STOCKS

News


క్రీమ్‌లైన్‌ డెయిరీ విస్తరణ

Wednesday 16th May 2018
news_main1526489273.png-16527

  • కొత్తగా మరో మూడు ప్లాంట్లు
  • రూ.400 కోట్ల పెట్టుబడి
  • సంస్థ ఎండీ భాస్కర్‌ రెడ్డి

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: జెర్సీ బ్రాండ్‌ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్‌ డెయిరీ ప్రొడక్ట్స్ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్‌ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కంపెనీ ప్రాసెసింగ్‌ సామర్థ్యం రోజుకు 12 లక్షల లీటర్లు ఉంది. విస్తరణతో ఇది 15 లక్షల లీటర్లకు చేరుతుందని చెప్పారు. రూ.35 కోట్లతో వైజాగ్‌ వద్ద నిర్మిస్తున్న రోజుకు లక్ష లీటర్ల కెపాసిటీగల ప్లాంటు ఈ ఏడాది చివరికల్లా కార్యరూపంలోకి వస్తుందన్నారు. 
మూడు వేరియంట్లలో..
గోద్రెజ్‌ అగ్రోవెట్‌ అనుబంధ కంపెనీ అయిన క్రీమ్‌లైన్‌ డెయిరీ జెర్సీ థిక్‌షేక్స్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. 180 మిల్లీలీటర్ల ఈ ఫ్లేవర్డ్‌ మిల్క్‌ ప్యాక్‌ ధర రూ.25 ఉంది. రూ.22,000 కోట్ల శీతల పానీయాల మార్కెట్లో పాలతో తయారైన ఉత్పత్తుల వాటా 4 శాతం. అయితే వృద్ధి పరంగా చూస్తే అత్యధికంగా 15 శాతం నమోదు చేస్తోందని క్రీమ్‌లైన్‌ డెయిరీ సీఈవో రాజ్‌ కన్వర్‌ తెలిపారు. దేశంలో డెయిరీ ఇండస్ట్రీ 5-6 శాతం వార్షిక వృద్ధితో రూ.6 లక్షల కోట్లుంది. 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని గోద్రెజ్‌ అగ్రోవెట్‌ ఎండీ బలరామ్‌ సింగ్‌ యాదవ్‌ వెల్లడించారు. రుచి సోయా ఆయిల్‌పామ్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను దాఖలు చేశామని పేర్కొన్నారు.


 



You may be interested

హిందాల్కో లాభం రూ.377 కోట్లు

Wednesday 16th May 2018

25 శాతం డౌన్‌ రికార్డ్‌ స్థాయి రాగి ఉత్పత్తి  న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.377 కోట్ల నికర లాభం(స్డాండ్‌ ఎలోన్‌) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2016-17) క్యూ4లో వచ్చిన నికర లాభం, రూ.503 కోట్లతో పోల్చితే 25 శాతం క్షీణించిందని హిందాల్కో వివరించింది. మొత్తం ఆదాయం కూడా రూ.11,970 కోట్ల నుంచి రూ.11,886 కోట్లకు తగ్గిందని

ముత్తూట్ ఫైనాన్స్‌ లాభం రూ. 451 కోట్లు

Wednesday 16th May 2018

న్యూఢిల్లీ: రుణాల పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పుల చేసిన నేపథ్యంలో గడిచిన ఆర్థిక సంవత్సరం క్యూ4లో ముత్తూట్ ఫైనాన్స్ నికర లాభం 40 శాతం ఎగిసి రూ. 451 కోట్లుగా నమోదైంది. 2016-17 మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 322 కోట్లుగా ఉంది. మరోవైపు ఆదాయం రూ. 1,573 కోట్ల నుంచి రూ. 1,710 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 1,180 కోట్ల నుంచి

Most from this category