STOCKS

News


స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి ? (ధీరేంద్ర కాలమ్‌)

Monday 28th August 2017
Markets_main1503898537.png-7588

 


ప్ర: నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. కనీసం ఐదు నుంచి ఏడేళ్లు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ధీమాటిక్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా లేక స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? దేంట్లో రిస్క్‌ తక్కువగా ఉంటుంది?
-జగదీశ్‌, విజయవాడ

జ: థీమాటిక్‌, స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ రెండూ వేర్వేరు. థీమాటిక్‌ ఫండ్స్‌ ఒక ప్రత్యేకమైన థీమ్‌కు సంబంధించినవి. అన్నీ అనుకున్నట్లుగా, సవ్యంగా జరిగితే ఈ థీమాటిక్‌ ఫండ్స్‌ మంచి రాబడులనిస్తాయి. కానీ ఇది జూదం లాంటిదే. అంచనాలు తప్పినా, లేకపోతే, సరైన సమయంలో థీమాటిక్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయకపోయినా మీకు భారీగా నష్టాలు వస్తాయి. సాధారణంగా ఇన్వెస్టర్లు ఇప్పటికే బాగా పెరిగిన రంగాల్లో ఇన్వెస్ట్‌ చేయడానికే ఇష్టపడతారు. భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశాలున్న రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలు సాధారణ ఇన్వెస్టర్లకు చాలా తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో మంచి రాబడులనిచ్చే ధీమాటిక్‌ ఫండ్స్‌ను ఇప్పుడే గుర్తించడం చాలా కష్టసాధ్యమైన విషయం. స్మాల్‌క్యాప్‌ కంపెనీలు మూలధన పరంగా చిన్న సైజ్‌ కంపెనీలు. కానీ లార్జ్‌క్యాప్‌కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందగల సత్తా వాటికి ఉంటుంది. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో 20-30 శాతం వరకూ ఖచ్చితంగా స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. సాధారణంగా స్మాల్‌క్యాప్‌ కంపెనీలు ఆర్థిక మందగమనం, ప్రభుత్వ విధానాలు, పోటీ, తదితర అంశాల పరంగా చూస్తే తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. అందుకని ఏ స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలి అన్న విషయాన్ని మీ ఫండ్‌మనేజర్‌కు వదిలేయండి. స్మాల్‌ క్యాప్‌కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు.

ప్ర: నేను 2012లో ఎల్‌ఐసీ జీవన్‌ మిత్ర పాలసీ తీసుకున్నాను. ఈ పాలసీ కాలపరిమితి 30 సంవత్సరాలు. వార్షిక ప్రీమియమ్‌ రూ.47,950. ఈ పాలసీని పెయిడప్‌-పాలసీగా మార్చుకోమంటారా ? లేక ఈ పాలసీలో కొనసాగమంటారా ?
-రాజేశ్‌, విశాఖపట్టణం 

జ: ఎల్‌ఐసీ జీవన్‌ మిత్ర అనేది ఎండోమెంట్‌ ప్లాన్‌. ఇది ఇన్సూరెన్స్‌-కమ్‌-ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌. ఇవి ఖరీదైనవి. పైగా తగిన తగిన బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. రాబడులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ పాలసీని పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే, మీ పాలసీ కాలపరిమితి  పూర్తయ్యేవరకూ మీ సొమ్ములను మీరు తీసుకోలేరు. దీనికి బదులుగా మీరు ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయండి. ఈ పాలసీని సరెండర్‌ చేయడం వల్ల మీకు నష్టాలు వస్తాయి. కానీ మంచి రాబడులు రాని ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి మీరు బైటపడినట్లవుతుంది. ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేస్తే, మీకు కొంత మొత్తం  గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూగా లభిస్తుంది. ఎల్‌ఐసీ స్పెషల్‌ సరెండర్‌ వేల్యూను చెల్లించవచ్చు. ఇది గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూతో సమానంగా లేదంటే, దానికంటే అధికంగానే ఉండొచ్చు. ఇక ఈ పాలసీని పెయిడప్‌ పాలసీగా మార్చుకుంటే పెయిడప్‌ వేల్యూ ఎంత వస్తుందనేది మీరు ఎల్ఐసీ కార్యాలయంలో సంప్రదించి తెలుసుకోగలరు. పాలసీ కాలపరిమితి తీరిన తర్వాతనే మీకు పెయిడప్‌ వేల్యూ లభిస్తుంది. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన ఈ తరహా ప్లాన్‌ల్లో ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకూడదు. బీమా కవరేజ్‌ కోసం ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలి. ఈ టర్మ్‌ పాలసీల్లో బీమా కవరేజ్‌ అధికంగానూ, చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగానూ ఉంటాయి. ఇక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఏదైనా బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌ లేదా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలిగే రాబడులు మీకు వస్తాయి. 

