STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీకి స్వస్తి

Saturday 10th February 2018
Markets_main1518257843.png-13867

విదేశీ ఎక్చేంజ్‌లకు ట్రేడింగ్‌ డేటా నిలిపివేసేందుకు నిర్ణయించిన దేశీయ ఎక్చేంజ్‌లు
విదేశీ ఎక్చేంజ్‌లతో ట్రేడింగ్‌ డేటా పంచుకోవడాన్ని నిలిపివేయనున్నట్లు భారత్‌కు చెందిన మూడు స్టాక్‌ ఎక్చేంజ్‌లు ప్రకటించాయి. ట్రేడింగ్‌ వాల్యూంలు విదేశాలకు తరలిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయంతో సింగపూర్‌, దుబాయ్‌ ఎక్చేంజ్‌ల్లో నిఫ్టీ 50, సెన్సెక్స్‌, స్టాక్స్‌ డెరివేటివ్‌ ట్రేడింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పడనుంది. ఎస్‌జీఎక్స్‌కు నిఫ్టీ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కోసం ఇచ్చిన లైసెన్స్‌ తాజా నిర్ణయంతో ముగింపునకు రానుందని ఎన్‌ఎస్‌ఈ సీఈఓ విక్రమ్‌ లిమయే చెప్పారు. వచ్చే ఆరునెలల్లో ఈ కాంట్రాక్ట్‌ ముగిసేలా టెర్మినేషన్‌ నోటీసు ఇస్తామన్నారు. భారత మార్కెట్ల ప్రయోజనార్ధమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు. ఇటీవలే విడిస్టాకుల ఫ్యూచర్ల ట్రేడింగ్‌ను కూడా ఎస్‌జీఎక్స్‌ ఆఫర్‌ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇలా విదేశీ ఎక్చేంజ్‌ల్లో ట్రేడయ్యే దేశీయ డెరివేటివ్స్‌ను విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు క్యాష్‌ విభాగంలో కాంట్రాక్టుల హెడ్జింగ్‌కు వాడుతున్నారు. అంతేకాకుండా విదేశీ ఎక్చేంజ్‌ల్లో ట్రేడ్‌చేసి పన్ను ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. అందువల్ల దేశీయ మార్కెట్ల భవితవ్యం కోసం ఎన్‌ఎస్‌ఈ, సెన్సెక్స్‌, మెట్రోపాలిటన్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌లు తాజా నిర్ణయానికి వచ్చాయని మూడు ఎక్చేంజ్‌ల ఉమ్మడి ప్రకటన చెబుతోంది. ఎస్‌జీఎక్స్‌తో పాటు చికాగో, ఒసాకా, తైవాన్‌ ఎక్చేంజ్‌ల్లో నిఫ్టీ ఆధారిత డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ జరుగుతోంది. ఈ మూడు ఎక్చేంజ్‌ల్లో టెర్మినేషన్‌కు ఎస్‌జీఎక్స్‌లాగా ఆరునెలల కాలం ఇవ్వడంలేదని, నెలలో వీటిలో ట్రేడింగ్‌ ముగిసిపోతుందని లిమయే చెప్పారు. కాగా ఎక్చేంజ్‌ల నిర్ణయం పూర్తిగా వాణిజ్యపరమైనదని, తిరోగామి చర్యకాదని సెబి చైర్మన్‌ అజయ్‌ థాయ్‌ అభిప్రాయపడ్డారు. 



You may be interested

పదేళ్లలో ఆర్‌ పవర్‌ నేర్పిన పాఠాలివే...

Saturday 10th February 2018

బడా ఐపీఓగా సంచలనం లిస్టింగ్‌ నుంచే పేలవం ఇప్పటికీ బయటపడలేని ఇన్వెస్టర్లు... రిలయన్స్‌ పవర్‌... అలియాస్‌ ఆర్‌ పవర్‌.. నాలుగు ముక్కల్లో చెప్పాలంటే.... ఒక్క కంపెనీ.. వేల కోట్ల రూపాయల ఆశలు.. లక్షలమంది ఇన్వెస్టర్లు.. చివరకు గాల్లో దీపాలయిన పెట్టుబడులు.. ఇదీ ఆర్‌పవర్‌ చరిత్ర. పదేళ్ల క్రితం మార్కెట్లో ప్రవేశించిన ఆర్‌పవర్‌ ఆరంభంలో ఎంత సంచలనం సృష్టించిందో చివరకు అంత ఉసూరనిపించి ఇన్వెస్టర్ల నోట్లో మన్ను కొట్టింది. మార్కెట్లో బలమైన సూత్రాలను చావుదెబ్బతీసి ఇన్వెస్ట్‌మెంట్‌

భారీ హెచ్చుతగ్గుల మధ్య బిట్‌కాయిన్‌

Saturday 10th February 2018

క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ మరోసారి 9,000 డాలర్ల స్థాయిని అధిగమించింది. కాయిన్‌డెస్క్‌ ప్లాట్‌ఫాంపై శుక్రవారం ట్రేడింగ్‌లో 9,070 డాలర్ల ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఆ తరువాత కాసేపటికే మళ్లీ పతనం దిశగా ప్రయాణించి ప్రస్తుతం 8,700 డాలర్ల స్థాయికి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 8,720 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వరుస ప్రతికూల అంశాల నేపథ్యంలో గడిచిన నెలరోజుల వ్యవధిలోనే ఏకంగా 65 శాతం పడిపోయి.. ఈనెల 5న

Most from this category