STOCKS

News


డబుల్‌ సెంచరీతో 2017కు వీడ్కోలు..!

Friday 29th December 2017
Markets_main1514545015.png-12642

సెన్సెక్స్‌ 34000 పాయింట్ల ఎగువకు..

10530 పాయింట్లు పైకి నిఫ్టీ...
ముంబై:- సూచీలు ఈ ఏడాది లాభాలతో వీడ్కోలు పలికాయి. ఈ ఏడాది మార్కెట్‌ చివరిరోజైన శుక్రవారం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 208.80 పాయింట్లు లాభపడి 34,056.83 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 52.80 పాయింట్లు లాభపడి 10,530.70 వద్ద ముగిశాయి. టెలికాం, ఐటీ, పవర్‌, అటోరంగ షేర్లలో కొనుగోళ్ల ఊపందుకోవడంతో  సూచీలు ప్రారంభం నుంచే లాభపడ్డాయి. దీంతో నేడు ప్రారంభంభమైన జనవరి సీరిస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్‌ లాభాలతో శుభారంభం చేసింది. నిప్టీ- 50 సూచీ 10,488.65-10,538.70 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఎన్‌ఈఎస్‌లోకి కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 25,539.45 వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ, నిఫ్టీ అటో సూచీలు 1శాతానికి పైగా ర్యాలీ చేశాయి.  నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 34,086.05- 33,889.39 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది.
తిరిగి కీలకస్థాయిలపై సూచీలు:-
ఆసియా మార్కెట్ల నుంచి అందుకున్న సానుకూల పవనాలతో నేడు సూచీలు స్వల్ప లాభాలతో ఆరంభమయ్యాయి.  టెలికాం, ఐటీ, పవర్‌ సూచీలు 1శాతానికి పైగా ర్యాలీ చేయడంతో సెన్సెక్స్‌ 34,000 పాయింట్లను నిఫ్టీ 10,500 పాయింట్లను తిరిగి అందుకున్నాయి. గత ట్రేడింగ్‌లో సూచీలు ఆ స్థాయిల్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.
టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, హీరోమోటర్‌ కార్పోరేషన్‌ షేర్లు 2నుంచి 3శాతం లాభపడగా, గెయిల్‌, బీపీసీఎల్‌, హిందూపెట్రో, జీలిమిటెడ్‌, ఐఓసీ షేర్లు 2నుంచి 1శాతం పతనమయ్యాయి.



You may be interested

‘బుల్‌’ చల్‌.. ‘బిట్‌’ హిట్‌!

Friday 29th December 2017

ఒక్క ఇండియానే కాదు. 2017లో యావత్‌ ప్రపంచానిదీ బుల్‌ పరుగే. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లన్నీ జీవితకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. ఏ ఆర్థిక వ్యవస్థకూ తీవ్రస్థాయి కుదుపులు లేవు. మొబైల్‌ విప్లవం కొత్త దశకు చేరింది. యావత్తు టెక్నాలజీకీ మొబైలే కేంద్ర బిందువు. దీంతో కొత్త మొబైళ్లొచ్చాయి. చైనా కంపెనీలు విజృంభించాయి. లెక్కలేనన్ని కొత్త మొబైళ్లు మార్కెట్‌ను ముంచేశాయి. పెద్ద స్క్రీన్లతో యాపిల్‌ తెచ్చిన ఫోన్లూ సూపర్‌హిట్‌. బిలియనీర్ల

సత్తా చాటిన, చూపనున్న 10 షేర్లు ఇవి..!

Friday 29th December 2017

ముంబై: ప్రస్తుత సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్‌ 28 శాతం రాబడిని అందించింది. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా మంచి రాబడిని ఇచ్చింది. నిఫ్టీ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీలు ఎర్నింగ్స్‌ కంటే 25, 46 రెట్లు అధికస్థాయిలో ట్రేడవుతున్నాయి. గడిచిన ఐదేళ్ల సగటు ఆధారంగా చూస్తే 26 శాతం, 116 శాతం ప్రీమియం వద్ద ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు చెబుతున్నారు. ఇంతటి ర్యాలీని ప్రదర్శించిన మన మార్కెట్‌ ఇకపై కూడా ఇదే

Most from this category