10-12 శాతం ఎర్నింగ్స్ గ్రోత్‌కు అవకాశం..!

ముంబై: గతకొన్నేళ్ల నుంచి స్తబ్ధుగా కొనసాగుతూ వచ్చిన ఎర్నింగ్స్ వృద్ధిరేటు 2019 ఆర్థిక సంవత్సరంలో రెండెంకలకు చేరనుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్, ఎకనామిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్ ధనన్జయ్ సిన్హా విశ్లేషించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10-12 శాతం ఉండవచ్చని అంచనాకట్టారు. 2017–18 ఆర్థిక సంవత్సర మూడవ త్రైమాసికానికి (అక్టోబరు–డిసెంబరు) సంబంధించిన కాలంలో బేస్ ఎఫెక్ట్ అనుకూలంగా ఉండడం, డిమాండ్ రికవరీ సాధించడం, తమ లెక్కలో ఏడాది ప్రాతిపదికన ప్రాఫిట్ గ్రోత్ 14.6 శాతం ఉండడం లాంటి కీలక అంశాల ఆధారంగా ఈ అంచనాను వెల్లడించినట్లు తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మెరుగుదల ఉండడంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో డిమాండ్ ఊపందుకోవడం సానుకూల అంశాలుగా కనిపిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ కేటాయింపులు పెరగడం, క్రెడిట్ డిమాండ్ పునరుద్ధరణ లాంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆహారేతర క్రెడిట్ గ్రోత్ 11 శాతానికి చేరిందన్న ఆయన గతేడాది మార్చి మధ్యనాటికి ఇది కేవలం 5 శాతంగానే ఉందన్నారు. కన్జూమర్ విభాగం విషయానికి వస్తే.. ఆటో రంగం ఆరోగ్యకర వృద్ధిరేటులో ఉందన్నారు. వ్యావసాయ రంగంలో బలహీన వ్యవసాయ ఉత్పత్తి, నికర నగదు ప్రవాహం తక్కువగా ఉండడం లాంటి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయని విశ్లేషించారు. ప్రభుత్వ కేటాయింపుల పెరుగుదల కారణంగా క్యాపిటల్ గూడ్స్ రంగం పురోగతి సాధిస్తోందన్నారు.
ఆర్థిక రంగంలోని ప్రతికూల విషయానికి వస్తే.. మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతోందన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) వెల్లడించిన వివరాల ప్రకారం ప్రైవేటు రంగ నూతన పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన గత క్యూ4లో 47 శాతం తగ్గాయని, ఈ కారణంగా 2018 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం తగ్గుదల నమోదయ్యిందని అన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం... వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపారు.
2017–18 క్యూ4లో అమ్మకాల వృద్ధిరేటు (ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలను మినహాయించి) 9 శాతంగా అంచనాను వివరించిన ఆయన.. 2017–18 క్యూ3లో ఇది ఏడాది ప్రాతిపదికన 11.3 శాతం ఉందన్నారు. పన్నుల తరువాత లాభం (పీఏటీ) క్యూ3లో 14.6 శాతం ఉండగా.. ఈసారి 4.2 శాతంగా అంచనావేస్తున్నట్లు వివరించారు. మొత్తం రంగాల పరంగా ఎర్నింగ్స్ గ్రోత్ ఫ్లాట్‌గా ఉందన్నారు.
ఎర్నింగ్స్‌లో వృద్ధి ఆధారంగా మార్కెట్ దిశ ఆధారపడి ఉందని, ద్రవ్య లభ్యత కీలక అంశంగా ఉందని అన్న ఆయన ఈ ఏడాదిలో మార్కెట్ అధిక శాతం ఒడిదుడుకుల లోనయ్యే అవకాశం ఉందన్నారు. మ్యూచువల్ ఫండ్ నగదు ప్రవాహం మార్కెట్ దిశకు ఎంతో కీలకమన్నారు. వాణిజ్య యుద్ధం, ద్రవ్యలభ్యత ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్‌గా అభివర్ణించారు. స్వల్పకాలంలో లార్జ్‌క్యాప్ షేర్లు మిడ్, స్మాల్ క్యాప్ షేర్లను కంటే అధికంగా పెరుగుతాయని అంచనావేశారు. రిటైట్ పోర్టిఫోలియో ఉన్న ప్రైవేటు బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, డ్యూరబుల్స్, ఆటోమోటీవ్, రూరల్ అగ్రికల్చర్ రంగాల షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు.
You may be interested
10500 పాయింట్ల పైన నిఫ్టీ
Monday 16th April 2018ముంబై:- అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో నష్టాలతో మొదలైన మార్కెట్ ఫార్మా, ఎఫ్ఎంజీసీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ల ర్యాలీతో క్రమంగా కోలుకుని చివరకు లాభాలతో ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్ 112 పాయింట్ల లాభంతో 34305 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 10528 వద్ద స్థిరపడింది. ఇది మార్కెట్‌కు వరుసగా ఏనిమిదో రోజూ లాభాల ముగింపు. సెన్సెక్స్ 33,899 - 34,341 పాయింట్ల
ఈ 30 స్టాకులను దిగ్గజాలు రికమండ్ చేస్తున్నాయ్!
Monday 16th April 2018దేశీయ మార్కెట్లు క్రమంగా గత రెండు నెలల గాయాలను మరిచి ముందుకు సాగేయత్నంలో ఉన్నాయి. నిఫ్టీ ప్రస్తుతం కీలక మద్దతు స్థాయిలకు పైనే ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు వర్దమాన దేశాల మార్కెట్లతో పోలిస్తే మంచి ప్రదర్శనే చూపుతాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ చెబుతోంది. ఏడాది చివరకు సెన్సెక్స్ 41,500పాయింట్లను తాకవచ్చని(బుల్‌రన్ కొనసాగితే) పేర్కొంది.(బేర్ కేస్‌లో 25వేల పాయింట్లకు దిగజారవచ్చని తెలిపింది.) ప్రస్తుతం మిడ్‌క్యాప్స్ కన్నా