STOCKS

News


ప్యానిక్‌ అవొద్దు... సిప్‌ ఆపొద్దు!

Friday 9th February 2018
Markets_main1518198410.png-13858

మార్కెట్లలో ఆవేశంగా కొనుగోలు చేయడానికి ఇది సరైన తరుణం కాదని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారి వీకే విజయ్‌కుమార్‌ అంటున్నారు. నాణ్యమైన స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో నిర్మించుకోవడానికి ఇది అనుకూల సమయంగా సూచిస్తున్నారు.

‘‘డౌజోన్స్‌ రెండు రోజుల్లో 2,200 పాయింట్లు పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలకు మూలం అమెరికాయే. అమెరికాలో వేతన వృద్ధి 2.9 శాతం పెరిగినట్టు తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. నిరుద్యోగిత చాలా తక్కువ స్థాయికి చేరడం, ట్రంప్‌ సర్కారు పన్నుల తగ్గింపు ప్రోత్సాహకాలతో ద్రవ్యోల్బణం పెరిగిపోనుంది. ఫెడరల్‌ రిజర్వ్‌ మార్కెట్లు అంచనా వేస్తున్న మూడు సార్లకు మించి రేట్లు పెంచే అవకాశాలున్నాయి. అమెరికాలో తక్షణ అమ్మకాలకు ట్రిగ్గర్‌ ఇదే. భారత మార్కెట్‌ కూడా ప్రపంచ మార్కెట్ల బాటలోనే నడుస్తున్నాయి. మన మార్కెట్ల విలువలు, ముఖ్యంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ విలువలు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నాయి. ఆవేశంగా కొనుగోలుకు ఇది తరుణం కాదు. కాకపోతే నాణ్యమైన స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవడానికి ఇది అనుకూల సమయం. ఇన్వెస్టర్లు భయాందోళనకు గురై ఫండ్స్‌లో సిప్‌ ఆపొద్దు’’అని విజయ్‌కుమార్‌ సూచించారు.


sip

You may be interested

ఈ పతనం ఎక్కడి వరకు...?

Friday 9th February 2018

మార్కెట్లు ప్రస్తుతం చౌకగా ఏమీ లేవని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐవో ఎస్‌ నరేన్‌ అంటున్నారు. దేశీయ స్టాక్‌ మార్కెట్లో కరెక్షన్‌ ప్రారంభం కావడంతో ఆయన తన అభిప్రాయాలను ఓ మీడియా సంస్థతో పంచుకున్నారు... ‘‘చాలా మంది దీన్ని స్థానిక కరెక్షన్‌ అనుకుంటున్నారు. కానీ స్థానిక కరెక్షన్‌ ఎంత మాత్రం కాదు. గత డిసెంబర్‌ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా భారీ బుల్‌ ర్యాలీ చోటు చేసుకుంది. కేవలం 10-15 రోజుల్లోనే

లార్జ్‌, మల్టీక్యాప్స్‌ బెటర్‌!

Friday 9th February 2018

మార్కెట్లలో కరెక్షన్‌ నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లలో లేనిపోని సందేహాలు ఎక్కువైపోయాయి. ఈ తరుణంలో ఏం చేయాలంటూ విశ్లేషకులకు కాల్స్‌ మీద కాల్స్‌ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు నిపుణులు సూచిస్తున్న సలహాలు ఇవే. ‘‘ఇన్వెస్టర్లు తమ అస్సెట్‌ అలోకేషన్‌లో భాగంగా మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ను కొనసాగించాలి. అయితే, మిడ్‌క్యాప్స్‌తో పోలిస్తే లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఆకర్షణీయంగా ఉన్నందున, అదనపు నిధులు ఉంటే ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు’’ అని సూచించారు

Most from this category