STOCKS

News


డీమార్ట్‌ ర్యాలీ ఎక్కడి వరకు...?

Monday 30th April 2018
Markets_main1525092830.png-16025

ఈక్విటీ మార్కెట్లో వ్యాల్యూ ఇన్వెస్టర్‌గా పేరుబడిన రాధాకిషన్‌ దమానీ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ (డీమార్ట్‌) పేరుతో గతేడాది ఐపీవోకు వచ్చిన తర్వాత ఈ కంపెనీ షేరు అనూహ్యంగా పెరిగిపోయింది. ఆఫర్‌ ప్రైస్‌ రూ.299 అయితే, ప్రస్తుతం ఈ స్టాక్‌ ధర రూ.1,500 దరిదాపుల్లో ఉంది. ఐదు రెట్లు ర్యాలీ చేసింది. విశ్లేషకులను, ఫండ్‌ మేనేజర్లను, ఆర్థిక నిపుణులను ఈ ర్యాలీ ఆశ్చర్యపరించింది. మరి ఈ స్టాక్‌ గమనంపై వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

డీమార్ట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.లక్ష కోట్ల దరిదాపుల్లో ఉంది. ఇటీవల ఈ స్టాక్‌ రూ.1,516 వరకు ర్యాలీ చేసి బ్రేక్‌ తీసుకుంది. దీంతో దమానీ సంపద 12 బిలియన్‌ డాలర్లకు చేరగా, ఈ కంపెనీ ఎండీ, సీఈవో నవిల్‌ నొరొన్హా సంపద రూ.2,000 కోట్లకు పెరిగింది. డీమార్ట్‌ 2002లో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2004 జనవరిలో ఆ కంపెనీ ఆపరేషన్స్‌ హెడ్‌గా నొరొన్హా చేరారు. దాంతో కంపెనీలో 2.2 శాతం వాటా ఆయనకు లభించింది. అదే ఇప్పుడు రూ.2,000 కోట్ల సంపదగా మారింది. 2007లో సీఈవో అయిన ఆయన, 2011 నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 141 స్టోర్లు ఉన్నాయి. అయితే, డీమార్ట్‌ షేరు ధరపై బ్రోకరేజీ సంస్థలు నెగెటివ్‌గానే ఉన్నాయి. చాలా స్వల్ప కాలంలోనే ఎక్కువగా ఈ షేరు పెరిగిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

అరుదైన లాభాలు ఈ కంపెనీ సొంతం

అరుదైన లాభాలు కలిగిన రిటైల్‌ కంపెనీగా డీమార్ట్‌ను ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంటోంది. వినూత్నమైన, బలమైన వ్యాపారాన్ని విజయవంతంగా ఈ సంస్థ నెలకొల్పిందని ఎడెల్వీజ్‌ తన పరిశోధన నివేదికలో పేర్కొంది. ‘‘స్టోర్ల నిర్వహణలో సమర్థత, మంచి ఉత్పత్తుల మిశ్రమం, సరఫరా, ప్యాకేజింగ్‌ కేంద్రాల బలంతో తక్కువ వ్యయాలు కలిగిన నిర్మాణాన్ని కలిగి ఉంది. స్టోర్ల విస్తరణ వేగంగా చేపడుతూనే వృద్ధిని కొనసాగిస్తోంది. మార్చి త్రైమాసికంలోనూ ఒకే స్టోర్‌ నుంచి విక్రయాల్లో 20 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా. ఏటా 2.5 శాతం ఎబిటా మార్జిన్లలో వృద్ధిని నమోదు చేస్తుంది’’ అని ఎడెల్వీజ్‌ పేర్కొంది. ఈ సంస్థ మే 5న ఫలితాలను ప్రకటించనుంది.

ఖరీదైన స్టాక్‌

డీమార్ట్‌ స్టాక్‌ వ్యాల్యూషన్లు ఎక్కువగానే ఉన్నాయన్నది చాలా మంది అభిప్రాయం. కంపెనీ పనితీరు త్రైమాసికం నుంచి త్రైమాసికానికి వృద్ధి చెందుతున్నప్పటికీ స్టాక్‌ పరుగులు మాత్రం ఆందోళన కలిగించేవనంటున్నారు. గ్రోసరీ రిటైల్‌లో ఇక ముందూ ఇదే స్థాయిలో వృద్ధి కొనసాగించడం కష్టమేనంటున్నారు. ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ అయితే ఈ స్టాక్‌కు హోల్డ్‌ రేటింగ్‌ ఇచ్చి రూ.1,370 టార్గెట్‌ ధరను ఇచ్చింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ సెల్‌ రేటింగ్‌తో రూ.1,487 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రభుదాస్‌ లీలాధర్‌ సైతం స్టాక్‌ టార్గెట్‌ ధరను రూ.1,469కు తగ్గింది. కోటక్‌ సెక్యూరిటీస్‌ కూడా సెల్‌ రేటింగ్‌ ఇచ్చి ఈ స్టాక్‌ రూ.810 వరకు పడిపోవచ్చని అంచనా వేసింది. You may be interested

మార్కెట్ లావాదేవీలపై ఒకే పన్ను

Monday 30th April 2018

 పీడబ్ల్యూసీ సిఫార్సు న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలపై బహుళ పన్నులు వడ్డించడం కాకుండా ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా అభిప్రాయపడింది. బహుళ పన్నుల వల్ల లావాదేవీల వ్యయం పెరిగిపోయి, దేశీ మార్కెట్ల విషయంలో ఇన్వెస్టర్ల ఆసక్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధిస్తున్న సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్‌, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌లలో ఏదో ఒకటి మాత్రమే విధించాలని ఆదాయ

స్టాక్స్‌లో సంపాదించలేకపోతున్నారా... మరెందుకు ఆలస్యం?

Monday 30th April 2018

ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతమవుతోంది. 6 కోట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌, మ్యూచువల్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. స్టాక్స్‌లో పెట్టుబడులు ఇంకా ప్రారంభంలోనే ఉండగా, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. అయితే, కొందరు ఈక్విటీల్లో స్వయంగా ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ, లాభాలు వచ్చినట్టే ఉంటాయి. కానీ, ఏదో ఒక రోజు ఆ లాభం సున్నా స్థాయికి వెళుతుంది. మరి ఈ క్రమంలో స్టాక్స్‌కు

Most from this category