STOCKS

News


ఈ ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధి

Friday 12th January 2018
news_main1515781020.png-13096

  • సింగపూర్‌ డీబీఎస్‌ అంచనా

సింగపూర్‌: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం వృద్ధిని సాధించగలదని సింగపూర్ బ్యాంకింగ్‌ దిగ్గజం డీబీఎస్‌ అంచనా వేసింది. ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందనే ప్రోత్సాహకర సూచనలు కనిపిస్తున్నాయని, క్రమానుగత రికవరీ కొనసాగుతోందని తన తాజా నివేదికలో డీబీఎస్‌ పేర్కొంది. వచ్చే ఏడాది భారత్‌ 7 శాతం వృద్ధి సాధించగలదని చెప్పిన ఈ నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలివీ...

  •  జీఎస్‌టీకి సంబంధించిన ప్రభుత్వ సవరణలు, బ్యాంక్‌లకు మూలధన నిధులు అందించడం, పెట్టుబడుల వృద్ధి పటిష్టంగా ఉండడం తదితర కారణాల వల్ల వృద్ధి స్థిరీకరణ చెందుతోంది. 
  •  గత ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతంగా ఉన్న పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 శాతానికి మెరుగుపడ్డాయి. 
  •  వినియోగం మెరుగుపడుతోంది. దీనికి తోడు ఎగుమతి ఆర్డర్లు కూడా పెరుగుతుండటంతో తయారీ, సేవల రంగాలు పుంజుకుంటున్నాయి. 
  •  వ్యవసాయోత్పత్తి బలహీనంగా ఉండగలదని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ ఏడాది రెండో అర్థభాగంలో వ్యవసాయోత్పత్తి అంచనాలను మించే అవకాశాలుండటంతో వార్షిక వ్యవసాయోత్పత్తి పెరుగుతుంది. 



You may be interested

సీఏ సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం లేదు

Friday 12th January 2018

చార్టర్డ్‌ అకౌంటెంట్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం: ఐసీఏఐ న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్స్‌ విషయంలో పాత్ర కలిగిన ఆడిటర్లపై విడిగా గరిష్ట పరిమితి మేరకు చర్యలు తీసుకున్నామని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. అయితే, సీఏ సేవలు అందించే సంస్థలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం నేపథ్యంలో ఆ సంస్థకు ఆడిటింగ్‌ సేవలు అందించిన ప్రైస్‌ వాటర్‌హౌస్‌

‘అపోలో మైక్రో’ 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

Friday 12th January 2018

 శుక్రవారం ముగిసిన ఐపీఓ  ఈ నెల 22న లిస్టింగ్‌! న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) 248 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ అయింది. రక్షణ, విమానయాన రంగాలకు హార్డ్‌వేర్‌ సొల్యూషన్లనందించే ఈ కంపెనీ ఐపీఓ ఈ నెల 10న మొదలై శుక్రవారం ముగిసింది. రూ.270-275 ధరల శ్రేణితో వచ్చిన ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.156 కోట్లు సమీకరిస్తోంది. ఐపీఓ కింద జారీ చేస్తున్న 41,44,955

Most from this category