STOCKS

News


మరో పతనం...మూడు నెలల కనిష్టస్థాయిలో ముగింపు

Wednesday 7th March 2018
Markets_main1520418397.png-14425

-ప్రపంచ మార్కెట్ల ప్రతికూలత

-చల్లారని పీఎన్‌బీ కుంభకోణ సెగలు
ముంబై:- దేశీ మార్కెట్‌ వరుసగా ఆరోరోజూ నష్టాలతోనే ముగిసింది. నేడు ట్రేడింగ్‌లోనూ పీఎన్‌బీ స్కాం కుంభకోణ ప్రభావం కొనసాగడం, ప్రపంచమార్కెట్లు కూడా తిరోగమించడంతో బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మూడు నెలల కనిష్టస్థాయి వద్ద ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 284.11 పాయింట్లు నష్టపోయి 33033.09 వద్ద, నిఫ్టీ 95.05 పాయింట్లు క్షీణించి 10154.20 వద్ద ముగిశాయి. డిసెంబర్‌ 7 తర్వాత స్టాక్‌ సూచీలు ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం.  సెన్సెక్స్‌ 32,991.14 -33,331.21 స్థాయిలో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,141.55 - 10,243.35 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది. కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 314.35 పాయింట్లు నష్టపోయి 24,134.10 వద్ద ముగిసింది. ఇక రంగాల చూస్తే ఒక్క ఎఫ్‌ఎంజీసీ రంగ సూచీ(0.65శాతం) తప్ప మిగతా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి.
బేర్‌మన్న బ్యాంకింగ్‌ షేర్లు:-
నేడు బ్యాంకింగ్‌ షేర్ల పతనం మార్కెట్‌ను దెబ్బతీసింది. పీఎన్‌బీ స్కాం కుంభకోణం దర్యాప్తు విస్రతంకావడంతో బ్యాంకింగ్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ దిగ్గజ షేర్లైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు పతనం సూచీలపై ప్రభావాన్ని చూపాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు హోల్డ్‌ చేస్తున్న బాండ్‌ పోర్ట్‌ఫోలియోతో రూ. 20,000 కోట్ల నష్టాలు సంభిస్తాయన్న అంచనాలతో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ షేర్లు తాజాగా మరింత పడిపోయాయి. ఇటీవల బాండ్‌ ఈల్డ్డ్స పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో బాండ్‌హోల్డర్లకు పుస్తక నష్టాలు సంభవిస్తాయి.  నిఫ్టీ బ్యాంక్‌ సూచి 314 పాయింట్ల నష్టంతో 24,134 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
మార్కెట్‌ను మరింత దెబ్బతీసిన ప్రపంచ సంకేతాలు:-
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‍ట్రంప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు రాజీనామా చేశారన్న వార్తలతో వాణిజ్య యుద్ధం ఉధృతమవుతున్న భయాలు మార్కెట్లో ఏర్పడిన ఫలితంగా ఆసియా సూచీలు నష్టాలతో ముగిసాయి. అలాగే యూరోపిన్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం మరింత దెబ్బతీసింది. అంతేకాకుండా అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు 1 శాతం మేర క్షీణించడంతో మన మార్కెట్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. పైగా చివర్లోనూ ఇన్వెస్టర్ల అమ్మకాల కొనసాగడంతో మార్కెట్‌ వరుసగా ఆరోరోజూ నష్టాలతోనే ముగిసింది.
ఏషియన్‌ పెయింట్స్‌, మారుతి, జీ లిమిటెడ్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ షేర్లు 1నుంచి 2శాతం లాభపడగా, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియన్‌ బుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్‌ షేర్లు 3నుంచి 6.45శాతం నష్టపోయాయి.You may be interested

హీరో కొత్త సూపర్‌ స్ల్పెండర్‌..

Thursday 8th March 2018

ధర రూ.57,190 న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ టూవీలర్‌ తయారీ కంపెనీ ‘హీరో మోటొకార్ప్‌’ తాజాగా కొత్త సూపర్‌ స్ల్పెండర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఢిల్లీలో దీని ఎక్స్‌ షోరూమ్‌ ధర ధర రూ.57,190. ఐ3ఎస్‌ టెక్నాలజీ కూడా ఉన్న కొత్త సూపర్‌ స్ల్పెండర్‌ ద్వారా 125 సీసీ విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటామనే నమ్మకం ఉందని కంపెనీ తెలిపింది. దీన్లో 4 స్ట్రోక్‌ సింగిల్‌ సిలిండర్‌ 125 సీసీ టీవోడీ

ఈ 10 షేర్లలో పెట్టుబడికి సమయం ఇదే..!

Wednesday 7th March 2018

ముంబై: ఈఏడాది జనవరి 29న 36,443 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్టస్థాయిని తాకిన సెన్సెక్స్‌ అక్కడ నుంచి పతనం కొనసాగిస్తూ.. ఇప్పటి వరకు 3,000 పాయింట్లు కోల్పోయింది. ఈ పతనానికి అంతర్జాతీయ కారణాలతో పాటు దేశీయ అంశాలు కూడా తోడు కాగా, ఇటువంటి సమయంలో ఇన్వెస్టర్లు అవకాశాలను వెతికిపట్టుకోవడం సరైన స్ట్రాటజీ అవుతుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుల్‌

Most from this category