STOCKS

News


10500 దిగువకు నిఫ్టీ

Thursday 28th December 2017
Markets_main1514457368.png-12611

ముంబై:- దేశీ మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరగడం, ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభం కావడం, నేడు డిసెంబర్‌ డెరివేటివ్‌ కాంట్రాక్ట్‌ గడువు ముగుస్తుండటం సూచీలపై ప్రభావాన్ని చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 63 పాయింట్లు పతనమై 33,848 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల నష్టపోయి 10,477ల వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సూచీ  34023.65-33752.03 రేంజ్‌లో కదలాడింది. బీఎస్‌ఈ మెటల్‌, రియాల్టీ రంగ సూచీలు 2 నుంచి 3శాతం వరకు లాభపడగా మిగతా రంగాలకు చెందిన సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి.  ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ సూచీ 10,534.55 -10,460.45 పాయింట్ల మద్య కదలాడింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 2 పాయింట్లు నష్టపోయి 25,490.00వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో హిందాల్కో, యూపీఎల్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటాస్టీల్‌ 3శాతం నుంచి 1శాతం లాభపడగా, ఐఓసీ, ఎస్‌బీఐ, బీపీసీఎల్‌, బజాజ్‌-ఆటో, హీరోమోటర్‌ కార్పోరేషన్‌ 3నుంచి 1శాతం నష్టపోయాయి.



You may be interested

దివాలా చట్టానికి సవరణ; లోక్‌సభలో బిల్లు

Friday 29th December 2017

న్యూఢిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ (సవరణ) బిల్లు 2017ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దివాలా ప్రొసీడింగ్స్‌ ద్వారా మొండి బకాయిల (ఎన్‌పీఏ) రికవరీకి సంబంధించిన వేలంలో ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, ఎన్‌పీఏ అకౌంట్‌  హోల్డర్లు బిడ్డింగ్‌ వేయకుండా నిరోధించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అయితే ఆయా వ్యక్తులు తమ బకాయిలన్నింటినీ వడ్డీలు, చార్జీలతో సహా చెల్లించేసినట్లయితే, వారు బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు అర్హులవుతారు.  నవంబర్‌లో

అనలిస్టుల ఆణిముత్యాలివే...

Thursday 28th December 2017

60 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న స్టాకులు ఈ ఏడాది చవిచూసిన ఈక్విటీ ర్యాలీ వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందా? లేదా? అని ప్రతి ఇన్వెస్టర్‌ ఆలోచించే తరుణమిది. ఈ నేపథ్యంలో పలు కంపెనీలను పరీక్షించి వాటిలో 25- 60 శాతం వరకు రాబడినిచ్చే సత్తా(2018లో) ఉన్న 50 కంపెనీలను బ్లూమ్‌బర్గ్‌ ఎంపిక చేసింది. కనీసం ఐదుగురు కన్నా ఎక్కువమంది అనలిస్టులు మక్కువ చూపుతున్న స్టాకులనే ఈ జాబితాలో చేర్చారు.

Most from this category