STOCKS

News


బేర్‌మన్న బ్యాంకింగ్‌ షేర్లు- నష్టాల్లో ముగిసిన మార్కెట్‌

Tuesday 27th February 2018
Markets_main1519727563.png-14252

ముంబై:- బ్యాంకింగ్‌ షేర్ల భారీ పతనంతో మంగళవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 99.36 పాయింట్లు నష్టపోయి 34,346.39 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు పతనమై 10,554.30 వద్ద ముగిసింది. మార్కెట్‌లో పీ-నోట్ల పెట్టుబడులు ఎనిమిదిన్నరేళ్ల గరిష్టానికి చేరాయనే సమాచారం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో మార్కెట్‌ రెండు వరుసగా లాభాల ముగింపుకు బ్రేక్‌ పడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 34314.87-  34610.79స్థాయిలో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,537.25 - 10,631.65 రేంజ్‌లో ట్రేడ్‌ అయ్యింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ  304.30 పాయింట్లు(1.18 శాతం) నష్టపోయి  25,383.60 పాయింట్ల వద్ద ముగిసింది.
బేర్‌మన్న బ్యాంకింగ్‌ షేర్లు:-
క్రితం లాభాల ముగింపును కొనసాగిస్తూ నేడు కూడా ప్రధాన సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 34,522 పాయింట్ల వద్ద, నిఫ్టీ 10605 వద్ద ప్రారంభమయ్యాయి. అయితే పీఎన్‌బీ ఇటీవల వెల్లడించిన రూ. 11,400 కోట్ల కుంభకోణానికి మరో రూ.1300  కోట్లు అదనమన్న వార్తలు వెలువడగానే  బ్యాంకింగ్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మార్కెట్‌ తిరిగి నష్టాల్లోకి జారుకుంది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ 3.50శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ 1శాతం, నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.18శాతం వరకు పతనమై మార్కెట్‌ నష్టాల ముగింపు కారణమయ్యాయి..
ఎన్‌టీపీసీ, హీరోమోటర్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డాక్టర్‌రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1నుంచి 2శాతం లాభపడగా, కోల్‌ ఇండియా, సన్‌ఫార్మా, యాక్సిక్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, అంబుజా షేర్లు 2నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

ఈ 3 షేర్లు రేసు గుర్రాలు..!

Tuesday 27th February 2018

ముంబై: ప్రస్తుతం నిఫ్టీకి 10630 వద్ద రెసిస్టెన్స్‌ ఉందని, ఇక్కడ బ్రేకఅవుట్‌ సాధించగలిగితే షార్ట్‌టర్మ్‌ ర్యాలీ చోటుచేసుకుని 10720-10820 స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు ఆదిత్య అగర్వాలా అన్నారు. ఒకవేళ 10630 స్థాయిని అధిగమించలేకపోతే 10440-10280 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించారు. ఇండివిడ్యువల్‌ షేర్ల విషయానికి వస్తే.. వచ్చే 3-4 వారాలకాలంలోనే 27 శాతం రాబడిని ఇవ్వగలిగిన 3 షేర్లను సిఫార్సు చేశారు. అవేంటంటే.. ఫ్యూచర్ లైఫ్‌స్టైయిల్‌

మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతాయ్‌

Tuesday 27th February 2018

వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్‌ తీసుకునే...తీసుకోబోయే నిర్ణయాలకు అనుగుణంగా ఇండియా మార్కెట్లో ఒడుదుడుకులు కొనసాగుతాయని అవెండస్‌ క్యాపిటల్‌ అల్ట్రనేట్‌ స్ట్రాటసీజ్‌కు చెందిన ఆండ్రూహాలెండ్‌ అంచనావేస్తున్నారు. ఒక ఆంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అమెరికా వృద్ధిరేటు మార్కెట్‌ అంచనాలకంటే వేగంగా పెరిగితే, వడ్డీ రేట్లు కూడా ఎగిసే అవకాశం వుంటుందని అన్నారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ 4 శాతానికి పెరిగితే మార్కెట్లో 25 శాతం వరకూ కరెక్షన్‌ వుంటుందన్న

Most from this category