STOCKS

News


ఎల్‌టీసీజీతో నెగిటివ్‌ ప్రభావం

Friday 12th January 2018
personal-finance_main1515751991.png-13087

వాల్యూరిసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ అంచనా
ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లు, ఈక్విటీలపై దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌టాక్స్‌ విధిస్తే మార్కెట్లో బలమైన నెగిటివ్‌ ప్రతిస్పందన వస్తుందని వాల్యూరిసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ ఎంఎఫ్‌ల దీర్ఘకాలిక వృద్ధి గాధను దెబ్బతీసేంతగా ఈ ప్రతిస్పందన ఉండకపోవచ్చన్నారు. ఈ ఏడాది మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యేట్లయితే బాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సూచించారు. ఎల్‌టీసీజీ విధింపు స్వల్పకాలానికి బలమైన నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చని, ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని అన్నారు. ఈ రకమైన పన్ను షార్ట్‌టర్మ్‌ ఇన్వెస్టర్ల మూడ్‌పై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అయితే దీర్ఘకాలంలో దీనివల్ల మంచి ఫలితాలే ఉండే అవకాశాలున్నాయన్నారు. కానీ ప్రస్తుతం ఎంఎఫ్‌ల్లో దీర్ఘకాల హోల్డింగ్‌ సమయం రెండున్నరేళ్లే ఉంటోందని తెలిపారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని బాలెన్స్‌డ్‌ఫండ్స్‌ను నమ్ముకోవడమే బెటరన్నారు. గత పదిహేనేళ్ల కాలాన్ని పరిశీలిస్తే బాలెన్స్‌డ్‌ ఫండ్సే మంచి ప్రదర్శన చూపాయని తెలుస్తోందన్నారు. ఎల్‌టీసీజీ లాంటి పన్నుతో మార్కెట్లు భారీ కరెక‌్షన్‌కు లోనయినా ఎంఎఫ్‌ మేనేజర్లు తిరిగి సమతుల్యం దిశగా ఈక్విటీలను నడిపిస్తారన్నారు. దీర్ఘ చరిత్ర ఉన్న పాత ఫండ్స్‌నే తాను నమ్ముతానని చెప్పారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ బాలెన్స్‌డ్‌ 95 ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బాలెన్స్‌డ్‌ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బాలెన్స్‌డ్‌ ఫండ్‌, టాటా బాలెన్స్‌డ్‌ ఫండ్‌లను ఆయన సిఫార్సు చేశారు. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేవాళ్లు దీర్ఘకాలం పెట్టుబడులు పెడుతూ ఉండాలని సూచించారు. తొలిసారి ఎంఎఫ్‌ల్లోకి వచ్చేవాళ్లు మల్టీక్యాప్‌ ఫండ్స్‌లాంటి వాటిని ఎంచుకోవచ్చని సూచించారు. దీంతోపాటు టాక్స్‌ సేవింగ్స్‌ ఫండ్స్‌ను కూడా పరిశీలించవచ్చన్నారు. ఇలాంటి వారికోసం యాక్సిస్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌, రిలయన్స్‌ టాక్స్‌ సేవర్‌, రాక్‌టాక్స్‌ సేవర్‌ ఫండ్స్‌ను ఆయన సిఫార్సు చేశారు. మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో మిరేయ్‌ అసెట్‌ ఇండియా ఆపర్చనుటీ, ఆదిత్య బిర్లాసన్‌లైఫ్‌ ఈక్విటీ, ఫ్రాంక్లిన్‌ హైగ్రోత్‌ ఫండ్స్‌ను ఆయన సూచించారు. 



You may be interested

సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగింపు

Friday 12th January 2018

ముంబై:- దేశీయ సూచీలు శుక్రవారం కొత్త రికార్డులను నమోదు చేసి సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగిశాయి. మీడియా, మెటల్‌, బ్యాంక్‌ రంగ షేర్ల ర్యాలీకి తోడు, యూరప్‌ మార్కెట్ల సానూకూల ఓపెనింగ్‌... సూచీలు ర్యాలీకి కారణమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.90 పాయింట్ల లాభంతో 34,592 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16.65 పాయింట్ల లాభంతో 10,667 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ 34,342 -34,638 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. బీఎస్‌ఈలో మెటల్‌, ఇంధన,

ఇండస్‌ఇండ్‌ షేరు టార్గెట్‌ ధర రూ.2,060..!

Friday 12th January 2018

ముంబై: గురువారం ఫలితాలను ప్రకటించిన ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరుకు సీటీ గ్రూప్‌ వంటి పలు బ్రోకింగ్‌ సంస్థలు బై రేటింగ్‌ ఇవ్వగా.. కొటక్‌ సెక్యూరిటీస్‌ లాంటి మరికొన్ని సంస్థలు రూ.1,750 టార్గెట్‌ ధరతో రెడ్యూస్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఈ షేరు రూ.1,710 వద్ద ప్రారంభమై.. రూ.1,688 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని, రూ.1,720 వద్ద గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఈ ఆర్థిక సంత్సరం

Most from this category