News


క్యూ2లో చైనా వృద్ధి 6.9%

Tuesday 18th July 2017
news_main1500321048.png-5534

  •  6.5 శాతం లక్ష్యం కన్నా అధికం

బీజింగ్‌: ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.9 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. ఇది ప్రభుత్వం లక్యంగా నిర్దేశించుకున్న 6.5 శాతం కన్నా అధికం. ఈ నేపథ్యంలో అధిక రుణభారం ఉన్నప్పటికీ.. 2017 వృద్ధి లక్ష్యాలను చైనా సునాయాసంగా అధిగమించగలదని పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు తొలి త్రైమాసికం స్థాయిలోనే రెండో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. తమ ఎకానమీ సముచిత శ్రేణిలో స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తున్నామని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్‌) ప్రతినిధి జింగ్ జిహాంగ్ తెలిపారు. వార్షిక వృద్ధి లక్ష్యం సాధన దిశగా పటిష్టమైన పునాది ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తాజా గణాంకాల నేపథ్యంలో చైనా క్యూ3 వృద్ధి అంచనాలను గతంలో పేర్కొన్న 6.6 శాతంనుంచి 6.8 శాతానికి, వార్షిక వృద్ధిని 6.7 శాతం నుంచి 6.8 శాతానికి పెంచుతున్నట్లు నొమురా సెక్యూరిటీస్ ఒక నివేదికలో పేర్కొంది. అటు ప్రాపర్టీ రంగంలో మందగమనం, దేశీయంగా డిమాండ్ తగ్గే అవకాశాలు, అంతర్జాతీయంగా డిమాండ్‌పై అనిశ్చితి నెలకొన్నందున వృద్ధి క్రమంగా మందగించవచ్చన్న అంచనాలు కొనసాగవచ్చని తెలిపింది. జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో చైనాలోని పట్టణప్రాంతాల్లో సుమారు 73.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది. ఇది గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1,80,000 అధికం. గతేడాది కన్నా పది లక్షలు అధికంగా ఈ ఏడాది దాదాపు 1.1 కోట్ల మేర ఉద్యోగాలు కల్పించాలని చైనా నిర్దేశించుకుంది. 







You may be interested

హైదరాబాద్‌లో రెంట్‌మోజో సేవలు షురూ

Tuesday 18th July 2017

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆన్‌లైన్‌ వేదికగా గృహ, కార్యాలయాల్లోని ఫర్నీచర్‌ ఇతరత్రా ఉత్పత్తులను అద్దెకిచ్చే రెంట్‌మోజో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, పుణె, చెన్నై, ముంబై నగరాల్లో సుమారు 25 వేల మంది యూజర్లుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 50 వేలకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. రెంట్‌మోజో ద్వారా ఫర్నీచర్, అప్లియెన్సెస్, బైకులు, వాషింగ్‌ మిషన్లు, రిఫ్రిజిరేటర్, కార్యాలయ ఫర్నీచర్‌ వంటి ఉత్పత్తులను అద్దెకు తీసుకోవచ్చని రెంట్‌మోజో

సత్యం వ్యవహారం... పీడబ్య్లూసీపై త్వరలో సెబీ ఉత్తర్వులు!

Tuesday 18th July 2017

న్యూఢిల్లీ: దాదాపు దశాబ్దం క్రితం నాటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఆడిటింగ్ అవకతవకలకు సంబంధించి ప్రైస్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌పై (పీడ్ల్యూసీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. తుది ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2000 నుంచి 2008 దాకా పీడబ్ల్యూసీ.. సత్యం కంప్యూటర్స్‌కి ఆడిటింగ్ సేవలు అందించింది. సత్యం కంప్యూటర్స్ అనేక సంవత్సరాల పాటు తమ ఖాతాల్లో అవకతవకలకు పాల్పడిన కుంభకోణం 2009

Most from this category