STOCKS

News


సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగింపు

Friday 12th January 2018
Markets_main1515753281.png-13088

ముంబై:- దేశీయ సూచీలు శుక్రవారం కొత్త రికార్డులను నమోదు చేసి సరికొత్త గరిష్టస్థాయి వద్ద ముగిశాయి. మీడియా, మెటల్‌, బ్యాంక్‌ రంగ షేర్ల ర్యాలీకి తోడు, యూరప్‌ మార్కెట్ల సానూకూల ఓపెనింగ్‌... సూచీలు ర్యాలీకి కారణమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 88.90 పాయింట్ల లాభంతో 34,592 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16.65 పాయింట్ల లాభంతో 10,667 పాయింట్ల వద్ద ముగిశాయి.  సెన్సెక్స్‌ 34,342 -34,638 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. బీఎస్‌ఈలో మెటల్‌, ఇంధన, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1శాతం వరకూ లాభపడ్డాయి. నిఫ్టీ సూచీ 10,597.10-10,690.40 శ్రేణిలో కదలాడింది.  కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ 25,749 వద్ద ముగిసింది.
రికార్డు ఓపెనింగ్‌:-
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూలతలతో నేటి ఉదయం సూచీలు కొత్త రికార్డులతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 34,578.99 వద్ద నిఫ్టీ 10,682.55 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడం, దేశీ ఫండ్స్‌ భారీ కొనుగోళ్ల నేపథ్యంలో సూచీలు మరోసారి కొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్‌ 34,638 వద్ద, నిఫ్టీ 10,690 వద్ద తమ జీవితకాలపు గరిష్టాలను నమోదు చేశాయి.
‘‘సుప్రీం’’ షాక్‌..!
సూచీలు సాఫీగా ర్యాలీ చేస్తున్న ఈ తరుణంలో ఎవరూ ఊహించని విధంగా నలుగురు సుప్రీం కోర్టు జడ్జ్‌లు భారత ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మీడియా ముందుకు వచ్చారు. జస్టిస్‌ లోయా మృతి కేసుకు సంబంధించి బెంచ్‌ కేటాయింపులు తదితర అంశాలపై సీజేఐపై జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రంజన్‌ గొగాయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశీ సూచీలు ఉన్నట్టుండి  మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నెగిటివ్‌లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్‌ 150 పాయింట్ల మేర తగ్గగా, నిఫ్టీ 10,600 పాయింట్ల దిగువకు పడిపోయింది.
అనూహ్యంగా లాభాల్లోకి..!
అయితే, సూచీలు ‘‘సుప్రీం’’ షాక్‌ నుంచి అనూహ్యంగా కోలుకున్నాయి. మీడియా, మెటల్‌, బ్యాంకింగ్‌, పైనాన్షియల్‌ సర్వీస్‌, షేర్ల ర్యాలీ సూచీలను లాభాల్లోకి మళ్లించాయి.
జీలిమిటెడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, వేదాంత, మారుతీ షేర్లు 3నుంచి1శాతం లాభపడగా, లుపిన్‌, యూపీఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, భాష్‌ లిమిటెడ్‌, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి.You may be interested

టాటా కెమికల్స్‌ యూరియా వ్యాపార విక్రయం పూర్తి

Friday 12th January 2018

 విలువ రూ.2,682 కోట్లు   యూరియా రంగంలో తొలి ఎఫ్‌డీఏ డీల్‌ న్యూఢిల్లీ: టాటా కెమికల్స్‌ కంపెనీ తన యూరియా, కస్టమైజ్‌డ్‌ ఫెర్టిలైజర్స్‌ వ్యాపార విక్రయాన్ని పూర్తి చేసింది. టాటా కెమికల్స్‌ ఈ వ్యాపారాన్ని  నార్వేకు చెందిన యారా ఇంటర్నేషనల్‌ ఎఎస్‌ఏ అనుబంధ కంపెనీ యారా ఫెర్టిలైజర్స్‌ ఇండియాకు రూ.2,682కోట్లకు విక్రయించింది. ఈ డీల్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని బబ్రల ప్లాంట్‌ మొత్తాన్ని ఆస్తులు, అప్పులతో సహా యారా ఫెర్టిలైజర్స్‌కు టాటా కెమికల్స్‌ అమ్మేసింది. నియంత్రణలు

ఎల్‌టీసీజీతో నెగిటివ్‌ ప్రభావం

Friday 12th January 2018

వాల్యూరిసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ అంచనా ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌లు, ఈక్విటీలపై దీర్ఘకాలిక క్యాపిటల్‌ గెయిన్‌టాక్స్‌ విధిస్తే మార్కెట్లో బలమైన నెగిటివ్‌ ప్రతిస్పందన వస్తుందని వాల్యూరిసెర్చ్‌ సీఈఓ ధీరేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ ఎంఎఫ్‌ల దీర్ఘకాలిక వృద్ధి గాధను దెబ్బతీసేంతగా ఈ ప్రతిస్పందన ఉండకపోవచ్చన్నారు. ఈ ఏడాది మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యేట్లయితే బాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం ఉత్తమమని సూచించారు. ఎల్‌టీసీజీ విధింపు స్వల్పకాలానికి బలమైన నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చని, ఈ

Most from this category