STOCKS

News


ఎస్‌ఎంఈ ఐపీవో అని తేలిగ్గా తీసేయకండి!

Monday 17th July 2017
Markets_main1500311125.png-5521

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో (జనవరి నుంచి జూన్‌ వరకు) 50 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు (ఎస్‌ఎంఈ) ఏకంగా రూ.660 కోట్లను ఐపీవో రూట్లో సమీకరించాయి. 2016 తొలి ఆరు నెలల్లో కేవలం 27 కంపెనీలు, రూ.211 కోట్ల నిధుల సమీకరణతో పోలిస్తే ఇది రెట్టింపుకన్నా ఎక్కువ. అంతేకాదు 2016 పూర్తి ఏడాదిలో 66 కంపెనీలు సమీకరించిన రూ.540 కోట్ల కంటే కూడా ఎక్కువే. ప్రధాన కంపెనీల ఐపీవోలకు దరఖాస్తు చేసేందుకు సాధారణ ఇన్వెస్టర్లు తెగ ఉత్సాహపడుతున్న పరిస్థితి కనిపిస్తుండగా... రిటైల్‌ ఇన్వె‍స్టర్లలో ఎంత మంది ఈ 50 ఎస్‌ఎంఈ ఐపీవోలలో, ఎన్నింటిలో పాల్గొన్నారో ఓ సారి ప్రశ్నించుకోవాల్సిందే.

చిన్న, మధ్య స్థాయి (ఎస్‌ఎంఈల) కంపెనీల లిస్టింగ్కు వీలుగా బీఎస్‌ఈ ‘ఎస్‌ఎంఈ’ పేరుతో, ఎన్‌ఎస్‌ఈ ఎమెర్జ్‌ పేరుతో ప్రత్యేక ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేశాయి. రూ.3 కోట్ల జారీ మూలధనం ఉన్న కంపెనీ సైతం ఐపీవో ద్వారా లిస్ట్‌ కావొచ్చు. ప్రధాన ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోలిస్తే ఇక్కడ లిస్ట్‌ అయ్యే వాటికి నిబంధనల పరంగా కాస్తంత వెసులుబాటు ఇచ్చారు. తమ వ్యాపార విస్తరణకు, మూలధన అవసరాలు, కార్పొరేట్‌ అవసరాల కోసం ఐపీవోలకు వస్తున్న ఎస్‌ఎంఈలే అధికంగా ఉంటున్నాయి. పైగా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయితే క్రెడిట్‌ రేటింగ్‌ మెరుగుపడుతుంది. నిధులు సమీకరణ సులభం అవుతుంది. బ్రాండ్‌ విలువ బలోపేతం అవుతుంది. ఈ విధమైన ప్రయోజనాలు చిన్న కంపెనీలకు ఉన్నాయి. 

ఇన్వెస్టర్లకు లాభమేంటి?

గతంలో ఎస్‌ఎంఈల ఐపీవోల్లో ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్‌ అంత బలంగా ఉండేది కాదు. కానీ పరిస్థితిలో క్రమంగా మార్పు కనిపిస్తోంది. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు కూడా ఈ మధ్య ఎస్‌ఎంఈ ఐపీవోల్లో భాగస్వాములు అవుతున్నారు. అంతేకాదు, ఇప్పటి వరకు లిస్ట్‌ అయిన వాటిలో చాలా వరకు ఇన్వెస్టర్ల వాటా విలువను పెంచినవేనంటున్నారు పంతోమఠ్‌ గ్రూపు ఎండీ మహావీర్‌ లునావత్‌. ఇప్పటి వరకు బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 185, ఎన్‌ఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌పై 61 కంపెనీలు లిస్ట్‌ కాగా, వీటిలో 31 కంపెనీలు స్టాక్‌ ఎక్సేంజ్‌ల ప్రధాన ప్లాట్‌ఫామ్‌లోకి అర్హత సాధించి అడుగు పెట్టేశాయి. మరో 36 కంపెనీలు సైతం అర్హత సాధించగా, నిబంధనల పరంగా వెసులుబాటు కారణంగా ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లోనే కొనసాగుతున్నాయంటున్నారు లూనావత్‌. పనితీరు బాగున్న కంపెనీలు తప్పకుండా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లోకి ఏదో ఒకరోజు రాక తప్పదు. ఇది ఇన్వెస్టర్ల విలువను పెంచే చర్యగానే విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

