STOCKS

News


కార్పొరేషన్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,240 కోట్లు

Monday 12th February 2018
news_main1518459922.png-13917

  • పెరిగిన మొండి బకాయిలు 

న్యూఢిల్లీ: కార్పొరేషన్‌ బ్యాంక్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.1,240 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.159 కోట్ల నికర లాభం సాధించామని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.1,035 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,840 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.4,841 కోట్లకు తగ్గిందని తెలిపింది. 
 రెట్టింపుకు పైగా  కేటాయింపులు...
స్థూల మొండి బకాయిలు 11.26 శాతం నుంచి 15.92 శాతానికి, నికర మొండి బకాయిలు 7.64 శాతంనుంచి 10.73 శాతానికి పెరిగాయని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. ఇక మొండి బకాయిలకు కేటాయింపులు రూ.992 కోట్ల నుంచి రూ.2,495 కోట్లకు పెరిగాయని పేర్కొంది. గత ఏడాది డిసెంబర్‌ చివరినాటికి ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో 59.48 శాతంగా ఉందని కార్పొరేషన్‌ బ్యాంక్‌ తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కార్పొరేషన్‌ బ్యాంక్‌ షేర్‌ 2 శాతం వరకూ లాభపడి రూ.36 వద్ద ముగిసింది. 



You may be interested

శ్రీమలానితో ఐకియా జట్టు

Monday 12th February 2018

చిన్నశంకరంపేట(మెదక్‌): స్వీడన్‌కి చెందిన ఫర్నీచర్ దిగ్గజ సంస్థ ఐకియా తాజాగా శ్రీమలాని ఫోమ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఐకియా సంస్థకు తాము స్ప్రింగ్‌ ఫోమ్స్‌ను సరఫరా చేయనున్నట్లు శ్రీమలాని ఫోమ్స్ ఎండీ సిద్ధార్థ మలాని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కూడా ఈ ఒప్పందం తోడ్పడగలదని ఆయన వివరించారు. భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే క్రమంలో శ్రీమలాని ఫోమ్స్‌తో చేతులు కలిపినట్లు

జీఐసీ రీ లాభం రూ.673 కోట్లు

Monday 12th February 2018

గత క్యూ3లో రూ.401 కోట్ల నికర నష్టాలు  ముంబై: ప్రభుత్వ రంగ రీ ఇన్సూరెన్స్‌ దిగ్గజం జీఐసీ రి  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.673 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.401 కోట్ల నికర నష్టాలు వచ్చాయని జీఐసీ రీ తెలిపింది. గత క్యూ3లో 105.9 శాతంగా ఉన్న కంబైన్డ్‌ రేషియో ఈ క్యూ3లో 101.1 శాతం సాధించడం, వాహన, సముద్ర, అగ్ని

Most from this category