STOCKS

News


ఇ- వాహనాలతో ఈ షేర్లకు వెలుగులు..!

Wednesday 13th September 2017
Markets_main1505287998.png-8494

ముంబై: విద్యుత్తు వాహనాల దిశగా దేశం అడుగులు వేస్తోంది. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మనదేశం సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహన తయారీని పక్కన పెట్టి, ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కారీ ఈ రంగాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. పెట్రోలు, డీజిల్ దిగుమ‌తుల‌ భారాన్ని తగ్గించడంలో భాగంగా 2030 నాటికి వీటి ఆధారంగా నడిచే వాహనాల అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్న నేపథ్యంలో ఈరంగంలోని పలు ఆటో షేర్లు ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనా వేస్తున్నారు. వీటిలో 5 షేర్లు మల్టీబ్యాగర్లుగా మారే ఉందని భావిస్తున్నారు. అవేంటంటే...

 

అశోక్ లేలాండ్: హిందూజా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ గతేడాది సర్క్యూట్ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను పరిచయం చేసింది. విద్యుత్తు వాహనాల తయారీపై దృష్టిసారించిన లేలాండ్‌.. ప్రపంచ శ్రేణి విద్యుత్ వాహనాల తయారీలో భాగంగా సన్ మొబిలిటీతో వ్యూహాత్మక భాగ‌స్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏడాది కిందట రూ.73 వద్ద ఉన్న ఈ కంపెనీ షేరు ధర ప్రస్తుతం రూ.118 దగ్గర ట్రేడవుతోంది. ఏడాదిలో 47 శాతం రాబడిని అందించిన ఈ షేరు ఇకపై కూడా ఇదే తరహా రాబడిని అందించవచ్చని మార్కెట్‌ పండితులు అంచనావేస్తున్నారు.

 

ఓకె ప్లే ఇండియా: ఆటోమొబైల్‌ పరిశ్రమకు అవసరమైన ప్లాస్టిక్‌ విడి భాగాలను ఉత్పత్తిచేసే ఈ సంస్థ 2015లో విద్యుత్ వాహనాల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ‘ఇ-రాజా’ పేరుతో ప్రయాణ, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే 8 రకాల విద్యుత్ వాహనాలను రూ.1.25 నుంచి రూ.1.5 లక్షల శ్రేణిలో విడుదలచేసింది. ప్రస్తుతం ఈ కంపెనీకి 7 ప్లాంట్లు ఉన్నాయని, మరో 4 ప్లాంట్ల నుంచి ఈ ఏడాది డిసెంబరు నాటికి ఉత్పత్తి మొదలవుతుందని కంపెనీ ఎండీ రాజన్ హన్డా ప్రకటించారు. దీని ద్వారా తమ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 2,50,000 విద్యుత్ వాహనాల ఉత్పత్తికి పెరుగుతుందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.202 దగ్గర ట్రేడవుతోంది. ఏడాదికాలంలో 66 శాతం రాబడిని అందించిన ఈ షేరు కూడా మల్టీబ్యాగర్‌ అయ్యే అవకాశం ఉందని ఫండమెండల్‌ అనలిస్టులు భావిస్తున్నారు.

 

హిమాద్రి స్పెషాలిటీ కెమికల్:  2017లో 220 శాతం రాబడిని అందించిన ఈ షేరు ఇకపై కూడా ఇదేస్థాయి లాభాలను అందించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో రూ.32 వద్ద ఉన్న షేరు ధర ప్రస్తుతం రూ.107 దగ్గర ట్రేడవుతోంది. లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ సెగ్మెంట్‌ వాటా ప్రస్తుతం ఒక శాతంగా ఉండగా.. పెరుగుతున్న విద్యుత్తు వాహనాల వినియోగం నేపథ్యంలో ఇకపై అమ్మకాలు మరింత వృద్ధి చెందనున్నాయని యాన్టిక్యూ స్టాక్ బ్రోకింగ్ అనలిస్ట్‌ బెనర్జీ అభిప్రాయపడుతున్నారు.