ప్ర: నా వయస్సు 53 సంవత్సరాలు. నేను 65  ఏళ్ల వరకూ పనిచేయగలను. పెన్షన్‌ నిధిగా రూ.50 లక్షల వరకూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయి. నెలకు రూ.40,000-రూ.50,000 వరకూ సిప్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయగలను. నాకు తగిన ఇన్వెస్ట్‌మెంట్‌ విధానాన్ని సూచించండి. 
-జాఫర్‌, హైదరాబాద్‌ 

జ: మీ అత్యవసర ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని మాత్రమే స్థిరాదాయ సాధానాల్లో ఉంచుకోవాలి. స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీలపై పూర్తిగా పన్ను భారం ఉంటుంది. టీడీఎస్‌(ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌) కోత ఉంటుంది. అందుకని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లుగా ఉన్న మొత్తాలను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లోకి మార్చుకోండి. ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కొన్ని పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు మరో 12 సంవత్సరాల పాటు పనిచేయగలుగుతారు. అంటే మీరు రిటైర్‌ కావడానికి చాలా సమయం ఉన్నట్లు లెక్క. అంటే మీరు దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయవచ్చని అర్థం. మీ అత్యవసర ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఉన్న మొత్తాన్ని ఈ బ్యాలన్స్‌డ్‌లేదా ఈక్విటీ ఫండ్స్‌లోకి రెండేళ్లలో బదిలీ చేయండి. రెండేళ్లపాటు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌, ఈక్విటీ ఫం‍డ్స్‌ల నుంచి వచ్చే రాబడులు స్వల్పంగా ఉండొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా వచ్చే రాబడులు అధికంగా ఉంటాయి. You may be interested

సెబి చెంతకు 85 కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ స్కీములు

Monday 28th August 2017

మ్యూచువల్‌ ఫండ్‌ స్కీముల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబి చెంతకు ఈ ఏడాది ఇప్పటివరకూ 85 కొత్త స్కీములు పరిశీలనకు వచ్చాయి. మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు...ఈక్విటీ, డెట్‌, హైబ్రీడ్‌, ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్ల జారీకి ఈ స్కీము ప్రతిపాదనల్ని సెబికి సమర్పించాయి. న్యూ ఫండ్‌ ఆఫర్ల (ఎన్‌ఎఫ్‌ఓలు) జారీ కోసం సెబికి ఆఫర్‌ డాక్యుమెంట్లను సమర్పించిన సంస్థల్లో మహింద్రా,

క్యూ1 ఫలితాలతో బోల్తాపడ్డ భారత్‌ బిజిలీ

Monday 28th August 2017

ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల తయారీ సంస్థ భారత్‌ బిజిలీ షేరు సోమవారం బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో దాదాపు 11శాతం పతనమైంది.  సంస్థ ప్రకటించిన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు(క్యూ1) నిరాశమయంగా ఉండడం దీనికి ప్రధాన కారణం. గత వారం మార్కెట్‌ చివరిరోజైన గురువారం ప్రకటించిన ఈ క్యూ1 ఫలితాల్లో రూ.3.87కోట్ల నికరనష్టం నమోదుకాగా, గతేడాది ఇదే క్యూ1 కాలానికి రూ.2.15కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఇదే క్యూ1లో సంస్థ మొత్తం ఆదాయం

Most from this category