STOCKS

News


ఐపీవో లాభాలను పిండుకునే ఫండ్‌!

Monday 12th February 2018
personal-finance_main1518458074.png-13902

మంచి కంపెనీలు ఐపీవోకు వస్తే దరఖాస్తు చేసే రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో భారీగా పెరిగారు. లిస్టింగ్‌ రోజున మంచి లాభాలు వస్తే సొంతం చేసుకుందామన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అయితే, సబ్‌స్క్రిప్షన్‌ భారీగా వస్తే అందరికీ షేర్లు అలాట్‌ కావు. లక్కీ ఇన్వెస్టర్లకే ఆ అవకాశం. ఈ నేపథ్యంలో ఐపీవోల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా లాభాలు ఒడిసి పట్టుకునేందుకు ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం వచ్చింది. దీని పేరు ఎడెల్వీజ్‌ మెయిడెన్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌- సిరీస్‌ 1.

2018 ఫిబ్రవరి 18 వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ ఫండ్‌. అంటే ఈ నెల 18 తర్వాత సబ్‌ స్క్రిప్షన్‌ స్వీకరించరు. ఈ పథకం కాల వ్యవధి 2021 జూన్‌ 28న ముగుస్తుంది. ఫండ్‌ మేనేజర్లుగా భవేష్‌ జైన్‌, భారత్‌ లహోటి వ్యవహరిస్తారు. కనీస పెట్టుబడి రూ.5,000. 

ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజీ

ఇటీవలి కాలంలో ఐపీవోకు వచ్చి లిస్ట్‌ అయిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం, రానున్న ఐపీవోల్లో పాల్గొనడం చేస్తుంది. నాణ్యమైన, విభిన్నమైన కంపెనీలు, గడిచిన మూడేళ్ల కాలంలో లిస్ట్‌ అయినవి, రానున్న మూడేళ్లలో లిస్ట్‌ అయ్యే వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంది. మల్టీక్యాప్‌ ఫండ్‌ మాదిరిగా పని చేస్తుంది. 30 స్టాక్స్‌ వరకూ పోర్ట్‌ఫోలియోలో ఉంటాయి. ప్రారంభంలో నిధులను 85:15:5 నిష్పత్తిలో వర్గీకరిస్తుంది. అంటే 80 శాతం నిధులను ఇప్పటికే లిస్ట్‌ అయిన ఐపీవో కంపెనీలకు కేటాయిస్తుంది. 15 శాతం నిధుల్ని రానున్న ఐపీవోలకు, 5 శాతం నిధుల్ని ఆప్షన్‌ పుట్స్‌కు కేటాయిస్తుంది. రానున్న కాలంలో ఐపీవోల పరంగా పెట్టుబడి అవకాశాలు లేకపోతే సూచీల ఫ్యూచర్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంది. 

 

2017లో చాలా కంపెనీల ఐపీవోలు ఇన్వె‍స్టమర్లకు మంచి రాబడులు ఇచ్చాయి. 30 శాతం నుంచి రెట్టింపు స్థాయిలో లిస్టింగ్‌ రోజునే లాభాలను పంచినవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీవోల పట్ల క్రేజ్‌ ఉన్న ఇన్వెస్టర్లు ఈ పథకాన్ని ఎంచుకోవడం మంచిదే. ఐపీవోలో రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయితే డ్రా తీసి విజేతలకు షేర్ల కేటాయింపు చేస్తారు. కానీ క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల (మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా) కోటా అలా కాదు. వారి బిడ్‌ నిష్పత్తి ఆధారంగా తలా కొంత కేటాయింపు చేస్తారు.



You may be interested

ప్రమోటర్ల తనఖా షేర్ల విలువ పతనం

Monday 12th February 2018

ప్రమోటర్లు తమ అవసరాలు, కంపెనీల అవసరాల కోసం షేర్లను తనఖా పెడుతుండడం తెలిసిందే. తాజా మార్కెట్ల పతనంలో వీని తనఖా షేర్ల విలువ మరింత పతనం అయినట్టు తెలుస్తోంది. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల ప్రమోటర్లు తనఖా పెట్టిన షేర్ల విలువ జనవరి నాటికి రూ.2.72 లక్షల కోట్లకు చేరింది. గడిచిన డిసెంబర్‌లో ఈ తనఖా షేర్ల విలువ రూ.3.03 లక్షల కోట్లు. అంటే 10 శాతం క్షీణించినట్టు తెలుస్తోంది. ఈ

ప్రపంచ మార్కెట్ల అండ-లాభాల్లో ముగిసిన సూచీలు..!

Monday 12th February 2018

ముంబై:- ఎట్టకేలకు సూచీలు శాంతించాయి. అంతర్జాతీయ మార్కెట్ల అండ, ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో సోమవారం సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.  అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సద్దుమణగడంతో సూచీలు రోజం‍తా లాభాల్లోనే ట్రేడయ్యాయి. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌  294.09 పాయింట్లు లాభపడి 34,300.47వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 84.80 పాయింట్లు పెరిగి 10539.75 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌ 34,115.12 -34,351.34 స్థాయిలో, నిప్టీ 10,485.40 - 10,555.50 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యాయి. పీయూసీ

Most from this category