మార్కెట్‌ లాట్‌ సైజుతో ఇబ్బంది

ప్రధాన కంపెనీల ఐపీవోలకు రూ.15,000 ఉంటే చాలు ఇన్వెస్టర్‌ ఒక లాట్‌ కోసం ఐపీవోలో దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఎస్‌ఎంఈ ఐపీవోకు అలా కాదు. కనీస లాట్‌ విలువ రూ.లక్ష, ఆ పైనే ఉంటోంది. ఇనిస్టిట్యూషనల్‌, అవగాహన ఉన్న ఇన్వెస్టర్లే ఈ దిశగా అడుగులు వేయాలన్న దృష్టితో కనీసం రూ.లక్ష లాట్‌ విలువగా నిర్ణయించడం జరిగింది. ఉదాహరణకు ఎస్‌ఎంఈ షేరు ఆఫర్‌ ధర రూ.10 నుంచి రూ.14 వరకు ఉంటే లాట్‌ సైజు 10,000 షేర్లుగా ఉండాలి. అంటే రూ.14 ధర ఉన్న ఐపీవోకు దరఖాస్తు చేయాలంటే రూ.1,40,000 వేల పెట్టుబడి అవసరం. రూ.14 నుంచి రూ.18 మధ్య ధర ఉన్న వాటికి లాట్‌ సైజు 8,000 షేర్లు. ధర ఎక్కువ ఉంటే లాట్‌ సైజు తగ్గుతుంది. లిస్ట్‌ అయిన తర్వాత కొనుగోలు, అమ్మకాలకు కూడా ఈ లాట్లే అమల్లో ఉంటాయి. చిన్న ఇన్వెస్టర్లో అధిక శాతం ఎవరూ వీటివైపు చూడకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కానీ, తగినంత పెట్టుబడి ఉండి, మంచి కంపెనీ అయి ఉంటే ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా చక్కని లాభాలను పోగేసుకోవచ్చుంటున్నారు నిపుణులు. You may be interested

ద్రవ్యోల్బణం తగ్గడం మంచికేనా?

Monday 17th July 2017

ఈ ఏడాది జూన్‌లో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయి అయిన 1.54 శాతానికి పడిపోయింది. హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 2.17 శాతానికి దిగొచ్చింది. అంటే ఆ మేరకు నిత్యావసరాలు చౌక అయినట్టే మరి!  అధిక ద్రవ్యోల్బణం తగ్గడాన్ని ఆర్థికవేత్తలు ఎవరైనా ఆహ్వానిస్తారు. కానీ, ద్రవ్యోల్బణం మరీ తగ్గడం విధాన కర్తలను కలవరపరిచేదే. నిజానికి ఇది అంత మంచి సూచికేమీ కాదన్నది ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ఏ నాణేనికైనా రెండు ముఖాలుంటాయన్నట్టు... ద్రవ్యో‍ల్బణం అతిగా

9900 పైన నిఫ్టీ ముగింపు

Monday 17th July 2017

మరోమారు రికార్డుల మోత సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ‍స్వల్ప లాభాల్లో ముగిసింది. అయినా స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులో కూడా కొత్త రికార్డ్‌లను సృష్టించాయి. ఇంట్రాడేలో  జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకిన స్టాక్‌ సూచీలు ట్రేడింగ్‌ అంతా  పరిమిత శ్రేణిలోనే కదలాడాయి.  చైనా జీడీపీ అంచనాలను మించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 54 పాయింట్ల లాభంతో 32,075 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల లాభంతో

Most from this category