏడాది చివరివరకు అమ్మకాల ఒత్తిడి నమోదుకావచ్చన్నారు. మరో 2-3 త్రైమాసికాల వరకు మిడ్‌క్యాప్స్‌ అంతగా ఆకర్షణీయంగా లేకపోయినప్పటికీ.. డిసెంబరు నాటికి కొనుగోళ్లు జోరు మొదలవుతుందని అన్నారు. 2019లో బలమైన ప్రభుత్వం ఏర్పాటైతే 2014 తరహాలో ర్యాలీ చోటుచేసుకుని మిడ్‌క్యాప్‌ షేర్లు మంచి రాబడిని అందిస్తాయని అంచనావేశారు. బుల్‌ మార్కెట్‌లో మిడ్‌క్యాప్‌ రంగ షేర్లు అవుట్‌పెర్ఫార్మ్‌ చేయడం చాలా సహజం అన్న ఆయన దీర్ఘకాలంలో మార్కెట్‌ ర్యాలీ కొనసాగితే ఈ రంగ షేర్లు మళ్లీ అవుట్‌పెర్ఫార్మ్‌గానే నిలవనున్నాయని అంచనాను వెల్లడించారు. లాంగ్‌టెర్మ్‌ ఇన్వెస్టర్లు తాత్కాలిక ప్రభావం చూపే అంశాలను పెద్దగా పట్టించుకోకూడదని సూచించిన నీలేష్ షా.. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి పరిస్థితి తాత్కాలికం అన్నారు. రోజువారీ అంశాలు, స్వల్పకాలిక అంశాలను పక్కన పెట్టి దీర్ఘకాల అంశాల ఆధారంగా మార్కెట్‌లో పెట్టుబడులను కొనసాగించడం తమ వ్యూహమని వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాల ప్రభావం వచ్చే ఏడాదిలో ఎలా ఉంటుంది..? పలు అసెంబ్లీ స్థానాలకు డిసెంబరులో ఎన్నికలు ఉండగా ఈ ప్రభావం అప్పటి వరకు ఎలా ఉంటుంది? 2019 మే ఎన్నికలలో ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను బేరీజువేసుకుని మాత్రమే పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల అంశానికి కొంతమేర ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. కంపెనీల ఆదాయాలు, దేశ ఆర్థిక వ్యవస్థ దృక్పథం ఏ విధంగా ఉందనే అంశాలే తమ పెట్టుబడులకు అత్యంత కీలక విషయాలుగా వెల్లడించారు. ఎన్నికల వేడి పూర్తయిన తరువాత వాల్యుయేషన్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తాయని, ఉన్నత వాల్యుయేషన్స్‌ ఉన్న కంపెనీలతో పాటు వాల్యుయేషన్స్‌ సమంజసంగా ఉన్న కంపెనీలలో కూడా పెట్టుబడుల వరద చోటుచేసుకుంటుందని అంచనావేశారు. దీర్ఘకాలంలో పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయని సూచించిన ఆయన భారత స్టాక్‌ మార్కెట్‌ ఖరీదుగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉండమే అతిపెద్ద ఆకర్షణీయ అంశమని అన్నారు. మొత్తం మార్కెట్‌ అంతా కూడా ఒక సింగిల్‌ డిజిట్‌ పీఈ వాల్యుయేషన్‌కు సరిపడే సాంప్రదాయ విలువ సిద్ధాంతానికి భారత మార్కెట్‌ సరిపోదని విశ్లేషించిన షా.. గడిచిన 20-25 ఏళ్లకాలంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోలేదని వివరించారు. వృద్ధి రేటు ఆధారంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు భారత్‌ అనుకూల ప్రాంతం కాగా, వచ్చే 5-10 ఏళ్లలో వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుందన్నారు. సంఘటనల ఆధారంగా రిస్క్‌ కలిగిఉన్న పెట్టుబడులు, హెడ్‌లైన్‌ పీఈ మల్టిపుల్స్‌పై ఆధారపడి పెట్టుబడులు పెట్టడం కాకుండా.. వృద్ధి రేటు పరంగా ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించడం ఇక్కడ వాతావరణంలో సరిగ్గా సరిపోతుందని సూచించారు. వచ్చే 2-3 నెలలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యలభ్యత ఎలా ఉండనుంది, కర్ణాటక ఎన్నికల అంశం ఆధారంగా మార్కెట్‌ ప్రయాణం ఉంటుందన్నారు. మార్కెట్‌కు గరిష్టస్థాయిల వద్ద ఇంతకుముందు నమోదైన అధికస్థాయిలు రెసిస్టెన్స్‌ లెవెల్స్‌గా ఉండనున్నాయని అన్నారు. వర్షపాతం, ముడిచమురు ధరలు ఎలా ఉండనున్నాయి అనేవి ఫండమెంటల్‌గా కీలకమన్నారు. రెండెంకల వృద్ధి రేటును సాధిస్తుండడం, టైర్‌ టూ, టైర్‌ త్రీ నగరాలలో లిక్విడిటీ పెరగడం కారణంగా హెచ్‌యూఎల్‌, టైటాన్‌ షేర్లలో ప్రీమియం కొనసాగుతుందన్నారు.You may be interested

ఆర్‌కామ్‌కు ఎరిక్సన్‌ షాక్‌..!

Wednesday 16th May 2018

ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌  20శాతానికి పైగా నష్టపోయిన షేరు ముంబై:- రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌కు వ్యతిరేకంగా టెక్నాలజీ దిగ్గజం ఎరిక్సన్‌ ఎన్‌సీఎల్‌టీలో దివాలా పిటిషన్‌ ధాఖలు చేయడంతో బుధవారం ఆర్‌కాం షేర్లు 20శాతానికి పైగా పతనమయ్యాయి. ఆర్‌కామ్‌కు చెందిన దేశవ్యాప్త నెట్‌వర్క్‌ను నిర్వహించేందుకు 2014లో ఎరిక్సన్‌ ఏడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే బిల్లు చెల్లింపుల్లో ఆర్‌కాం విఫలమైంది. దీంతో ఆర్‌కామ్‌, దాని అనుబంధ సంస్థల నుంచి రూ.1,150 కోట్ల బకాయిలను రాబట్టేందుకు ఎరిక్సన్‌

స్వల్పకాలానికి 3 టెక్నికల్‌ సిఫార్సులు

Wednesday 16th May 2018

సమీప భవిష్యత్‌లో దాదాపు 10 శాతం రాబడినిచ్చే మూడు స్టాకులను సాంకేతిక నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 1. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 438. స్టాప్‌లాస్‌ రూ. 387. స్వల్పకాలిక కన్సాలిడేషన్‌ అనంతరం రూ. 400కు పైన పాజిటివ్‌ బ్రేకవుట్‌ ఇచ్చింది. ఆర్‌ఎస్‌ఐ హయ్యర్‌ బాటమ్‌ అండ్‌ టాప్‌ ఏర్పరచగా, ఎంఏసీడీ పాజిటివ్‌ క్రాసోవర్‌తో ట్రేడవుతోంది. డీఐ ఇండికేటర్‌ కూడా పాజిటివ్‌ సంకేతాలనే ఇస్తోంది. 2. ఎన్‌ఎండీసీ: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 107.

Most from this category