News


మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రికార్డుస్థాయిలో పెట్టుబడులు

Monday 11th September 2017
personal-finance_main1505149506.png-8388

  • ఆగస్టులో రూ. 20,000 కోట్లు

న్యూఢిల్లీ: ఆగస్టు నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి రికార్డుస్థాయిలో రూ. 20,362 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. జూలై నెలలో ఈ పెట్టుబడులు రూ. 12,727 కోట్లు. మ్యూచువల్‌ ఫండ్స్‌ సాధనాల పట్ల అవగాహన కల్పిస్తూ సెబి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు జోరుగా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు తరలిరావడం వరుసగా ఇది 17వ నెల. 2016 మార్చిలో రూ. 1,370 కోట్లు ఫండ్‌ స్కీముల నుంచి తరలివెళ్లిన తర్వాత ఇప్పటివరకూ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఆగస్టు నెలలో రికార్డుస్థాయిలో పెట్టుబడులు తరలిరావడంతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.6.44 లక్షల కోట్లకు చేరింది. జూలైలో ఇది రూ.6.3 లక్షల కోట్లు.ఆగస్టు నెలలో ఈక్విటీ మార్కెట్లలో కరెక‌్షన్‌ వచ్చినప్పటికీ, ఇన్వెస్టర్ల ఉత్సాహం తగ్గలేదని, సిప్‌ పెట్టుబడులు కొనసాగాయని, క్షీణతలో మరిన్ని యూనిట్లు కొనుగోలు చేయాలన్న ఇన్వెస్టర్ల ఆసక్తి కారణంగా పెట్టుబడులు పెరిగినట్లు బజాజ్‌ క్యాపిటల్‌ సీఈఓ రాహుల్‌ పారిఖ్‌ చెప్పారు. ఈక్విటీ, డెట్‌ కలిపి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 20.6 లక్షల కోట్లకు చేరింది.







You may be interested

ముంబైలో ఎయిర్‌టెల్‌ 4జీ వీవోఎల్‌టీఈ సేవలు

Monday 11th September 2017

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘భారతీ ఎయిర్‌టెల్‌’ తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 4జీ వీవోఎల్‌టీఈ సేవలను ప్రారంభించింది. దీంతో రిలయన్స్‌ జియో తర్వాత వీవోఎల్‌టీఈ సర్వీసులను ఆవిష్కరించిన రెండో టెలికం కంపెనీగా ఎయిర్‌టెల్‌ నిలిచింది. వీవోఎల్‌టీఈ సేవలకు ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఎయిర్‌టెల్‌ తెలిపింది. కస్టమర్లకు హెచ్‌డీ క్వాలిటీ కాల్స్‌ అందించడం కోసం త్వరలోనే ఇతర మెట్రో ప్రాంతాల్లో వీవోఎల్‌టీఈ సేవలను ఆవిష్కరిస్తామని

ఎస్‌బీఐ లైఫ్‌ ఐపీవోకు గ్రీన్‌సిగ్నల్‌

Monday 11th September 2017

రూ.7,000 కోట్ల నిధుల సమీకరణ న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోని ప్రముఖ బీమా కంపెనీ ఎస్‌బీఐ లైఫ్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూకు (ఐపీవో) సెబీ నుంచి ఆమోదం లభించింది. ఐపీవోకు సంబంధించి ఎస్‌బీఐ లైఫ్‌ ఈ ఏడాది జూలైలో దరఖాస్తు చేసుకుంది. ఐపీవో ద్వారా రూ.6,500-7,000 కోట్ల వరకు నిధులను సమీకరించే అవకాశాలున్నాయి. ఐపీవోలో భాగంగా 12 కోట్ల షేర్ల (రూ.10 ముఖ విలువ)ను ఎస్‌బీఐ లైఫ్‌ ప్రమోటర్లు ఆఫర్‌ చేయనున్నారు. ఇది

Most from this category