 

ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్:  వాహనాలకు అవసరమైన బ్యాటరీల ఉత్పత్తి రంగంలో పేరొందిన ఈ కంపెనీ ఏడాదిలో 25 శాతం రాబడిని అందించింది. ప్రస్తుతం రూ.226 దగ్గర ట్రేడవుతున్న ఈ షేరు ఇకపై కూడా మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉందని యాన్టిక్యూ స్టాక్ బ్రోకింగ్ అనలిస్ట్‌ బెనర్జీ సూచిస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ఇంజిన్‌ వాహనాల వినియోగం నెమ్మదిస్తే కంపెనీ ఆదాయం పడిపోతుందన్న అంచనాల నేపథ్యంలో లిథియం-అయాన్ బ్యాటరీ ఉత్పత్తిని పెంచుతున్న ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్.. ప్రస్తుతం వీటి ఎగుమతుల ద్వారా ఈ రంగంలో బలపడుతుందని చెబుతున్నారు. 

 

జీబీఎం ఆటో: ఏడాదిలో 150 శాతం రాబడిని అందించిన ఈ షేరు ఇకపై కూడా ఇదేస్థాయి లాభాలను అందించే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం ఈ షేరు రూ.575 దగ్గర ట్రేడవుతోంది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో భాగంగా ఈ సంస్థ పోలాండ్‌కు చెందిన సోలారిస్‌ బస్‌ అండ్‌ కోచ్‌తో జాయింట్‌ వెంచర్‌ను ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఈ షేరు మంచి రాబడిని ఇచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.
 

ఇవి కేవలం అనలిస్టులు సూచిస్తున్న షేర్లు మాత్రమే. ఇన్వెస్టర్లు వ్యక్తిగత విశ్లేషణ అనంతరం పెట్టుబడులు పెట్టడం మంచిదని సాక్షీబిజినెస్‌డాట్‌కామ్‌ సూచన.You may be interested

ఇంటికి బీమా రక్షణ తీసుకున్నారా?

Wednesday 13th September 2017

ఇంట్లోని వారికే కాదు, ఇంటికీ బీమా రక్షణ అవసరమే. ఈ మధ్య కాలంలో ఈ విషయమై వినియోగదారుల్లో అవగాహన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ పాలసీ తీసుకునే ముందు చూడాల్సిన ముఖ్యమైన అంశాల గురించి నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి.  హోమ్‌ ఇన్సూరెన్స్‌ బేసిక్‌ పాలసీ అన్నది అగ్ని ప్రమాదాల వల్ల ఇంటికి, ఇంట్లోని విలువైన వస్తువులకు రక్షణ కల్పిస్తుంది. అలాగే, విపత్తులైన పిడుగు, తుఫానులు, వరదల వల్ల వాటిల్లే నష్టానికీ

అరబిందో ఫార్మాకు యూఎస్‌ఎఫ్‌డీఎ బూస్ట్‌

Wednesday 13th September 2017

 హైదరాబాద్‌లోని యూనిట్‌4 కు వాలంటరీ యాక్షన్‌ ఇండికేటెడ్‌ సర్టిఫికేట్‌ను యూఎస్‌ఎఫ్‌డీఎ  ఇచ్చినప్పటికీ  అరబిందో ఫార్మా కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో కంపెనీ షేరు బుధవారం ఇంట్రాడేలో  2 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ.766  వద్ద ట్రేడవుతోంది. కంపెనీ మానుఫాక్చరింగ్‌ విభాగంలో ఏడు లోపాలను హైదరాబాద్‌లోని యూనిట్‌4లో  యూఎస్‌ఎఫ్‌డీఎ గుర్తించింది. అయినప్పటికీ కంపెనీ షేరు పెరుగుతోంది. ఈ తనిఖీలను ఏప్రిల్‌ 20-28 తేదీలలో నిర్వహిం‍చింది.  యూఎస్‌ఎఫ్‌డీఎ ఫామ్‌ 483

Most from this category