News


సిటీలో బస్‌ జర్నీ.. సో ఈజీ

Friday 18th August 2017
startups_main1503908177.png-7221

  •   హైదరాబాద్‌లో మినీ బస్సు సర్వీసులందిస్తున్న కమ్యూట్‌
  •  కి.మీ.కు రూ.3 చార్జీ; రోజుకు 2 వేల మంది ప్రయాణం
  •  ప్రస్తుతం 75 మినీ బస్సులు; 2 నెలల్లో 200 వాహనాల లక్ష్యం
  •  రూ.1.3 కోట్ల నిధుల సమీకరణ పూర్తి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హైదరాబాద్‌లో రోజూ 30 కి.మీ. దూరంలో ఉన్న ఆఫీసుకు వెళ్లి రావాలంటే? బస్సులో అయితే గంటల తరబడి ప్రయాణం, సీటుకు నో గ్యారంటీ!
పోనీ, ఓలా లేదా ఉబర్‌ వంటి క్యాబ్‌లను బుక్‌ చేద్దామంటే సర్‌చార్జీ పేరిట జేబు గుళ్లు!
పోనీ, బైక్‌ మీద వెళ్దామంటే గతుకుల రోడ్లు, ట్రాఫిక్‌ ఇబ్బందులు!!
మరెలా? వీటన్నింటికీ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అందిస్తోంది హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌.. కమ్యూట్‌.కామ్‌. ప్రయాణ సమయం, స్థలం ఎంపిక చేస్తే చాలు.. ఇంటికొచ్చి మిమ్మల్ని పికప్‌ చేసుకొని గమ్య స్థానంలో చేరవేర్చటం దీని ప్రత్యేకత. మరిన్ని వివరాలు కమ్యూట్‌.కామ్‌ కో–ఫౌండర్‌ చరణ్‌ మాటల్లోనే..
కమ్యూట్‌.కామ్‌ ఫౌండర్లలో నాతో పాటూ హేమంత్‌ జొన్నలగడ్డ, ప్రశాంత్‌ గారపాటి, సందీప్‌ కాచవరపు, అక్షయ్‌ చిన్నుపాటి, శృజయ్‌ వరికుట్టి కూడా ఉన్నారు. 2015 నవంబర్‌లో కమ్యూట్‌.కామ్‌ను ప్రారంభమైంది.
బుకింగ్‌ చాలా ఈజీ..
కమ్యూట్‌ బస్‌లో ప్రయాణం బుకింగ్‌ చేసుకునే విధానం కూడా చాలా సులువు. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యాప్స్, వెబ్‌సైట్‌ నుంచి కూడా బుక్‌ చేసుకోవచ్చు. ముందుగా కమ్యూట్‌.కామ్‌కు లాగిన్‌ అయి.. రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ తర్వాత పేరు, ఫోన్‌ నంబర్, పికప్, డ్రాపింగ్‌ పాయింట్ల, సమయాన్ని ఎంచుకొని కమ్యూట్‌ వ్యాలెట్‌ నుంచి చార్జీలు చెల్లిస్తే చాలు. ఆఫీసు సమయాల్లో అంటే ఉదయం 7 నుంచి 11 మధ్య, సాయంత్రం 5 నుంచి 8 మధ్య ప్రతి 15 నిమిషాలకొక బస్సును నడుపుతున్నాం. మిగిలిన సమయాల్లో అరగంటకొక బస్సు నడుస్తుంది.
50 రూట్లు, 75 మినీ బస్సులు..
ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, బాచుపల్లి, అల్వాల్‌ వంటి నగరం మొత్తం 50 రూట్లలో బస్సులను నడుపుతున్నాం. 12, 15, 21 సీట్ల మినీ బస్సులు 75 వరకూ వున్నాయి. 45 వేల మంది రిజిస్టర్‌ యూజర్లున్నారు. ఇప్పటివరకు 4.5 లక్షల మంది మా సేవలను వినియోగించుకున్నారు. రోజుకు 2 వేల మంది మా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 75–80 ఆక్యుపెన్సీ ఉంటుంది. రోజుకు వాహనాలన్నీ కలిపి 6 వేల కి.మీ. తిరుగుతుంటాయి. కి.మీ.కు రూ.3 చార్జీ ఉంటుంది. వారం, నెలవారీగా కూడా ప్యాకేజీలుంటాయి. వీటికి ఆఫర్లు, డిస్కౌంట్లుంటాయి.
ఏడాది ముగింపు నాటికి నిధుల సమీకరణ..
ప్రతి నెలా 20 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. త్వరలోనే టెక్నాలజీ, సేల్స్‌ విభాగంలో మరో పది మందిని తీసుకోనున్నాం. ‘‘ఇటీవలే హెచ్‌2ఓ క్యాబ్స్‌ను కొనుగోలు చేశాం. 2 నెలల్లో 200 వాహనాలకు చేర్చాలని లక్ష్యించాం. ఇప్పటివరకు 50కే వెంచర్స్‌ నుంచి రూ.1.3 కోట్ల నిధులను సమీకరించాం. ఈ ఏడాది ముగింపు నాటికి మరో విడత నిధులను సమీకరించనున్నాం. ఆ తర్వాతే ఇతర నగరాలకు విస్తరిస్తామని’’ చరణ్‌ వివరించారు.
 







You may be interested

హయత్‌నగర్‌లో బృందావన్‌ మిడోస్‌

Friday 18th August 2017

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలంలోని సాహెబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్‌ అండ్‌ ఏఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ బృందావన్‌ మిడోస్‌ పేరిట లే అవుట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ గేటెడ్‌ కమ్యూనిటీలో 30, 40, 60 ఫీట్ల అంతర్గత రోడ్లతో పాటూ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్, వీధి లైట్లు, గ్రీనరీ వంటి అన్ని రకాల వసతులను అభివృద్ధి చేస్తున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈఎంఐ, బ్యాంకు రుణ సదుపాయాలను

పొదుపు ఖాతాలపై మరిన్ని బ్యాంకుల రేట్ల కోత!

Friday 18th August 2017

 తాజాగా నిర్ణయం తీసుకున్న  ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్‌లు ముంబై: పొదుపు ఖాతాలపై డిపాజిట్‌ రేట్ల కోత  విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను శుక్రవారం మరికొన్ని బ్యాంకులు అనుసరించాయి. వీటిలో ప్రైవేటు రంగంలోని  దిగ్గజ బ్యాంకులు- ఐసీఐసీఐ , హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంకులు ఉన్నాయి. దీనితోపాటు ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), యూనియన్‌ బ్యాంక్‌ కూడా తమ పొదుపు

Most from this category