STOCKS

News


డిసెంబర్‌ వాహన విక్రయాలు రయ్‌ రయ్‌

Monday 1st January 2018
Markets_main1514800153.png-12698

ఐషర్‌ మోటార్స్‌ సేల్స్‌ 13 శాతం అప్‌
10 శాతం పెరిగిన హ్యుందాయ్ సేల్స్‌
10% పెరిగిన మారుతీ సుజుకీ విక్రయాలు
8 శాతం పెరిగిన మహీంద్ర అమ్మకాలు

వాణిజ్య వాహనాల విభాగం నుంచి బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో డిసెంబర్‌ వాహన విక్రయాలు 8 శాతం పెరిగినట్లు మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ప్రకటించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది 17,542 యూనిట్లుగా నమోదైన కారణంగా డిసెంబరు మొత్తం అమ్మకాలు 39,200 యూనిట్లకు చేరుకోగలిగిందని కంపెనీ ప్రకటించింది. 2018లో ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగం ముఖ్య పాత్రను పోషించనుందని ఎం అండ్‌ ఎం ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్‌ రాజన్ వాధ్రా ఈ సందర్భంగా అన్నారు.

2016 డిసెంబరు నాటి అమ్మకాలతో పోల్చిచూస్తే 2017 డిసెంబరులో విక్రయాలు 13.1 శాతం వృద్ధి రేటును సాధించాయని ఐషర్‌ మోటార్స్‌ ప్రకటించింది. దేశీయ అమ్మకాలు 14.2 శాతం పెరిగిన కారణంగా వృద్ధి నమోదయ్యిందని.. మొత్తం అమ్మకాలు 3,606 యూనిట్లుగా ఉన్నట్లు తెలిజేసింది.

2017 మొత్తం ఏడాదికి గానూ 5.4 శాతం వృద్ధి రేటును సాధించిన హ్యుందాయ్.. డిసెంబరులో 10 శాతం వృద్ధిని సాధించినట్లు ప్రకటించింది. 2016 డిసెంబరులో 57,164 యూనిట్లను విక్రయించిన కంపెనీ.. 2017 డిసెంబరులో 62,899 యూనిట్లను విక్రయించినట్లు తెలియజేసింది.

కాంపాక్ట్‌, వ్యాన్‌, యుటిలిటీ వాహనాల విభాగాలలో సగటున 20 శాతం వృద్ధిని సాధించడం ద్వారా డిసెంబరు నెల అమ్మకాలు 10 శాతం వృద్ధి చెందినట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.



You may be interested

ఆఖరు గంటలో అమ్మకాలు..​​​​​​​

Monday 1st January 2018

కొత్త ఏడాదిని నష్టాలతో ఆరంభించిన సూచీలు కీలక మద్దతు కోల్పోయాయ్‌! ముంబై:- సూచీలు కొత్త ఏడాదిని  నష్టాలతో  ప్రారంభించాయి. ఈ ఏడాది ట్రేడింగ్‌ ప్రారంభపు రోజైన సోమవారం ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 244.08 నష్టపోయి, 33,812 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 95 పాయింట్లు నష్టపోయి 10,435.55 వద్ద ముగిశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన సూచీలు చివరి గంటలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సూచీలు నేటి మార్కెట్‌ ముగింపు

పవర్‌ షేర్ల ర్యాలీ..!

Monday 1st January 2018

ముంబై:- కొత్త సంవత్సరం ట్రేడింగ్‌ ప్రారంభపు రోజైన సోమవారం పవర్‌ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) విభాగంలోని టాప్‌-10 గెయినర్లలో 3 షేర్లు చోటు దక్కించుకున్నాయి. వాటిలో వరుసగా రిలయన్స్‌పవర్‌, టాటాపవర్‌, అదానీ పవర్‌ షేర్లు ఉన్నాయి. వీటిలో రిలయన్స్‌పవర్‌, టాటాపవర్‌ షేర్లు 52-వారాల గరిష్టాన్ని నమోదు చేయడం విశేషం. రిలయన్స్‌ పవర్‌:- నేటి ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లో 26శాతం ర్యాలీ చేసి రూ. 63.65ల వద్ద 

Most from this category