STOCKS

News


పీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతానికి తగ్గింపు

Thursday 22nd February 2018
personal-finance_main1519237868.png-14108

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో 2017-18 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌పై వడ్డీ రేటును 8.65 శాతం నుంచి 8.55 శాతానికి తగ్గించింది. దీంతో రూ. 586 కోట్ల మేర మిగులు నమోదు కానుందని ఈపీఎఫ్‌వో ట్రస్టీల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం 8.65 శాతం వడ్డీ రేటునివ్వడంతో.. రూ. 695 కోట్లు మిగులు నమోదైనట్లు వివరించారు. దాదాపు 6 కోట్ల చందాదారులపై ఇది ప్రభావం చూపనుంది. తాజాగా వడ్డీ రేటు నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదముద్ర వేయగలదని, అటు కార్మిక సంఘాలు సైతం దీనికి అంగీకరించగలవని గంగ్వార్ ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి బాండ్ల పెట్టుబడులపై ఈపీఎఫ్‌వోకి 8 శాతమే రాబడులు వచ్చినప్పటికీ.. ఈటీఎఫ్‌లలో కొన్ని పెట్టుబడులను విక్రయించినందువల్ల 8.55 శాతం వడ్డీ రేటు ఇవ్వడానికి సాధ్యపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా ఈపీఎఫ్‌వో యూఏఎన్‌కి ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని మంత్రి ఆవిష్కరించారు. అడ్మినిస్ట్రేటివ్ చార్జీలను 0.65 శాతం నుంచి 0.50 శాతానికి తగ్గించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) నిర్ణయించినట్లు గంగ్వార్ వివరించారు. అటు, ఇకపై పది మంది ఉద్యోగులున్న సంస్థలు కూడా ఈపీఎఫ్‌వో స్కీములో భాగమయ్యేలా చేయాలని సీబీటీ నిర్ణయించింది. ప్రస్తుతం ఈ నిబంధన 20 మంది పైగా ఉద్యోగులన్న సంస్థలకే వర్తిస్తోంది. తాజా నిర్ణయంతో ఈపీఎఫ్‌వో చందాదారుల సంఖ్య ప్రస్తుతమున్న 6 కోట్ల నుంచి దాదాపు 9 కోట్ల దాకా పెరగవచ్చని గంగ్వార్ పేర్కొన్నారు.



You may be interested

సీవోఏఐ ఆరోపణలకు అర్థం లేదు: ట్రాయ్‌

Thursday 22nd February 2018

న్యూఢిల్లీ: టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా సెల్యులర్‌ ఆపరేటర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) ఆరోపణలను కొట్టిపారేసింది. నిరూపించలేని ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించింది. జియో పేరు ప్రస్తావించకుండానే ట్రాయ్‌ ఆర్డర్లు ఒక ఆపరేటర్‌కు మాత్రమే లబ్ధి కలిగించేలా ఉన్నాయని సీవోఏఐ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘రెగ్యులేటరీ సంస్థ ఎంతో పారదర్శకంగా పనిస్తోంది. సీవోఏఐకి ట్రాయ్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం ఒక అలవాటుగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు

‘ఖాయిలా’ జాబితాలు తయారవుతున్నాయ్‌..!

Thursday 22nd February 2018

నీతి ఆయోగ్‌ వెల్లడి  న్యూఢిల్లీ: ప్రైవేటీకరణ చేయాల్సిన ఖాయిలా ప్రభుత్వ రంగ సం‍స్థల మరో జాబితాను నీతి ఆయోగ్‌ సిద్ధం చేస్తోంది. ఖాయిలా పడిన 40 పీఎస్‌యూల్లో వ్యూహాత్మక డిజిన్వెస్ట్‌మెంట్‌ అమలు చేయాలని ఇప్పటికే సూచించామని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు. ఈ విషయమై దీపమ్‌(డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌) కసరత్తు చేస్తోందని, ఈ ప్రక్రియ తుది దశలో ఉందని వివరించారు. ఖాయిలా పడిన

Most from this category