STOCKS

News


సెన్సెక్స్‌ ట్రిపుల్‌ ధమకా..!

Friday 23rd February 2018
Markets_main1519381405.png-14162

108 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
ముంబై:- మార్కెట్‌ ఈ వారంతపు రోజైన శుక్రవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 322.65 పాయింట్లు లాభపడి 34,142.15 వద్ద, నిఫ్టీ 108.35 పాయింట్లు లాభపడి 10,491.05  వద్ద ముగిసింది. మెటల్‌, ఫార్మా, ప్రైవేట్‌ రంగాల్లో భారీ కొనుగోళ్లు నేటి మార్కెట్‌ లాభాల ముగింపునకు కారణమయ్యాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 33832.00 - 34167.60  స్థాయిలో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,396.65 - 10,499.10 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ  347.30 పాయింట్లు(1.39 శాతం) లాభపడి 25,302.50 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ల పరంగా చూస్తే  అన్ని సెక్టార్లు లాభాల్లో ముగిశాయి.
సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్‌
ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో మార్కెట్‌ సానుకూలంగా ప్రారంభమైంది. ఇటు దేశీయంగానూ ఎలాంటి ప్రతికూలాంశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు.
సెన్సెక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ:-
మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్‌లో కొనుగోళ్ల పర్వం పోటెత్తడంతో సెన్సెక్స్‌ సూచి మూడు వందల పాయింట్లు లాభాన్ని ఆర్జించింది. చివరి అరగంటలో సెన్సెక్స్‌ సూచి అత్యధికంగా 347 పాయింట్ల లాభపడి 34167.60 వద్ద ఇంట్రాడే గరిష్టస్థాయిని నమోదు చేసింది. బీఎస్‌ఈలోని బ్యాంకింగ్‌, లోహ, లోహసంబంధిత, టెలికాం, హెల్త్‌కేర్‌ రంగాలకు చెందిన షేర్లు భారీ ర్యాలీ సెన్సక్స్‌ ట్రిపుల్‌ సెంచరీ లాభాలకు దోహదపడ్డాయి.
మురిపించిన మెటల్స్‌, ఫార్మా షేర్లు:-
నేటి ట్రేడింగ్‌ ఆద్యంతం మెటల్‌, ఫార్మా షేర్ల హావా కొససాగించింది. మెటల్‌ సూచి 3.19 శాతం లాభపడి 4,028.80 వద్ద, ఫార్మా సూచి 2.64 శాతం ర్యాలీ 9,095.40 వద్ద ముగిసింది. టాటాస్టీల్‌ 6 శాతం లాభపడి మెటల్‌ ఇండెక్స్‌ను, సన్‌ఫార్మా 4శాతం ర్యాలీ చేసి ఫార్మా రంగాన్ని నడిపించాయి.
వేదాంత, టెక్‌ మహీంద్రా, యూపిల్‌, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌ షేర్లు 3నుంచి 6శాతం లాభపడగా, హిందూస్తాన్‌ లివర్‌, ఐషర్‌ మోటర్స్‌, ఇన్ఫోసిస్‌, గెయిల్‌, ఏషియన్‌ పేయింట్స్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి.

 



You may be interested

హైఎండ్‌ బైక్‌ల విక్రయాలు పెరుగుతాయి

Saturday 24th February 2018

కవాసాకి మోటార్స్‌ ఆశాభావం కోల్‌కతా: కవాసాకి మోటార్స్‌ ఇండియా తన హైఎండ్‌ బైక్స్‌ విక్రయాలపై పూర్తి ఆశావహంగా ఉంది. భారత్‌లో ప్రీమియం బైక్‌ల విభాగంలో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు చేసినా కూడా ఇండియాలో ప్రీమియం బైక్స్‌ అమ్మకాల వృద్ధిపై నమ్మకంగా ఉన్నాం. అలాగే మరొకవైపు ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది. ఇది కూడా మాకు సానుకూలాంశం’ అని కవాసాకి మోటార్స్‌ ఇండియా మేనేజింగ్‌

ఈ లార్జ్‌క్యాప్స్‌ అదరగొడతాయ్‌!

Friday 23rd February 2018

ఫలితాల ఆధారంగా అనలిస్టుల అంచనా.. తాజా త్రైమాసికంలో లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు దాదాపుగా మంచి ఫలితాలను ప్రకటించాయి. క్యు3 త్రైమాసిక ఫలితాల ఆధారంగా కొన్ని లార్జ్‌క్యాప్స్‌ అదరగొడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.  - టాటా మోటర్స్‌: నికరలాభం దాదాపు 989 శాతం దూసుకుపోయింది. విక్రయాల్లో 16 శాతం పెరుగుదల నమోదయింది.  - టాటా స్టీల్‌: నికర లాభంలో 390 శాతం పెరుగుదల నమోదు చేసింది. విక్రయాలు 20 శాతం పెరిగాయి.  - హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభంలో 145

Most from this category