STOCKS

News


మ్యూచువల్‌ ఫండ్స్‌ కటాఫ్‌ టైమ్‌ తెలుసా?

Saturday 10th March 2018
personal-finance_main1520691104.png-14550

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు, విక్రయాలకు ప్రతీ రోజూ కటాఫ్‌ టైమింగ్‌ అని ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ప్రతీ ఇన్వెస్టర్‌ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. మీరు రోజులో ఎప్పుడు దరఖాస్తు చేసినా ఒకటే ఎన్‌ఏవీ అమలు కాదు. ఏ సమయంలోపు మీ దరఖాస్తు ఫండ్స్‌ సంస్థను చేరిందన్నది యూనిట్ల కేటాయింపునకు కీలకం అవుతుంది. ఇక ఈక్విటీ, ఇతర ఫండ్స్‌కు కటాఫ్‌ టైమ్‌ వేర్వేరుగా ఉంటుంది. మీ దరఖాస్తు అందిన సమయాన్ని బట్టి క్రితం రోజు ఎన్‌ఏవీ, ఆ రోజు ఎన్‌ఏవీ, మరుసటి రోజు ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్లు కేటాయించొచ్చు.

లిక్విడ్‌ ఫండ్స్‌కు కటాఫ్‌ టైమ్‌ మధ్యాహ్నం 2 గంటలు. మధ్యాహ్నం 2 గంటల్లోపు ఇన్వెస్ట్‌ చేస్తే క్రితం రోజు ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్లు కేటాయిస్తారు. ఒకవేళ మధ్యాహ్నం 2 గంగల తర్వాత దరఖాస్తు చేశారనుకోండి. అదే రోజు ఎన్‌ఏవీ అధారంగా యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఒకవేళ మధ్యాహ్నం 2 గంటల్లోపు దరఖాస్తు చేసి పెట్టుబడుల మొత్తాన్ని బదిలీ చేయడంలో విఫలమైతే క్రితం ఎన్‌ఏవీ ఆధారంగా కేటాయింపు జరగదు. 

ఈక్విటీ, డెట్‌ ఫండ్స్‌కు సంబంధించి కటాఫ్‌ టైమ్‌ మధ్యాహ్నం 3గంటలు. ఇన్వెస్టర్‌ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు సమర్పించి, అందుకు సరిపడా నిధులు కూడా బదిలీ చేస్తే​అదే రోజు ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ కటాఫ్‌ టైమ్‌ తర్వాత దరఖాస్తు చేసుకుంటే మరుసటి రోజు ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్ల కేటాయింపు ఉంటుంది. దరఖాస్తు మాత్రమే కాదు, పెట్టుబడుల విలువకు సరిపడా నిధుల బదిలీ కూడా కటాఫ్‌ టైమ్‌లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ఇక మీ దగ్గరున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను విక్రయించేందుకూ కటాఫ్‌ టైమ్‌ ఉంటుంది. కాకపోతే విక్రయానికి వచ్చే సరికి లిక్విడ్‌, డెట్‌, ఈక్విటీ ఇలా అన్ని ఫండ్స్‌కూ కటాఫ్‌ టైమ్‌ మధ్యాహ్నం 3 గంటలు. ఆలోపు దరఖాస్తు చేసుకుంటే అదే రోజు ఎన్‌ఏవీ వర్తిస్తుంది. కటాఫ్‌ టైమ్‌ తర్వాత దరఖాస్తు చేస్తే తర్వాతి రోజు ఎన్‌ఏవీ అమలవుతుంది.



You may be interested

ఈ స్టాక్స్‌లో ఫండ్స్‌ వాటాలు పెంచుకుంటూనే ఉన్నాయ్‌

Saturday 10th March 2018

గడిచిన ఏడాదిన్నర కాలంలో స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ చేసి స్వల్ప విరామం తీసుకున్నాయి. ర్యాలీలో ఎన్నో స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తోపాటు లార్జ్‌క్యాప్‌ మంచి లాభాలను ఇచ్చాయి. ఇలా ర్యాలీ చేసిన వాటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు వరుసగా ఎనిమిదో త్రైమాసికంలోనూ వాటాలు పెంచుకున్న 10 స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఉన్నాయి. ఈ కాలంలో ఈ స్టాక్స్‌ 200 శాతం వరకు పెరగడం గమనార్హం. టాటా కెమికల్స్‌లో 2017 డిసెంబర్‌

ఈ స్టాక్స్‌ వేసవిలో హిట్‌ గురూ!

Saturday 10th March 2018

ఈ వేసవి ప్రారంభంలోనే ఎండలు కాక పుట్టించేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువే ఉంటాయని వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది. ఇన్వెస్టర్‌ కోణంలో ఈ అంశం కూడా పెట్టుబడికి ఓ అవకాశమే. వేసవిలో ఎండ తాపం నుంచి ఉపశమనం కల్పించే ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ ఉత్పత్తుల కంపెనీలకు ఈ సీజన్‌ మంచి విక్రయాలకు అవకాశం. దీంతో సహజంగానే ఈ స్టాక్స్‌ ర్యాలీ చేసే అవకాశం ఉంటుందన్నది విశ్లేషకుల అంచనా.  ఏసీల

Most from this category