News


కొత్త స్టార్టప్ హబ్... ఢిల్లీ

Wednesday 9th August 2017
startups_main1502299452.png-6733

  • ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 8,772 స్టార్టప్స్‌  
  • బెంగళూరులో 6,818; హైదరాబాద్‌లో 2,193  
  • నిధుల సమీకరణలోనూ ఢిల్లీదే అగ్రస్థానం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా స్టార్టప్‌ హబ్‌ కేరాఫ్‌ అడ్రస్‌ మారింది. ఇన్నాళ్లూ స్టార్టప్‌ హబ్‌గా పేరొందిన బెంగళూరు స్థానానికి ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ నగరం ఆక్రమించేసింది. ఈ నగరం 8,772 స్టార్టప్స్‌తో తొలి స్థానంలో నిలిచిందని ట్రాక్సన్‌ టెక్నాలజీస్‌ నివేదికలో వెల్లడైంది. నివేదికలో మరిన్ని అంశాలివే..
– 6,818 స్టార్టప్స్‌తో బెంగళూరు రెండో స్థానంలో, 4,825తో ముంబై మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాద్‌లో 2,193, పుణెలో 1,843, చెన్నైలో 1,723 స్టార్టప్స్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
– ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ కేంద్రంగా 449 స్టార్టప్స్‌ ఫిన్‌టెక్‌ విభాగంలో సేవలను నిర్వహిస్తుంటే.. ముంబై కేంద్రంగా 467 స్టార్టప్స్‌ ఉన్నాయి. బెంగళూరులో 405, హైదరాబాద్‌లో 128, పుణెలో 103 స్టార్టప్స్‌ ఫిన్‌టెక్‌ విభాగంలో సేవలందిస్తున్నాయి.
– రిటైల్‌ విభాగంలోనూ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌దే అగ్రస్థానం. ఈ విభాగంలో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ నుంచి 1,288 స్టార్టప్స్‌ సేవలందిస్తున్నాయి. స్నాప్‌డీల్, లైమ్‌రోడ్, పేటీఎం మాల్, షాప్‌క్లూజ్‌ వంటి ఈ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. రిటైల్‌ విభాగంలో ముంబైలో 645, బెంగళూరులో 541, హైదరాబాద్‌లో 127 స్టార్టప్స్‌ సేవలందిస్తున్నాయి.
– ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నెక్స్‌జనరేషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ సంప్రదాయ వ్యాపార విధానాలకు స్వస్తి చెప్పి కొత్తగా స్టార్టప్స్‌ను ప్రారంభిస్తున్నారని.. అది కూడా ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ కేంద్రంగానే అడుగులేస్తున్నారని నివేదిక వెల్లడించింది. సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, వారి పిల్లలూ వారి స్టార్టప్స్‌ ప్రయాణాన్ని ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ కేంద్రంగానే ప్రారంభిస్తున్నారని నివేదిక తెలిపింది.
– స్టార్టప్స్‌ హబ్‌లోనే కాదు నిధుల సమీకరణలోనూ ఢిల్లీ–ఎన్‌సీఆర్‌ రీజియన్‌ తొలి స్థానంలో నిలిచింది. గత ఆరు నెలల్లో ఈ రీజియన్‌లో 4 బిలియన్‌ డాలర్ల నిధులొచ్చాయి. గతేడాది ఇదే సమయానికి ఈ రీజియన్‌లో 1.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

నగరం  స్టార్టప్స్‌ సంఖ్య
ఢిల్లీ  - ఎన్సీఆర్ 8,772
బెంగళూరు 6818
ముంబై 4825
హైదరాబాద్  2193
పుణె 1843
చెన్నై 1723

 







You may be interested

ఫ్యూచర్స్‌ సిగ్నెల్స్‌

Wednesday 9th August 2017

స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవారికి ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) అంటే బాగా తెలుసు. డెరివేటివ్స్‌గా పిలిచేది కూడా వీటినే. మరి ఎఫ్‌ అండ్‌ ఓలో ఎలాంటి షేర్లయితే బెటర్‌? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పలేం. కానీ డెరివేటివ్స్‌కు కొన్ని సంకేతాలుంటాయి. అంటే ఓపెన్‌ ఇంట్రస్ట్‌ హెచ్చుతగ్గులు... కాల్‌, పుట్‌ రైటింగ్‌ వంటివన్న మాట. ఆ ‘ఫ్యూచర్‌ సిగ్నల్స్‌’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... హిందాల్కో వరుసగా రెండు రోజులపాటు మార్కెట్‌

‘షెల్‌’ కంపెనీల్లో ఏస్‌ ఇన్వెస్టర్లూ ఉన్నారు!

Wednesday 9th August 2017

సెబీ ఉన్నట్టుండి షెల్‌ కంపెనీలుగా అనుమానిస్తూ వేటు వేసిన 331 కంపెనీల్లో పేరొందిన వ్యాల్యూ ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. ఏస్‌ ఇన్వెస్టర్‌గా అందరికీ సుపరిచితుడు రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఈ తరహాకే చెందిన మరో ప్రముఖ ఇన్వెస్టర్‌ కల్పరాజ్‌ దామ్జీ ధరమ్‌షి ఇన్వెస్ట్‌ చేసిన పలు కంపెనీల్లోనూ ట్రేడింగ్‌ నిలిచిపోయింది. అంతేకాదు, ఆర్థిక, వ్యాపార శాస్త్రాల్లో పట్టాలు పొంది, పెట్టుబడుల వ్యవహారాలు చూసే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులూ

Most from this category