STOCKS

News


విదేశీ ఇన్వెస్టర్లు అమ్మేస్తుంటే..దేశీయ ఫండ్స్‌ కొంటున్నాయ్‌ !

Tuesday 13th February 2018
Markets_main1518509919.png-13924

ముంబై:- ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న అల్లకల్లోలం కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి స్టాక్‌ మార్కెట్లో విక్రయాలు జరుపుతున్నా, దేశీయ సంస్థలు (డీఐఐ)ల కొనుగోళ్ల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి మొదటి ఏడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో డీఐఐలు రూ.5,419 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోళ్లు చేశాయి. ప్రపంచ మార్కె‍ట్లలో అమ్మకాల సునామీ, దీర్ఘకాలిక మూలధన రాబడిపై పన్ను (ఎల్‌టీసీజీ), ద్రవ్యలోటు భయాలతో గత ఏడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి భారీగా పతమనయ్యాయి. ఈ పతనంలో కూడా డీఐఐలు కొనుగోళ్లకే మద్దతు చూపడం విశేషం. మరోవైపు అమెరికా బాండ్ల ఈల్డ్స్‌ పెరుగుదల నేపథ్యంలో ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు తెరతీసారు. ఇదే కాలంలో దేశీయ మార్కెట్‌ల్లో ఎప్‌ఐఐలు రూ.4,618.88కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. మార్కెట్లు భారీ పతనం అవుతున్నా ఇప్పటికీ ఇతర ఆదాయ వనరుల కంటే ఈక్విటీ షేర్లు మెరుగ్గా పన్ను అనంతర రాబడుల్ని అందిస్తాయనే డీఐఐలు నమ్ముతున్నారు. అందుకే ఆ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నారని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. దేశీయ స్టాక్‌ మార్కెట్లో డీఐఐలు 2017లో 18.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు, ఈ మొత్తం పీఎఫ్‌ఐల కంటే 2.4 రెట్లు అధికమని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది.



You may be interested

ఆరు నెలల్లో 80 డాలర్లకు చమురు ధర: గోల్డ్‌మాన్‌ శాక్స్‌

Tuesday 13th February 2018

బ్రెంట్‌ క్రూడ్‌ ధర ఆరు నెలల్లో 82.50 డాలర్ల స్థాయికి చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనావేసింది. మూడు నెలల్లో ఈ ధర 75 డాలర్లను చేరవచ్చంటూ మంగళవారం తాజా అంచనాల్ని ప్రకటించింది. గత అంచనా 62 డాలర్ల స్థాయిని ఎగువముఖంగా సవరించింది. ఆసియాలో చమురుకు డిమాండ్‌ పెరగడం, ఒపెక్‌ దేశాలు ఉత్పత్తి కోతల్ని కొనసాగించడం, వెనిజులాలో ఉత్పత్తి పడిపోవడం, అమెరికాలో నిల్వలు తగ్గుతుండటం వంటి

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ భారీ హెచ్చుతగ్గులు

Tuesday 13th February 2018

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ను అనుకరిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోంది. శివరాత్రి కారణంగా భారత్‌ మార్కెట్లను సెలవు అయినందున, బుధవారం ట్రేడింగ్‌ పునర్‌ప్రారంభం సందర్భంగా మార్కెట్‌ ఎలా వుండవచ్చన్న సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ కదలికల ద్వారా ఇన్వెస్టర్లు తెలుసుకోవడం సాధ్యపడుతుంది. మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్ల మేర ఎగిసి 10,580 పాయింట్లస్థాయికి చేరింది. అటుతర్వాత మధ్యాహ్నం

Most from this category